"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (39), typos fixed: లో → లో (2), కి → కి , మధ్యము → మద్యము, → (2), , → , (25)
చి (→‎పరిశ్రమలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
చి (clean up, replaced: మరియు → , (39), typos fixed: లో → లో (2), కి → కి , మధ్యము → మద్యము, → (2), , → , (25))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
|state_name = ఆంధ్రప్రదేశ్
|nickname = ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని
|skyline = గోదావరిపై పాత మరియు, కొత్త వంతెనలు 2.jpg
|skyline_caption = Godavari old and new bridges
|latd = 16.98
|footnotes =
}}
'''[[రాజమహేంద్రవరం]]''' (మార్పుకు మందు‌‌:'''రాజమండ్రి''') [[తూర్పు గోదావరి]] జిల్లాలో [[గోదావరి]] నది ఒడ్డున ఉన్న ఒక నగరం. రాజమహేంద్రవరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ''ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని'' అని కూడా అంటారు.<ref name=profile>{{cite web|title=Introductory|url=http://rajahmundrycorporation.org/|publisher=Rajahmundry Municipal Corporation|accessdate=3 September 2014}}</ref> రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది. గోదావరి నది [[పాపి కొండలు]] దాటిన తరువాత [[పోలవరం]] వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న [[ధవళేశ్వరం]] దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ పుణ్యస్థలిలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది [[పుష్కరాలు]] ఘనంగా జరుగుతాయి. ఈ నగరం [[తూర్పుచాళుక్య]] రాజైన [[రాజరాజనరేంద్రుడు]] పరిపాలించిన చారిత్రక స్థలం మరియు, ఆ రాజ్యపు రాజధాని. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరి పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును [[రాజమహేంద్రవరము]]గా మార్చడమైనది.
 
== నగర చరిత్ర ==
[[దస్త్రం:Portrait of Rajaraja Narendrudu.JPG|thumbnail|రాజరాజ నరేంద్రుడి చిత్రపటం]]
[[File:Chalukya vaibhavam.jpg|thumb|రాజమండ్రి నగర సాంస్కృతిక, చారిత్రిక ప్రాధాన్యతను వివరిస్తూ నగర రైల్వేస్టేషన్లో వేసిన [[కుడ్యచిత్రాలు|కుడ్యచిత్రం]]]]
రాజమహేంద్రిని [[రాజరాజ నరేంద్రుడు]] రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతారు. రాజరాజ నరేంద్రుని పూర్వపు రాజుల చరిత్రాధారాలు లేకపోవడం వలన వీరి గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒక కథనం ప్రకారం 919-934 సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆయన తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు (945-970) రాజమహేంద్రిని పరిపాలించారని చెబుతారు. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత సంపాదించుకొంది. నరేంద్రుని పరిపాలనలో [[కవిత్రయం]]లో మెదటివారైన [[నన్నయ్య]] శ్రీ మహాభారతాన్ని తెనుగించడం ప్రారంభించారు. ఈ మహారాజు తరువాత [[విజయాదిత్యుడు]] (1062-1072), కుళోత్తుంగ చోళుడు, రాజరాజవేంగి-2 రాజమహేంద్రిని పరిపాలించారు. [[కాకతీయులు|కాకతీయ]] సామ్రాజ్యంలో రాజమహేంద్రికి ప్రముఖస్థానం ఉంది. 1323లో [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఇప్పటి రాజమహేంద్రవర నడిబోడ్డులో ఉన్న మసీదు తుగ్లక్ పరిపాలనాకాలంలో తూర్పుచాళుక్యులచే నిర్మించబడ్డ వేణుగోపాలస్వామివారి ఆలయ స్థానంలో నిర్మించబడింది. 1326లో ముసునూరి ప్రొలానీడు తీరాంధ్రమును తురుష్కులనుండి విముక్తము చేశాడు. దీనితో రాజమహేంద్రవరము తిరిగి  స్వతంత్రమైనది (A Forgotten Chapter of Andhra History: History of the Musunuri Nayaks) by Mallampalli Somasekhara Sarma పేజీ.14). ఆ తరువాత రెడ్డి రాజులు, కపిలేశ్వర గజపతి, [[బహమనీ సుల్తానులు]], పురుషోత్తమ గజపతి, [[శ్రీకృష్ణదేవరాయలు]], [[ప్రతాపరుద్ర గజపతి]] వంటివారు రాజమహేంద్రిని పరిపాలించారు.
[[File:Rajahmundry Railway station 01.JPG|thumb|left|రాజమండ్రి రైల్వే స్టేషను]]
 
