మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
ఇది [[హైదరాబాదు]]నుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మహబూబ్ నగర్ జిల్లా ను పాలమూర్ అని కూడా పిలుస్తారు .
 
జిల్లాకు దక్షిణాన [[తుంగభద్ర నది]], [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[నల్గొండ]] జిల్లా, ఉత్తరమున [[రంగారెడ్డి]] జిల్లా, పశ్చిమమున [[కర్ణాటక]] లోని [[రాయచూరు]], [[గుల్బర్గా]] జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య దిశలో [[హైదరాబాదు]] జిల్లా ఉంది. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006, పేజీ 233</ref> రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. [[కృష్ణానది|కృష్ణా]] మరియు, [[తుంగభద్ర నది|తుంగభద్ర]] నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచిన[[ఆలంపూర్]]<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133</ref>, [[మన్యంకొండ]], [[కురుమూర్తి]],మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఊర్కొండపేట, [[శ్రీరంగాపూర్]] లాంటి పుణ్యక్షేత్రాలు, [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి]], [[బీచుపల్లి]], వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు|జూరాల]], [[కోయిలకొండ]]కోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 247</ref>) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన [[గద్వాల]] కోట, [[కోయిలకొండ కోట]], [[చంద్రగఢ్ కోట]], పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. [[సురవరం ప్రతాపరెడ్డి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[పల్లెర్ల హనుమంతరావు]] లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, [[గడియారం రామకృష్ణ శర్మ]] లాంటి సాహితీవేత్తలు, [[సూదిని జైపాల్ రెడ్డి]], సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. [[ఎన్.టి.రామారావు]]ను సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది.కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడె తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు ప్రసిద్ధిచెందిన [[నారాయణపేట]], చేనేత వస్త్రాలకు పేరుగాంచిన [[రాజోలి]], కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, [[మామిడి]]పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, [[రామాయణం|రామాయణ]] కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన [[తంగడి]] ప్రాంతం<ref>పాలమూరు వైజయంతి, 2013</ref> ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]].
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
==భౌగోళికం==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
[[దస్త్రం:Mahbubnagar mandals outline.svg|260x260px|<center>మహబూబ్‌నగర్ జిల్లా</center>|alt=|కుడి]]
భౌగోళికంగా ఈ జిల్లా [[తెలంగాణ]] ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. 16°-17° ఉత్తర అక్షాంశం మరియు, 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది.<ref>http://mahabubnagar.nic.in/nic/nic/index.php</ref> 18432 చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాకు దక్షిణంగా [[తుంగభద్ర నది]] సరిహద్దుగా ప్రవహిస్తున్నది. [[కృష్ణా నది]] కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి [[ఆలంపూర్]] వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా [[ఉత్తరం|ఉత్తర]], [[దక్షిణం]]గా 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) [[జాతీయ రహదారి]] మరియు, [[సికింద్రాబాదు]]-[[ద్రోణాచలం]] రైల్వే లైను వెళ్ళుచున్నది. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. [[2001]] [[జనాభా]] గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35,13,934<ref>Handbook of Statistics, Mahabubnagar Dist-2009, published by CPO Mahabubnagar</ref>. జిల్లా వాయువ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు నల్లమల అడవులలో భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు|జూరాల]], దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి.
 
==చరిత్ర==
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం [[పాలమూరు]] అని [[రుక్మమ్మపేట]] అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, 1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ [[మహబూబ్ ఆలీ ఖాన్]] అసఫ్ జా ([[1869]] - [[1911]]) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది. క్రీ.శ. [[1883]]నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా ఉంది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని '''చోళవాడి''' (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన [[కోహినూర్]] వజ్రం మరియు, [[గోల్కొండ]] వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు<ref name="mahabubnagar.nic.in">{{Cite web |url=http://mahabubnagar.nic.in/history.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-01-25 |archive-url=https://web.archive.org/web/20090123140851/http://mahabubnagar.nic.in/history.html |archive-date=2009-01-23 |url-status=dead }}</ref>.
 
ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. జిల్లాలోని ప్రముఖ సంస్థానాలలో [[గద్వాల సంస్థానము|గద్వాల]], [[వనపర్తి సంస్థానము|వనపర్తి]], [[జటప్రోలు సంస్థానము|జటప్రోలు]], [[అమరచింత సంస్థానము|అమరచింత]] మరియు, [[కొల్లాపూర్ సంస్థానము|కొల్లాపూర్]] సంస్థానాలు ప్రముఖమైనవి. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.
 
===పాలించిన రాజవంశాలు===
పంక్తి 61:
 
==మహబూబ్ నగర్ జిల్లా సమాచారం==
[[తెలంగాణ]]లో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా అతి పెద్ద జిల్లా. [[పాలమూరు]] అని కూడా పిల్వబడే ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 10 పురపాలక సంఘాలు (నగర పంచాయతీలతో కలిపి), 2 లోక్‌సభ నియోజక స్థానాలు, 14 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు ఉన్నాయి. [[కృష్ణా నది|కృష్ణా]] మరియు, [[తుంగభద్ర నది|తుంగభద్ర]]లతొ పాటు దిండి, బీమా లాంటి చిన్న నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - ద్రోణాచలం రైల్వే మార్గం ప్రధాన రవాణా సౌకర్యాలు. పంచాయత్‌రాజ్ రహదారులలో మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంది.
 
==ఇతర జిల్లాలలో చేరిన మండలాలు==
పంక్తి 155:
[[దస్త్రం:Mahabubnagar Muncipalities.PNG|250px|alt=పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు|కుడి|పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు]]
 
మహబూబ్ నగర్ జిల్లాలో 11 మున్సీపాలిటీలతో పాటు (నగరపంచాయతీలతో కలిపి) అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (థర్డ్ గ్రేడ్ మున్సీపాలటీ), కల్వకుర్తి (నగర పంచాయతి), కొల్లాపూర్ (నగర పంచాయతి), నాగర్ కర్నూల్ (నగర పంచాయతి), అయిజ (నగర పంచాయతి), జడ్చర్ల (నగరపంచాయతి), అచ్చంపేట్ (నగర పంచాయతి), ఆత్మకూర్ (మేజర్ గ్రామ పంచాయతి), 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష జనాభా పైబడి ఉన్న ఏకైక పట్టణం మహబూబ్‌నగర్. జాతీయ రహదారిపై మరియు, రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పట్టణప్రాంత జనాభా అధికంగా ఉంది. రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే పట్టణ జనాభా మహబూబ్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగానూ, నారాయణపేట డివిజన్‌లో అత్యల్పంగానూ ఉంది.
 
==జనాభా==
పంక్తి 167:
[[బొమ్మ:Mahabubnagar Railway Station.JPG|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ రైల్వే స్టేషను</center>]]
[[బొమ్మ:Mahabubnagar Bus Station.jpg|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ బస్ స్టేషను</center>]]
'''రైలు సౌకర్యం''' : [[దక్షిణ మధ్య రైల్వే]] పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం [[సికింద్రాబాదు]] నుంచి [[కర్నూలు]] గుండా [[తిరుపతి]], [[బెంగుళూరు]] వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషను వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషనులు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషనులు ఉన్నాయి. (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్ మరియు, ఏనుగొండ). కర్ణాటకలోని వాడి మరియు, రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. [[మాగనూరు]] మండలంలోని [[కృష్ణ (మాగనూరు మండలము)|కృష్ణా]] రైల్వేస్టేషను ఈ మార్గంలోనే ఉంది. [[గద్వాల]] నుంచి [[కర్ణాటక]] లోని [[రాయచూరు]]కు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.
 
'''రోడ్డు సౌకర్యం''' : దేశంలోనే అతి పొడవైన [[జాతీయ రహదారి]] అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న [[జాతీయ రహదారి]] కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, [[జడ్చర్ల]], పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-[[బీజాపూర్]] రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.
పంక్తి 177:
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలున్నాయి. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సూదిని జైపాల్ రెడ్డి, మల్లు రవి, పాగపుల్లారెడ్డి, డీకె అరుణ, జూపల్లి కృష్ణారావు, నాగం జనార్థన్ రెడ్డి, పి.శంకర్ రావు తదితర ప్రముఖులు జిల్లా నుంచి ఎన్నికయ్యారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందగా, పలువులు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1989లో అప్పటి [[తెలుగుదేశం పార్టీ]] అధ్యక్షుడు [[ఎన్టీ రామారావు]] కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందినాడు.
 
