మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భౌగోళికం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: మరియు → , (18), typos fixed: , → , (17)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
'''మదనపల్లె''' - ([[ఉర్దూ భాష|ఉర్దూ]] - مدنپلی ) : [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన పట్తణం, రెవిన్యూ డివిజన్.
 
* అధికార భాషలు : [[తెలుగు]] మరియు, [[ఉర్దూ భాష|ఉర్దూ]]
* పిన్ కోడ్ : 517325
* ఎస్.టి.డి. కోడ్ : 08571
పంక్తి 29:
[[File:Madanapalle.jpg|thumb|మదనపల్లె]]
== చరిత్ర ==
మదనపల్లె చరిత్ర క్రీ.శ. 907 వరకూ తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యపు భాగంగా తెలుస్తోంది. ఈ పట్టణంలో గల సిపాయి వీధి (సిపాయి గలీ), కోట గడ్డ (ఖిలా), అగడ్త వీధి (కందక్ గలీ), మరియు, పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానొకప్పుడు ప్రముఖ రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది.
 
మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న మరియు, మాదెన్న లచే పాలింపబడినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్క రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లెగా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు [[అరేబియా]]లోని [[మదీనా]] నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లెగా స్థిరపడిందని చెబుతారు.
 
907 – 955, మధ్యన యాదవనాయకులు మరియు, హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో [[గోల్కొండ]] నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713,లో కడప నవాబైన [[నవాబ్ అబ్దుల్ నబి ఖాన్|అబ్దుల్ నబి ఖాన్]] మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది.
ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు.
[[:en:Sir Thomas Munro|సర్ థామస్ మన్రో]] కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. [[:en:F.B.Manoly|ఎఫ్.బి.మనోలె]] మొదటి సబ్-కలెక్టరు.
పంక్తి 69:
* [[మదనపల్లె (గ్రామీణ)]]
 
== భౌగోళికం మరియు, వాతావరణం ==
 
మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ''ఆంధ్ర ఊటీ'' అనే పేరు ఉంది. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. ''పెన్షనర్ల స్వర్గం''గా కూడా ప్రసిధ్ధి.
పంక్తి 144:
* బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది.
* [[సోంపాళెం]]
* [[రిషి వ్యాలీ]] - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది మరియు, భోజన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విద్యాబోధన జరుగుతుంది.
* [[ఆరోగ్యవరం(శానిటోరియం)]]-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ, ప్రముఖులెందరో ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
* [[బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)]]- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.[[అనీ బెసెంట్]] పేరున స్థాపించబడింది.
పంక్తి 159:
* [[ఎద్దుల శంకరనారాయణ]] : కవి
* [[ఖమర్ అమీని]] ఉర్దూ కవి
* [[కలువకుంట్ల గురునాథ పిళ్ళై]] : మదనపల్లె ప్రాంతీయులకు సుపరిచితమైన పేరు. ముఖ్యంగా ఉపాధ్యాయ మరియు, రచయితలవర్గంలో. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్డు అయినాడు. ఇతని రచనలు ప్రముఖ వార్తా పత్రికలలో, వార మాస పత్రికలలో రావడం సాధారణం.
* [[కవిమలం నారాయణ మూర్తి ]]- రచయిత
* టీ.యస్.ఏ. కృష్ణమూర్తి - రచయిత
పంక్తి 186:
 
== రాజకీయాలు ==
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభ 2 దశకాలలో, మదనపల్లెలో కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం వుండేది. ప్రస్తుతం. పట్టణ ప్రాంతములో కాంగ్రెస్ పార్టీ పట్టు మరియు, గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ పట్టు కలిగివున్నాయి. కానీ మారిన రాజకీయాల దృష్ట్యా 2014 లో పలు మార్పులు సంభవించాయి.
* పార్లమెంటు నియోజకవర్గం : [[రాజంపేట లోకసభ నియోజకవర్గం|రాజంపేట]], ప్రస్తుత ఎం.పి. : పి.మిథున్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)
* అసెంబ్లీ నియోజకవర్గం : (283) 'మదనపల్లె', ప్రస్తుత ఎం.ఎల్.ఎ. : తిప్పారెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)
పంక్తి 197:
== అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ) ==
 
22 సంవత్సరాల క్రిందట [[అంజుమన్ తరఖి ఉర్దూ]] శాఖ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గులాందస్తగీర్, సయ్యద్ అబ్దుల్ అజీం, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖాదర్ హుసేన్ లు కీలక పాత్ర పోషించారు. ఖమర్ అమీనీ, జవాహర్ హుసేన్, అడ్వకేట్ నజీర్ అహ్మద్, షరాఫత్ అలీ ఖాన్, అడ్వకేట్ సికందర్ అలీ ఖాన్, హాజీ ముహమ్మద్ ఖాన్, ఖాజీ ముహమ్మద్ షాకిరుల్లా మరియు, మహమ్మద్ అక్రాలు తమవంతూ కృషి చేశారు. ఉర్దూ భాషాభి వృధ్ధికి, సాహిత్యపోషణకు ఎన్నో పోటీలను వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. [[ముషాయిరా]]లు (కవిసమ్మేళనాలు), సెమినార్లు నిర్వహించారు. మదనపల్లెలో ముషాయిరాల సాంప్రదాయం సయ్యద్ అబ్దుల్ అజీం మరియు, గులాం దస్తగీర్ ఆధ్వర్యంలో ప్రారంభమయినాయి. నిసార్ అహ్మద్ సయ్యద్ మరియు, ఖమీర్ అమీనీ ల ఆధ్వర్యంలో జీవంపోసుకున్నాయి.
 