== స్థల పురాణం ==
శ్రీ చక్ర విలసవము అను గ్రంథములో [[శ్రీ చక్రం|శ్రీ చక్ర]] అవిర్భావము గురించిన రెండు పౌరాణిక గాథలలోని రెండవ కథ ఈ విధముగా చెప్పబడింది. ఈ కథ బ్రహ్మాండ పురాణమునకు చెందినది. భండాసురుని జయించుటకై శ్రీదేవిని ఉద్దేశించి [[ఇంద్రుడు]] మహా యజ్ఞము చేసెను. ఆ [[యజ్ఞము]]<nowiki/>న దేవతలు తమతమ శరీరమాంసములను కోసి హోమద్రవ్యముగా నొసగిరి. దేవతల త్యాగమునకు సంతోషించిన [[శ్రీదేవి]] కోటిసూర్య సమమైన తేజముతోను, కోటిచంద్ర శీతలమయూఖములతోను ఆ హోమాగ్ని మధ్యమునమద్యమున ప్రత్యక్షమయ్యెను. [[శ్రీదేవి]] జ్యోతీరూపమైన శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమైనది. (ఈ వృత్తాంతమునే లలితాసహస్రనామావళిలో 'చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా' (4,5 నామములు) అనునవి వెల్లడించుచున్నవి. ఈ వృత్తాంతసందర్బమైన యజ్ఞము నేటి గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరమున గల [[కోటిలింగాల|కోటిలింగ]] క్షేత్రమున జరిగినదనియూ అక్కడే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయిందని స్థలపురాణము.).
 
==సంస్కృతి==
=== కళ, క్రాఫ్ట్ ===
 
ఇక్కడ చిత్రలేఖనంలో ప్రపంచ ఖ్యాతి పొందిన ''దామోర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ'' ఉంది. ఇక్కడ దామోర్ల రామారావు గారి చిత్రాల్లో ముఖ్యమైన ''కృష్ణ లీల'', ''తూర్పు కనుమల గోదావరీ'' మరియు, ''కథియవార్'', [[గౌతమ బుద్ధుడు]] పై ''సిధ్ధార్ద రాగొద్యం'', [[కాకతీయులు|కాకతీయు]]<nowiki/>ల పై ''నంది పూజ'' చిత్రాలు భద్రపరిచారు.<ref>{{cite news|title=Damerla Rama Rao Art Gallery: a picture of neglect|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/damerla-rama-rao-art-gallery-a-picture-of-neglect/article7523945.ece|accessdate=2 July 2016|work=The Hindu|date=11 August 2015|language=en-IN}}</ref>
 
=== గోదావరి పుష్కరాలు ===
{{Main|2015 గోదావరి పుష్కరాలు}}
[[పుష్కరము]] అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. రాజమహేంద్రవరం లోరాజమహేంద్రవరంలో గత పుష్కరాలు 2015లొ జరిగాయి.<ref>{{cite web|title=Godavari Pushkaralu 2|url=http://godavaripushkaralu.co.in/index.html|website=godavaripushkaralu.co.in|accessdate=2 July 2016|archive-url=https://web.archive.org/web/20160520233603/http://godavaripushkaralu.co.in/index.html|archive-date=20 మే 2016|url-status=dead}}</ref> దీని కోసం నిర్మించిన ''కోటి లింగాల ఘాట్'' ముఖ్యమైనది, దీనిని ''అఖండ గోదావరి ప్రాజెక్ట్'' ద్వారా ఆధునీకరిస్తున్నారు.<ref>{{cite news|title=Iconic Kotilingala Ghat loses its sheen|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/iconic-kotilingala-ghat-loses-its-sheen/article8293818.ece|accessdate=2 July 2016|work=The Hindu|date=26 February 2016}}</ref>
 
=== నగరం గురించిన ప్రస్థావన===
[[File:Godavari matha statue.jpg|thumb|రాజమండ్రి రైల్వేస్టేషను భవనంపై [[గోదావరి|గోదావరి మాత]] విగ్రహం]]
[[File:Rajamahendravaram ghats.jpg|thumb|రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున వివిధ ఘాట్లు]]
రాజమండ్రి నగరం ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక పర్యాటక నగరం ఇక్కడ ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఆలయములు వున్నాయి.ఈ యుగానికి అవతారుడైన మెహెర్ బాబా వారి పాదపద్మాలచే పునీతమైన పుణ్య క్షేత్రము. 1953 మరియు, 1954 జనవరి, ఫిబ్రవరి నెలలొ మెహెర్ బాబాను వేలాది సంఖ్యలొ ప్రజలకు దర్సనము కావించుకొన్నారు.
 
