నాగార్జున (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
# లంఖిణిన్ చంపి రావణలంక గాల్చి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
==కథ==
పాండవులు తమలో ఒక్కక్కరితో ద్రౌపది ఏడాది ఉండేటట్లు నిర్ణయించుకున్నారు. నియమ భంగం చేసినవారు సంవత్సరం తీర్ధయాత్రలు చేయాలి. శయ్యాగారానికి ఆనుకుని ఉన్న ఆయుధాగారం నుండి గాండీవం తెచ్చుకోవడానికి వెళ్ళిన అర్జునుడు ద్రౌపది, ధర్మరాజులు ఏకాంతంగా ఉండడం చూశాడు. ఆ తర్వాత్త గో సంరక్షణకై వెళ్ళి రాక్షసులను సంహరించాడు. గగనవీధిన విహరిస్తున్న నాగరాజ కుమారి ఉలూచి అర్జునుని చూసి ప్రేమించి అతను తనను చూడక వెళ్ళిపోతున్న సమయంలో అతని దృష్టిని ఆకర్షించడానికి రాయి గిరవాటేస్తుంది. అది లోయలో పొదిగిన పక్షిగుడ్డుకు తగిలింది. ఆ పక్షి దంపతులు ముని దంపతులుగా మారి ఉలూచికి భర్తృవియోగం సంభవించగలదని శపిస్తారు.
 
నియమభంగానికి అర్జునుడు తీర్థయాత్ర వెళ్ళాడు. వాతాపి అనుసరించాడు. ఉలూచి విరహబాధను గమనించిన చిత్రలేఖ భూలోకానికి వచ్చి తన మాయాశక్తిచే అర్జునుని నాగలోకం చేరుస్తుంది. అర్జునుడు ఉలూచిని ప్రేమిస్తాడు.
 
వాతాపి చిత్రలేఖ అనుకుని సురభి అనే పల్లెపడుచును వెంటపడి నిజం తెలిసిన పిదప తిరిగివస్తాడు. సురభి, వాతాపిల పెళ్ళికి అంగీకరించిన అర్జునుడు రామేశ్వరం వెళ్తాడు.
 
ఉలూచి గర్భవతియై ఇలావంతుని కంటుంది. అర్జునుడు హనుమంతునితో వివాదపడి కృష్ణుని యుక్తి వల్ల విముక్తుడై వెడుతూ, నారదుని సలహాపైన సుభద్రా పరిణయావలోకనుడై సన్యాసి వేషంలో వెడతాడు. సురభి మూగపిల్ల అని గ్రహించిన వాతాపి ఆమెను తృణీకరించి హనుమంతుని సహాయంతో ద్వారక చేరుకుని శుస్రూష చేయసాగాడు.
 
నాగలోకవాసుల నింద భరించలేక ఉలూచి ప్రాధేయయపడగా పార్వతి సాక్షాత్కరించి ఆ బాలుని శిరసుపై శృంగం వుంచి, నాగార్జునుడని నామకరణం చేసి పెంచింది. అతడు అజేయుడు కాగలడని ఆశీర్వదించింది. తండ్రికి ఉత్తరగతులు కల్పించడానికి బయలుదేరిన అర్జునుడు శిరస్సుపై శృంగంగల బాలునికై వెదుకుతూ నాగార్జునుని చూస్తాడు. తన కుమారుడని తెలియక అర్జునుడు యుద్ధానికి తలపడతాడు. ఉలూచి అతడు తన కుమారుడే అని నారదుని వలన విని గ్రహించింది.
 
నాగార్జునునికి సహాయంగా పార్వతీ పరమేశ్వరులు త్రిశూలాన్ని, అర్జునుని తోడ్పాటుగా కృష్ణుడు చక్రాన్ని పంపారు.
 
చివరకు పతాక సన్నివేశంలో నాగార్జునుడు, అర్జునుడు కొడుకు తండ్రులని ఒకరికొకరు తెలుసుకుని కథ సుఖాంతమౌతుంది<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=సంపాదకుడు |title=చిత్రసమీక్ష - నాగార్జున |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=45566 |accessdate=26 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=2 October 1962}}</ref>.
 
==మూలాలు==