పార్టీల బలాబలాలు చూస్తే 1983 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆధిపత్యం వహించింది. 1983లో తెలుగుదేశం పార్టీ మరియు, కాంగ్రెస్ పార్టీలు చెరో 6 స్థానాలలో విజయం సాధించాయి. 1985లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు పొందగా 1989లో ఒక్కస్థానం కూడా దక్కలేదు. 1994లో తెలుగుదేశం 11 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా ఇవ్వలేదు. 1999లో తెలుగుదేశం 8, కాంగ్రెస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 7, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి, ఇతరులు 4 స్థానాలు పొందగా తెలుగుదేశంకు ఒక్కస్థానమే లభించింది. 2009లో తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా నాగర్‌కర్నూల్ నుంచి విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావులు రాజీనామా చేశారు. మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన రాజేశ్వర్ రెడ్డి మరణించడంతో మొత్తం 3 స్థానాలకు 2012 మార్చిలో ఎన్నికలు జరుగగా మహబూబ్ నగర్ స్థానం నుంచి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి [[తెరాస]] అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. 2014 మార్చిలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 4, [[తెరాస]] 1, భారతీయ జనతా పార్టీ 1 పురపాలక సంఘాలలో మెజారిటీ సాధించాయి.
 
==కొన్ని గణాంక వివరాలు==
పంక్తి 253:
*'''శిర్సనగండ్ల దేవాలయం''' : అపరభద్రాద్రిగా పేరుగాంచిన క్రీ.శ.14 వ శతాబ్ది కాలం నాటి శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం [[వంగూరు]] మండలంలో ఉంది. ఇక్కడ ప్రతిఏటా చైత్రశుద్ధి పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కూడా ప్రతియేటా దిగ్విజయంగా నిర్వహిస్తారు.
*'''చంద్రగఢ్ కోట''' : ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండపై 18 వ శతాబ్దంలో [[మొదటి బాజీరావు]] కాలం నాటి కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇది [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]] పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో [[నర్వ]] మండల పరిధిలో నిర్మించారు. జూరాల పాజెక్టు సందర్శించే పర్యాటకులకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. 18 వ శతాబ్దం తొలి అర్థ భాగంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడు.
* '''రాజోలి కోట మరియు, దేవాలయాలు''' :పురాతనమైన రాజోలి కోట మరియు, కోటలోపలి దేవాలయాలు సందర్శించడానికి యోగ్యమైనవి. కోట ప్రక్కనే [[తుంగభద్ర నది]]పై ఉన్న సుంకేశుల డ్యాం కనిపిస్తుంది.
* '''[[జహంగీర్ పీర్ దర్గా]]''':[[కొత్తూరు (మహబూబ్ నగర్)|కొత్తూర్]] మండలం, [[ఇన్ముల్‌నర్వ]] గ్రామ సమీపంలో ఉన్న ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందింది. కులమతాలకతీతంగా భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయనాయకులు సైతం కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తుంటారు.
 