===గోదావరి నిత్యా హారతి===
రాజమండ్రి ఒక దివ్య పుణ్యక్షేత్రం. ఈ పుణ్య నగరంలో ప్రతి రోజూ గోదావరి కి నిత్యా హారతి ఇస్తారు దినిని 2015 వ సంవత్సరం గోదావరి మహపుష్కరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు, బుద్ధవరపు చారిటీబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గోదావరి మాతకు నిత్యా హరతి ఇస్తారు అలానే సంవత్సరానికి ఒకసారి కార్తిక పున్నమి రోజున నగర జనుల మధ్య ఎంతో ఘనంగా గోదావరి మాతకు వేద పండితులు హారతి ఇస్తారు. ఈ కార్యక్రమం ఎంతో బాగుంటుంది. అలానే [[కోటగుమ్మం]] లోని మహా శివుని [[విగ్రహము|విగ్రహం]] వద్ద ప్రతి మాస [[మహాశివరాత్రి|శివరాత్రి]]<nowiki/>కి అలానే ప్రti [[సంవత్సరము|సంవత్సరం]] మహా శివ రాత్రికి మహా కుంభ హారతి నిర్వహిస్తారు.
 
===రాజమండ్రి కేంద్ర కారాగారం ===
===దత్త ముక్తి క్షేత్రం===
{{main|దత్త ముక్తి క్షేత్రం}}
ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ నందు కలదు. ఈ క్షేత్రంలో శ్రీ గణపతి ప్రతిష్ఠ, శ్రీ దత్తత్రేయ ప్రతిష్ఠ, మరకత దత్త పాదుకా ప్రతిష్ఠ మరియు, కుంభాభిషేకము శ్రీ శ్రీ శ్రీ గణపతి సఛ్ఛిదానంద స్వామీజీ వారు 2008 వ సంవత్సరము జనవరి మాసము 19, 20వ తేదీలలో నిర్వహించినారు.
 
===ఆర్యభట్ట సైన్సు మ్యూజియం===
 
===ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం===
[[ఇస్కాన్]] శ్రీ కృష్ణ దేవాలయం(అంతర్ జాతీయ శ్రీ కృష్ణ సంఘం) గోదావరీ నదీతీరములో జీవిత సభ్యుల సభ్యత్వరుసుములతో మరియు, భక్తుల నుండి విరాళాలతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇస్కాన్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. చాలా అందంగా ఉంటుంది. నగరంలోని దర్శనీయ ప్రదేశాలలో ఇది ఒకటి.
===కైలాసభూమి===
ఇది హిందువుల యొక్క స్మశానవాటిక. కాని నిజమైన [[కైలాసము]] వలె చాల అందముగా వుంటుంది ఎవరైనా సందర్శించవచ్చు.
 
===ఉమా రామ కోటిలింగేశ్వర స్వామి ఆలయం===
ఈ ఆలయం చాల విశిష్ట మైనది మరియు, పురాతన మైనది. ఈ ఆలయ చరిత్ర పరకారం బ్రమ్మ దేవుడు మహా సరస్వతి సమేతుడై ఇక్కడ కోతిలిగాలకు పూజించారని ఆ కోటి లింగముల లో ని బ్రమ్మ సరస్వతుల చే పూజించా బడిన లింగాకరమే స్వమివారని అంటారు అలాగే ఈ స్వామివారిని అరణ్య వాసము సమయం లో శ్రీ సీతా రాములు పూజించారని చారిత్రక ఆదారాలు చెబుతున్నాయి. అందుకు గుర్తుగా ఇక్కడ శ్రీ అన్న పూర్ణ సమేత కోటిలింగేశ్వర స్వామి వారితో పాటు శ్రీ సీతా రాముల దేవాలయం కుడా వుంది.
===శ్రీ వేణుగోపాలస్వామి గుడి===
శ్రీ [[వేణుగోపాలస్వామి ఆలయం, రాజమండ్రి|వేణుగోపాలస్వామి]] రాజమహేన్ద్రి క్షేత్ర పాలకుడు. ఈ గుడి రాజమండ్రి ముఖ్య వీధిలోని ఇప్పటి "పెద్దమసీదు" స్థానములో ఉండేది. 1323 సంవత్సరములో నూర్ హసన్ (మహమ్మద్ద్ బీన్ తుక్లక్) వేణుగోపాలస్వామి గుడిని మసీదుగా (రాయల్ మాస్క్) మార్చెను. అప్పుడు గుడి పూజారులు కంభం వారి సత్రం వీధిలోని ఒక సందులో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దాచి పూజించేవారు. 14 వ శతాబ్దంలో రెడ్దిరాజులు దేవాలయం నిర్మించి అనపర్తి గ్రామన్ని గుడికి దానం చేసారు. నగర ముఖ్య వీధిలోని రాయల్ మసీదుకు, అప్పటి గుడియొక్క ముఖద్వారము, ద్వారము పైన పద్మము, గుడిలోని 12 దేవాలయ స్తంభాలు, సరోవరం, రాతి కట్టడంతో చదరపాకారములో దిగుడు బావి ఇంకాను అలాగే ఉన్నాయి.
 
