మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
 
== జీవిత విశేషాలు ==
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో[[మెట్రిక్యులేషన్]] పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని [[మద్రాసు]] నగరానికి మారింది. ఆరోజులలో ''చరిత్ర చతురాననుడు''గా ప్రసిద్ధి చెందిన [[చిలుకూరి వీరభద్రరావు]]తో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం [[విజ్ఞాన సర్వస్వం]] కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]], [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[ఆచంట లక్ష్మీపతి]], మరియు [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.
 
అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నాడు. ఒంటరిగాను, మిత్రుడు [[నేలటూరి వెంకట రమణయ్య]]తో కలిసీ [[నెల్లూరు]] జిల్లాలోను, [[రాయలసీమ]] ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించాడు. ఇతనిని ''శాసనాల శర్మ'' అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా [[అశోకుడు|అశోకుని]] ఎర్ర గుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు చోడ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఇతర శాసనాలు వెలుగులోకి వచ్చాయి.