పంక్తి 261:
* '''రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి''' : ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడైన [[రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి]] మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు. నిజాంకు కొత్వాల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తరువాత గోల్కొండ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. [[హైదరాబాదు]] . ప్రజాచైతన్యం కల్గించడానికి అనేక విద్యాసంస్థలను స్థాపించాడు.
* '''వందేమాతరం రామచంద్రారావు''' : పాలమూరు జిల్లానుంచి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖ నేతలలో [[వందేమాతరం రామచంద్రారావు]] ఒకడు. ఇతని అసలు పేరు రామచంద్రయ్య. తొలుత [[గద్వాల]] సంస్థానంలో సబ్‌ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూమహాసభలో చేరినాడు. పలుసార్లు జైలుశిక్ష అనిభవించాడు. విచారణ సమయంలో ఊరు, తండ్రిపేరు అడగగా అన్నింటికీ వందేమాతరం అనే సమాధానం ఇచ్చాడు. అందుచే జైలునుంచి విడుదల అనంతరం అందరూ వందేమాతరం రామచంద్రారావు అని పిల్వడం ప్రారంభించారు.
* '''బి.సత్యనారాయణరెడ్డి''' : 1927లో మహబూబ్‌నగర్ జిల్లా అన్నారంలో జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు, నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1990లో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, ఆ తర్వాత ఒడిషా గవర్నరుగా పనిచేశాడు. ఇదే కాలంలో బీహార్, పశ్చిమ బెంగాల్ ఇంచార్జి గవర్నరుగా కూడా విధులు చేపట్టాడు. 2012 అక్టోబరు 6న మరణించాడు
* '''హాస్టల్ రామారావు''' : స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ప్రముఖ పాత్ర వహించిన పాలమూరు వ్యక్తి హాస్టల్ రామారావు అసలు పేరు సంతపూర్ రామారావు. [[కొల్లాపూర్]] మండలం అతని స్వస్థలం. స్వతంత్ర [[భారతదేశం]]లో కలిసేందుకు [[హైదరాబాదు]] సంస్థానం నిరాకరించడంతో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి[[1947]]లో అరెస్టు వారెంట్‌కు గురై రెండేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినాడు. స్వాతంత్ర్యం తరువాత [[నాగర్ కర్నూల్]]లో హరిజనుల కోసం హాస్టల్ ప్రారంభించి హరిజనోద్ధరణకు పాటుపడినందులకు అతని పేరు హాస్టల్ రామారావుగా స్థిరపడింది.
* '''గడియారం రామకృష్ణ శర్మ''' : పాలమూరు జిల్లాకు చెందిన రచయితలలో [[గడియారం రామకృష్ణ శర్మ]] ప్రముఖుడు. ఆయన రచించిన శతపత్రం పుస్తక రచనకు కేంద్ర [[సాహిత్య అకాడమీ]] అవార్డు లభించింది <ref>http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 {{Webarchive|url=https://web.archive.org/web/20071231075544/http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 |date=2007-12-31 }} తీసుకున్న తేది 27.12.2007</ref>. ఇతడు [[1919]]లో [[అనంతపురం]] జిల్లాలో జన్మించి పాలమూరు జిల్లాలోని [[ఆలంపూర్]]లో స్థిరపడ్డాడు. [[2006]] [[జూలై]]లో మరణించాడు. అతడు రచించిన పుస్తకాలలో మాధవిద్యారణ్య చరిత్ర ప్రముఖమైనది.
పంక్తి 280:
 
==వర్షపాతం, వాతావరణం==
మహబూబ్ నగర్ జిల్లాలో [[వర్షపాతం]] తక్కువ. జిల్లా మొత్తంపై సగటు వార్షిక వర్షపాతం 60.44 సెంటీమీటర్లు. అందులో అధికభాగం నైరుతి రుతుపవనాల వల్ల [[జూన్]], [[జూలై]] మరియు, [[ఆగస్టు]] నెలలలో కురుస్తుంది. [[బంగాళాఖాతం]]లో అల్పపీడనం ఏర్పడినప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదౌతుంది. జిల్లాలో సగటు వర్షపాతంలో ప్రాంతాల మధ్య తేడాలున్నాయి. దక్షిణవైపున [[తుంగభద్ర]] మరియు, [[కృష్ణానది]] తీరగ్రామాలు భారీ వర్షాల సమయంలో నీటమునిగితే, జిల్లా వాయువ్య ప్రాంతమైన నారాయణ పేట డివిజన్‌లో కరువు తాండవిస్తుంది.
 