===శ్రీ సారంగధీశ్వర స్వామి గుడి===
సారంగధీశ్వర దేవాలయం రాజమండ్రి నగరం నుండి [[కోరుకొండ]] వైపు వెళ్ళే కోరుకొండ రోడ్డు వెళ్తేవచ్చే సారంగధార మెట్టా పై నున్నది. తూర్పు చాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు. రాజరాజనరేంద్రుడినికి సారంగధరుడు అనే కుమారుడు మరియు, చిత్రాంగి అనే రెండవ భార్య ఉండేది. రాజరాజ నరేంద్రుడి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు రాజ రాజ నరేంద్రుడికి పక్కలో బల్లం వలే ఉండేవాడు. ఒకరోజు చిత్రాంగి సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది, వేట పై ఆసక్తి ఉన్న [[సారంగధరుడు]] విందుకు రాకుండా వేటకు వెళ్తాడు. ఆ విషయాన్ని చారులు ద్వారా తెలుసుకొన్న విజయాదిత్యుడు చిత్రాంగి - సారంగధారుడికి అక్రమ సంభంధం ఉన్నదని రాజారాజ నరేంద్రుడి చెబుతాడు. విషయా విషయాలు పరిశీలించకుండా రాజరాజ నరేంద్రుడు సారంగధారుడి రెండు చేతులు, రెండు కాళ్ళు ఖండించాలని శిక్ష వేస్తాడు. సేవకులు రాజాజ్ఞ పరిపాలించి సారంగధారుడిని నగరానికి ఉత్తర దిశలో అడవులతో నిండిన ఒక ఎత్తైన పర్వతం మీద రెండు చేతులు రెండు కాళ్ళు ఖండించి పాడవేస్తారు. సారంగధారుడు రెండు చేతులు కాళ్ళ నుండి నెత్తురు పారుతూ ఉండగా సారంగధారుడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు సారంగ ధారుడికి [[ఆకాశవాణి]] ద్వారా పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల ఈ శిక్షని అనుభవించవలసి వచ్చిందని, ఈ జన్మలో పాపం ఏమి చెయ్యలేదని చెబుతుంది. ఆ ఆర్త నాధం విన్న మేఘనాధ అనే శివ భక్తుడు అక్కడకు వచ్చి సారంగధారుడికి సపర్యలు చేసి, శివుడిని ప్రార్థించమని సలహా చెబుతాడు. సారంగధారుడు మేఘనాధుడి సూచన ప్రకారం శివుడి ఆరాధిస్తే [[శివుడు]] ఆ ప్రార్ధనతో సంతృప్తి చెంది సారంగధారుడికి తన పూర్వపు చేతులు, [[కాళ్ళు]] మరియు, మంచి అందమయిన శరీరాన్ని ప్రసాదిస్తాడు. సారంగధరుడు శివుడి అనుగ్రహంతో పునర్జన్మ పొందిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశం పేరే సారంగధార మెట్ట, ఈ దేవాలయంలో నున్న దేవుడు సారంగధేశ్వరుడు.
 
===కోరుకొండ లక్ష్మీనరసింహ దేవాలయం===
 
===జనార్ధన స్వామి ఆలయం===
ఈ ఆలయం రాజమండ్రి ధవళేశ్వరం ప్రాంతం లో వుంది పురాతనమైనది . ఇక్కడ కూడా ప్రతి ఏట జరిగే తీర్దం మరియు, రధోత్సవము ప్రసిద్ధి చెందినది.
 
===మినీ తిరుమల===
 
=== గౌతమీ గ్రంథాలయం ===
ఇప్పుడు ఉన్న ఈ [[గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి)|గౌతమీ గ్రంథాలయం]] వాసురయ గ్రంధ్రాలయం మరియు, రత్నకవి గ్రంధలయం సముదాయం. ఇవి రెండు చిన్న చిన్నగ్రంథాలయాలు కలుపబడ్డాయి. వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటర్తం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంథాలయం పేరు 1898 ఇవ్వబడింది, 1920 సంవత్సరంలో పేరు రిజిష్టరు చేయబడింది.
 
