థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు): కూర్పుల మధ్య తేడాలు

చి Pranayraj1985 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఈ సంస్థ ద్వారా [[రంగస్థలం|రంగస్థల]] శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది. తమకు తెలిసిన సమాచారాన్ని, విజ్ఞాన్నాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తోంది.
అలాగే నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరునీ, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనుభవాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోవాలని భావిస్తోంది. సమకాలీన తెలుగు నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయంగా అర్థంచేసుకొని, కొంతమేరకైన ఆయా సమస్యలకు పరిష్కారమార్గాలు అన్వేషించి, తెలుగు నాటకరంగ అభివృద్ధిలో కీలకమైన పాత్రని పోషించాలని శాఖ సంకల్పించింది. '''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]''' లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పనిచేస్తున్న డా. [[పెద్ది రామారావు]] ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారువ్యవహరించారు.
 
తెలుగు నాటకరంగాన్ని మరింత ప్రయోజనాత్మకమైన కళాప్రక్రియగా అభివృద్ధిచేయడంకోసం ఈ సంస్థ కృషిచేస్తుంది. విద్యార్థులకు చిన్న వయస్సులోనే నాటకకళ పట్ల అసక్తిని కలిగించగలిగితే వారిలోని సృజనాత్మకత మరింతగా రాణించి మంచి పౌరులుగా తయారుకాగలరు. నాటకకళలో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులు చదువులో కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిషత్తు నాటక సమాజాల సహకారంతో విద్యార్థులకోసం రకరకాల శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేయడం థియేటర్ ఔట్రీచ్ యూనిట్ యొక్క ప్రధాన లక్ష్యం.