జిల్లాలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. సముద్రతీరం చాలా దూరంలో ఉండుటవల్లనూ, సమీపంలో పెద్ద చెరువులు లేకపోవడం వల్లనూ మరియు, చుట్టూ కొండలు చుట్టబడి ఉండుటచే చల్లని గాలులకు అవకాశం తక్కువగా ఉంది. ఈ వాతావరణం [[ప్రత్తి]] వంటి పంటలకు చాలా అనువైనందున జిల్లాలో ప్రత్తి విస్తారంగా సాగుచేయబడుతున్నది. వేసవి కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. శీతాకాలంలో [[నవంబర్]], [[డిసెంబర్]] మాసాలలో 15-18 డిగ్రీలకు చేరుకుంటుంది. మిగితా జిల్లాలతో పోలిస్తే శీతాకాలంలో చలి తక్కువగా ఉన్ననూ, వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.
{{Weather box
|location = మహబూబ్‌నగర్
పంక్తి 330:
 
==అడవులు==
జిల్లా మొత్తం విస్తీర్ణంలో దాదాపు 10.5% అడవులు ఉన్నాయి. దట్టమైన అడవులు 329 చ.కి.మీ.లతో కలిపి మొత్తం 1944 చ.కిమీ.ల అడవులున్నాయి. ఈ అడవులలో అధిక భాగం జిల్లా ఆగ్నేయాన ఉన్న శ్రీశైలం అడవీప్రాంతంలో ఉంది. జిల్లాలో కల దట్టమైన అరణ్యం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. శ్రీశైలం సమీపంలో కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్న అమ్రాబాదు మండలంలో అధికశాతం అడవులున్నాయి. ఈ ప్రాంతంలోని అడవులలో పులులు మరియు, ఇతర వన్యప్రాణి జంతువులు సంచరిస్తుంటాయి. ఇది 5 జిల్లాలలో విస్తరించియున్న రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగము. జిల్లాలోని అడవులను రెండు డివిజన్ల క్రింద విభజించారు. అచ్చంపేట డివిజన్‌లో 209 హెక్టార్లు ఉండగా మహబూబ్‌నగర్ డివిజన్‌లో కొంత భాగం అడవులున్నాయి.
 
==నీటిపారుదల సౌకర్యం==
దేశంలోనే మూడవ పెద్దనది కృష్ణానది, దాని ప్రధాన ఉపనది తుంగభద్ర మరియు, చిన్న వాగులపై జిల్లాలో జూరాలా ప్రాజెక్టు, ఆర్డీఎస్, కోయిలకొండ ప్రాజెక్టు, సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించగా, సరళా సాగర్ ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, బీమా లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉన్నాయి. పెద్దతరహా మరియు, మధ్యతరహా ప్రాజెక్టులు కలిపి జిల్లాలో 215000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవి కాకుండా కాలువలు, చెరువులు, బోరుబావులు, ఊటబావులు తదితరాల ద్వారా మరో 212000 ఎకరాల భూమి సాగవుతుంది. పంటల వారీగా చూస్తే అత్యధికంగా వరి 145000 ఎకరాలు, వేరుశనగ 71000 నీటిపారుదల సాగు క్రింద ఉంది.
==ఖనిజ వనరులు==
పాలమూరు జిల్లాలో క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, గ్రానైట్ రాయి విరివిగా లభిస్తుంది. కోడంగల్ ప్రాంతంలో నాపరాయి, సున్నపురాయి లభ్యమౌతుంది. గట్టు ప్రాంతంలో బంగారం నిక్షేపాలున్నట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇక్కడ ఇంకనూ పరిశోధనలు జరుగుతున్నాయి.
పంక్తి 340:
 
==క్రీడలు==
జిల్లాలో ప్రజాదరణ కలిగిన క్రీడ [[క్రికెట్]]. ఇది కాకుండా వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎక్కువగా ఆడుతారు. హైదరాబాదు రంజీ జట్టులో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. [[మహబూబ్ నగర్ పట్టణం]]లో క్రీడా స్టేడియం ఉంది. ఇక్కడ జిల్లాస్థాయి మరియు, రాష్ట్రస్థాయికి చెందిన వివిధ పోటీలు జరుగుతాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని స్పోర్ట్స్ పాఠశాల నుంచి పలువులు విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించారు.
 
==జిల్లాలో ఇటీవలి ముఖ్య పరిణామాలు==