=== సి.టి.ఆర్.ఐ ===
భారతదేశములోనే ప్రసిద్ధిగాంచిన రీసెర్చ్ సంస్థ ఇది. ఇక్కడ [[పొగాకు]] మరియు, ఇతర అన్ని రకముల మొక్కలకు సంభందించిన ప్రయోగములు జరుపుతారు.
[[పొగాకు]] ఉత్పత్తి సంస్థలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలలో కూడా సి టి ఆర్ ఐ ఒకటి. దీనిని [[1947]]లో స్థాపించారు. పొగాకు సాగు విధానము మొట్టమొదట 1605 వ సంవత్సరములో పోర్ఛుగీసు దేశమునుండి మన దేశమునకు వ్యాపించినది.
 
==నగరంలో ముఖ్య ప్రదేశాలు==
[[దస్త్రం:కోటిపల్లి_బస్సు_స్టేషను_కోటిపల్లి బస్సు స్టేషను .jpg|alt=|కుడి|230x230px]]
[[ఫైలు:Paul chowk kamdukuri veeresalingam.JPG|right|thumb|కోటిపల్లి బస్సు నిలయం వద్ద నున్న కందుకూరి వీరేశలింగం పంతులు]]
పాల్ చౌక్ ఈ ప్రదేశం ఇప్పటి కోటిపల్లి బస్సు నిలయం ఉన్న ప్రదేశం క్రిందకు వస్తుంది. 1907 సంవత్సరం ఏప్రియల్ మాసంలో బిపిల్ చంద్ర పాల్ ఈ ప్రదేశంలోనే ఐదు రోజులు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పటీకి ఆ సంఘటనాను నగరం 50-60 వయస్సు గల ప్రజలు గుర్తు చేసుకొంటుంటారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రదేశాన్ని పాల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఇప్పుడు జెట్టి టవర్స్, కోటీపల్లి బస్సు నిలయం, మూడు పార్కులు ఉన్నాయి. ఈ ప్రదేశం కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం మరియు, [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రదేశం నగరంలో ఒక ముఖ్య కూడలి. ది.6-5-1929 రాత్రి గం. 7-50 కు మహాత్మా గాంధీజీ పాల్ చౌక్ కు చేరుకుని ప్రసంగించారు. ఇక్కడ నుండి పశ్చిమం వైపు పోతే రోడ్డు రైలు వంతెన వస్తుంది, తూర్పు వైపు వెళ్ళితే రాజమహేంద్రవరం [[బస్సు]] కాంపెక్స్ వస్తుంది, ఉత్తరం వైపు వెళ్ళితే శ్యామలా సినిమా ధీయేటర్, ఇంకా ముందుకు వెళ్తే పొట్టి శ్రీరాములు విగ్రహం, రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు వస్తుంది. దక్షిణం వైపు వెళ్ళితే రాజమహేంద్రవరం ప్రధాన తపాలా కార్యాలయం, [[దూరవాణి]] కేండ్రం (టెలిఫోన్ భవన్) రాజమండ్రి జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం రైలు స్టేషను వస్తుంది. ఈ పాల్ ఉన్న ప్రదేశంలోనె మూడు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో స్వాతంత్రత్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి.
 
=== ఇన్నీసుపేట ===
 
=== సీతం పేట ===
కాండ్రేగుల వంశానికి చెందిన వారిచేత ఈ ప్రదేశం పండితులకు, శాస్త్రజ్ఞులకు, పూజారులకు వారి తల్లి ''సీతమ్మ'' జ్ఞాపకార్థం ఇవ్వబడింది. అందువలన ఈ ప్రదేశాన్ని సీతంపేట అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఒక చెఱువు ఉండేది, దానిని సీతమ్మ చెఱువు అని పిలిచేవారు, ఆ చెఱువు ఇప్పటి కాలంలో ఒక ఉద్యానవనంగా మార్చబడింది. ఇచ్చట పేపర్ మిల్ కలదు అ ప్రదేశానికి పేపర్ మిల్ వారి సహకారముతో ఈ సీతం పేట అభివృద్ది చెందుతున్నది. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ వారు మరియు, రెవెన్యు వారు ఈ సీతం పేట మరచినారు.ఆధ్యాత్మికంగా ప్రసిద్ద చెందిన [[అవతార్ మెహెర్ బాబా]] సెంటర్ ఇక్కడనే గుమ్మిడాలవారి వీధిలో రామాలయం దగ్గర ఉన్నది. జనవరి 31 న అమర తిధి, ఫిబ్రవరి 10 న, జన్మదినము జూలై 10న మౌన దినము జరుగును.
 