== మతపరమైన విషయాలు ==
మదనపల్లె పట్టణం సార్వజనీయ పట్టణం. విద్యాధికులు గల పట్టణం. హిందువులూ, ముస్లింలూ మరియు, క్రైస్తవులు కలసి సుఖశాంతులతో జీవించే పట్టణం. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ కే ఆదర్శం. ఇచట శ్రీ వేంకటేశ్వర దేవాలయం, జామా మస్జిద్ మరియు, ఛాంబర్లియన్ చర్చి ప్రసిద్ధమైనవి.
== పత్రికలు ==
 
పంక్తి 209:
మదనపల్లెలో విద్య రాను రాను వికసిస్తోంది, చదువరులు విద్యార్థులు పెరుగుతున్నారు.
* 1936వ సంవత్సరంలో స్థాపింపబడిన బోర్డు ఉన్నత పాఠశాల, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లాలోనే అతి పెద్ద ఉన్నత పాఠశాల. గిరిరావు థియోసాఫికల్ ఉన్నత పాఠశాల, హోప్ ఉన్నత పాఠశాల, హోప్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, మునిసిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాల, సి.ఎస్.ఐ.బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, రామారావు పాఠశాల ముఖ్యమైనవి. ఇవియేగాక ఓ పాతిక ప్రైవేటు ఉన్నత పాఠశాలలు గలవు.
* బి.టి.కాలేజ్, ప్రభుత్వ బాలికల కాలేజ్ లు ముఖ్యమైనవి. ఇవి గాక నాలుగు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మరియు, పది హెను జూనియర్ కాలేజీలు గలవు.
* సాంకేతిక విద్యా సంస్థలూ, బి.ఎడ్., ఇంజనీరింగ్, నర్శింగ్, పాలిటెక్నిక్ సంస్థలూ గలవు.
* నవోదయ పాఠశాల గలదు.
పంక్తి 215:
== ఆరోగ్య సదుపాయాలు ==
 
మదనపల్లెలో హాస్పిటల్స్ ఎక్కువ. [[ఆరోగ్యవరం]], ఎమ్.ఎల్.ఎల్. లేదా మేరీ లాట్ లైలెస్ హాస్పిటల్ (ఇది పాతతరంలో '''గోషా ఆసుపత్రి''' లేదా '''గోషా హస్పతాల్''' గా ప్రసిద్ధి) మరియు, ప్రభుత్వ ఆసుపత్రి పేరు గలవి. గడచిన కాలంలో వైద్య సేవలకు ఘనమైన పేరుగల మదనపల్లె, నేడు అడుగడుగునా నర్సింగ్ హోంలు వెలసిననూ, ఆ పేరును కాలక్రమేణా కోల్పోతున్నది. వ్యాపారరంగంగా మారుతున్న వైద్యరంగాన్ని, సేవారంగంగా తిరిగీ తన స్థానాన్ని కలుగ జేయవలెను. అనేక విభాగాలలో స్పెషలిస్టులు లేని కారణంగా రోగులను తిరుపతి గాని బెంగళూరు గాని వైద్యసేవలకొరకు తరలడం సాధారణంగా కానవస్తుంది.
 
== పరిశ్రమలు ==
పంక్తి 226:
 
== పంటలు ==
ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి, [[మామిడి]], మరియు, కూరగాయలు పండిస్తారు.
నీరుగట్టువారిపల్లెలో వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు ఉంది.
 
== వ్యాపారం ==
మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్‌లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు ప్రముఖ వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, [[టమోటా]], [[మామిడి]], [[సీతాఫలం]], [[చింతకాయ]] కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ [[మదనపల్లె]] సమీపంలోని [[అంగళ్లు]]లో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి.
 
== రవాణా సౌకర్యాలు ==
* మదనపల్లెలో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆం.ప్ర.రా.రో.ర.సం.]] వారి రెండు బస్సు డిపోలు గలవు.
* ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ. దూరంలో సి.టి.యం.రోడ్డులో '[[మదనపల్లె రైల్వే స్టేషను]] ' ఉంది.
* ట్రాన్స్ పోర్టు కొరకు లారీలెక్కువ. ఈ లారీలు ప్రధానంగా టమోటా, మామిడి, సీతాఫలం, వరి, బియ్యం మరియు, వేరుశెనగ రవాణా కొరకు ఉపయోగకరంగా ఉన్నాయి.
 
==భౌగోళికం==
పంక్తి 257:
 
== సినిమాలు ==
మదనపల్లెలో సినిమా హాళ్ళు అధికంగా వుండేవి.ఆంధ్ర రాష్ట్రంలోనే శుభ్రత కలినిగినవిగా పేరొందినవి. నేడు వాటి పరిస్థితి అంతంత మాత్రమే. ఎన్నో సినిమా హాళ్ళు మూతపడ్డాయి.
 
==మండల గణాంకాలు==
పంక్తి 273:
** [[భారత జాతీయగీతం]] ... ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.
* ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విద్యాభ్యాసం చేశారు.
* మదనపల్లె మరియు, ఆ పరిసర ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిధ్ధి.
* [[బాహుదా నది]] పట్టణము మధ్యలో ప్రవహించును. సాధారణంగా మామూలు కాలువలా ఉండే బాహుదా 1996 సంలో [[వరద]]ల కారణంగా ప్రవాహము హెచ్చి ప్రాణ నష్టం జరిగిం
* నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
పంక్తి 291:
{{చిత్తూరు జిల్లాకు సంబంధించిన విషయాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:మదనపల్లె]]
[[వర్గం:చిత్తూరు జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/మదనపల్లె" నుండి వెలికితీశారు