=== జాంపేట ===
 
=== దానవాయిపేట ===
ఈ ప్రదేశం యొక్క చరిత్ర సరిగ్గా లభించడం లేదు. రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మెదటి అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం రజక నాయకుడైన ''దానయాయి'' పేరు మీద పెట్టబడిందని అని చెబుతారు. ''దానవాయి'' దానవాయిగుంట అనే చెఱువు త్రవ్వించాడు. రెండవ అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఉండేది మరియు, ఇక్కడ సైనికుల నివసించేవారు అందువల్ల ''దాళవాయి'' అయ్యిందని, అది క్రమంగా దానవాయిపేటగా మారింది అని చెబుతారు. దానవాయిపేట రాజమహేంద్రవరంలో ఒక ప్రముఖ స్థలం దానవాయిపేటలో మూడు ప్రధాన వీధులు ఉన్నాయి, నగరంలో ఒక ప్రముఖ ప్రదేశం వ్యాపార కేంద్రాల కార్యాలయకు. ఇక్కడ దానవాయి పేట ఉద్యానవనం కూడా ఉన్నది.
 
ఈ విశాల ప్రపంచంలో ప్రాణికోటిని సృష్టిస్తున్న క్రమంలో ఆ భగవంతుడు దోమల్ని కూడా సృష్టించి భూమ్మీదకు వదులుతుండగా` ‘ఇంత చిన్నప్రాణులం. ఇంత పెద్ద మనుషుల మధ్య, జంతువులమధ్య మేం ఎలా బతికేది?‘అంటూ దోమలు భగవంతుడ్ని అడిగాయి. అప్పుడు ఆ దేవుడు`’ మూసీనదీతీరంలో అభయారణ్యంలో జీవించమని ఆదేశించాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దోమలు గూడుకట్టుకున్న ప్రాంతం కావడంతో ఆ అడవి ప్రాంతం ‘దోమలగూడ’గా ప్రసిద్ధికెక్కింది. క్రమక్రమంగా దోమజాతి వృద్ధి చెందడంతో మరో సురక్షిత ప్రదేశం కోసం అన్వేషిస్తూ కొన్ని దోమలు గోదావరీనదీ తీరం చేరుకున్నాయి. అక్కడ నివశించే ప్రజల్ని చూడగానే దోమలకు ఉత్సాహం ముంచుకొచ్చి జనాన్ని కుట్టివాయించేశాయి, దోమలు వాయించే ప్రాంతం కావడంతో ఆ ప్రాంతం ‘దోమవాయిపేట’గా పిలవబడిరది.ఆ తర్వాత కాలంలో అదే దానవాయిపేటగా రాజమహేంద్రవరంలో ఓ భాగమైతే`దోమల గూడ హైదరాబాద్‌లో ఓ ముఖ్య ప్రాంతంగా విరాజిల్లుతోంది.
 
=== రంగరాజు పేట ===
1870 ప్రాంతంలో ఈ ప్రదేశంలో [[రాజస్థాన్]] [[మహారాష్ట్ర]] నుండి ప్రజలు వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశం ఇప్పటి కోట గుమ్మ వద్ద ఉంది. వలస వచ్చిన ప్రజలు అద్దకం వృత్తి మరియు, కుమ్మర వృత్తి చేసేవారు. వీరు బోంధిలి మతానికీ చెందినవారు. భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన '''రత్నం కలాలు (రత్నం పెన్నులు)''' పరిశ్రమ మరియు, ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.
 
=== వీరభద్రపురం ===
 
=== కంభం సత్రం కంభాల చెరువు ===
చనిపోయిన తరువాత శాద్ధ్రాలు జరిపే సత్రం. 1845-1850 సంవత్సరాల మధ్య కంభం నరసింగ రావు పంతులు స్వంత నిధులతో ఈ సత్ర నిర్మాణం జరిపించారు. అదేసమయంలోనే ఇక్కడ ఒక చెరువు కూడా త్రవ్వించబడింది. చెరువు త్రవ్వగా వచ్చిన మట్టితోనే ఈ సత్రానికి కావలసిన ఇటుకలు తయారుచేశారు. ఈ సత్రం ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినవారికి శాద్ధ్రాలు నిర్వహించే ఏకైక సత్రం [[కాశీ]]లో కూడా శాద్ధ్రాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా సత్రం లేదు. ఈ సత్రం శిథిలాలుగా ఉంది. ఇక్కడ ఉన్న చెరువులో నిరంతరం నీరు ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఒక క్రీడాప్రాంగణం నిర్మించాలని యోచిస్తున్నది, కాని ప్రజలు దీనికి వ్యతిరేకత చూపించడంతో ఈ చెరువు అభివృద్ధి పరచి కంభాల ఉద్యానవనం మరియు, ఒక పడవ షికారు జరపడానికి ఏర్పాట్లు చేస్తోంది. [[విశాఖపట్నం]] పాత నగరంలో పిండాల సత్రం అని ఉంది. ఈ సత్రంలో శ్రాద్ధకర్మలు (పిండాలు పెట్టటం) నిర్వహిస్తారు.
 
== పౌర పరిపాలన ==
 
== విద్యా సంస్థలు ==
రాజమండ్రి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యా నిలయం ఇక్కడ ఎన్నో ప్రభుత్వ మరియు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ పుణ్య నగరిలో స్వాతంత్ర్యం రాకముందే విద్యకు బీజం పడింది. మహనీయులు శ్రీ కందుకూరి వీరేశలింగం గారివలన స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు ఆ రోజులలోనే ప్రారంభించబడినవి.
 
===ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ===
 
===శ్రీ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం===
శ్రీ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం యొక్క ఒక శాఖ రాజమండ్రిలో ఉంది. ఇది 1985 డిసెంబరు 2 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు, లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరియు, ఇతర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది.
 
===మరికొన్ని===
* జి.యస్.ఎల్ వైద్య కళాశాల ఇది దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలలో ఒకటి .
*డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల. ఇది 1940 లో స్థాపించబడింది.
*కందుకూరి వీరేశ లింగం గారి కృషి వలన స్థాపించిన విద్యాసంస్థలు -శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా జూనియర్ మరియు, డిగ్రీ, పి.జి కళాశాల యస్.కే.వి.టి ఉన్నత ఆంగ్ల బోధనా పాఠశాల,యస్.కే.వి.టి ఉన్నత తెలుగు బోధనా పాఠశాల, యస్.కే.వి.టి జూనియర్ కళాశాల,యస్.కే.వి.టి డిగ్రీ & పి.జి కళాశాల
*జి.కే.యస్.యమ్ "లా" కళాశాల
*డాక్టర్ అంబేద్కర్ జి.యమ్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల
== రవాణా సౌకర్యాలు ==
=== రోడ్డు రవాణా సౌకర్యాలు ===
రాజమహేంద్రవరం [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]]ని కలిపే జాతీయ రహదారి - 5 మీద ఉంది. రాజమహేంద్రవరం నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు, ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉంది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. నగరంలో ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయంతో కలిపి, గోకవరం, కోటిపల్లి హైటెక్ బస్సుస్టాండ్,అనే మెత్తం నాలుగు బస్టాండ్లు ఉన్నాయి.
 
==== ఆర్.టి.సి. రవాణా ====
 
==== గోకవరం బస్టాండు ====
గోకవరం బస్టండులో ప్రస్తుతం రాజమహేంద్రవరం లోరాజమహేంద్రవరంలో విలీనం చేస్తున్న పరిసర గ్రామాలూ ఐన కోరుకొండ గాడాలా,కొంతమురు, గోకవరం ఇతర ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులు మరియు, ప్రైవేటు బస్సు నిలుస్తాయి. ఈ బస్సు నిలయం గోదావరి రైలు స్టేషనుకి ఆవతల, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉంది. ఈ బస్సు స్టేషను నుండి తిన్నగా వెళ్ళితే దేవి చౌక్, కంభాల చెఱువు వస్తుంది.
 
=== రైలు సౌకర్యం ===
{{Main|కొవ్వూరు రైల్వే స్టేషను}}
గోదావరి రైలు స్టేషను రాజమహేంద్రవరం కిరాజమహేంద్రవరంకి మొట్టమెదటి రైల్వే స్టేషను. మెదటి రైలు వంతెన [[కొవ్వూరు రైల్వే స్టేషను|కొవ్వూరు]] నుండి బయలు చేరి గోదావరి స్టేషను వద్ద ముగుస్తుంది. ఈ రైలు వంతెన పై చివరి సారి 1996లో కోరమండలం ఎక్స్‌ప్రెస్ ని నడిపి ఈ రైలు వంతెనని మూసి వేసి రైల్వేశాఖ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది. మూడవ రైలు నిర్మాణం జరిగాక గోదావరి రైలుస్టేషను కొద్దిగా గోకవరం బస్టాండు వైపు ప్రక్కకు జరపబడింది. 2003 పుష్కరాల సమయంలో ఈ స్టేషను ఆధునీకరించబడింది. ఈ స్టేషను మీదుగా [[కొవ్వూరు]] నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్‌ప్రెస్ మరియు, ప్యాసింజర్ బండ్లు వెళ్తాయి కాని ప్యాసింజర్ బండ్లు మాత్రమే నిలుస్తాయి. రాజమహేంద్రవరం నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ బండ్లు మాత్రమే వెళ్తాయి మరియు, ఆగుతాయి. విజయవాడ వైపు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బండ్లు రెండవ రైలు వంతెన (రైలు రోడ్డు వంతెన) మీదుగా వెళ్తాయి.
 
==== రాజమండ్రి రైల్వే స్టేషను ====
=== విమాన సౌకర్యం ===
{{Main|రాజమండ్రి విమానాశ్రయం}}
నగర శివార్లలో ఉన్న [[మధురపూడి]]లో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉంది. ఈ మధ్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు, బవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా నిర్మించారు ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వెస్ మరియు, స్పైస్ జెట్ వారు [[హైదరాబాదు]], [[చెన్నై]], [[బెంగళూరు]] నగరాలకు విమానాలను నడుపుతున్నారు.
 
=== జలరవాణా సౌకర్యాలు ===
రైలు వంతెన మరియు, రోడ్డు వంతెన వచ్చాక జల రవాణా మీద ప్రజలు ఆధారపడడం లేదు. కాని జలరవాణా పర్యాటక రంగం ఊపందనుకోవడం వల్ల మళ్ళీ జీవము వస్తున్నది. ఇక్కడ నుండి పాపి కొండలకు, [[భద్రాచలం]] మరియు, [[పట్టిసం|పట్టిసీమ]]కు లాంచీ సదుపాయం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా లాంచీలు నడుపుతున్నారు.
 
== పరిశ్రమలు ==
* సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇనిస్టిస్టుట్ (CTRI) ఇండియన్ లీఫ్ టొబాకో డివిజన్ వారి సమన్వయంతో రాజమండ్రిలో పనిచేస్తున్నాయి.
* [[విజ్జేశ్వరం]] సహజవాయువుతో విద్యుత్తు తయారు చేసే కేంద్రము.
* [[ఓ.ఎన్.జి.సి]] (చమురు మరియు, సహజ వాయివు సంస్థ) ([[w:en:ONGC|ONGC]]) (Navaratna) వారి కృష్ణ-గోదావరి బేసిన్ ప్రాజెక్టు కార్యాలయాలు రాజమండ్రిలో ఉన్నాయి.
* కోస్టల్ పేపర్ మిల్స్
* సథరన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ అనే మందుల కంపెనీ
* హారిక్ల్స్ ఫ్యాక్టరీ స్మిత్ క్లైన్ బీచ్‌హమ్‌ కన్సుమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ వారి హారిక్స్ల్ ఫ్యాకటరీ [[ధవళేశ్వరం]] వెళ్ళే మార్గములో ఉంది.
* కడియం పేపరు మిల్లు - [[కడియం]]
*పులమర్కేట్ మరియు, మొక్కల నర్సరీలు - [[కడియపులంక]]
* జి.వి.కే. ఇండట్రీస్‌ మరియు, జేగురుపాడు విద్యుత్తు కేంద్రము - [[జేగురుపాడు]]
* రాజమండ్రి కో.ఆఫ్‌. స్పిన్నింగ్‌ మిల్స్ లిమిటెడ్- [[లాలాచెరువు]]
* సర్వరాయ సుగర్స్‌ ప్రైవేటు లిమిటెడ్ ([[కోకొ కోలా]] బాట్లింగ్‌ లిమిటెడ్)-[[వేమగిరి (కడియం)|వేమగిరి]]
{{Main|గోదావరి నది పుష్కరము}}
[[పుష్కరము]] అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
 
== దృశ్యమాలిక ==
బొమ్మ:Rjy freedon fighter statues.jpg|రాజమండ్రి గోదావరి బండ్ మీద శ్రద్ధానంద ఘాట్ ఎదురుగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు
బొమ్మ:Rjy rail cum road Bridge.jpg|రాజమండ్రి రైలు రోడ్డు వంతెన
బొమ్మ:Godavari old and new bridges 2.jpg|రాజమండ్రి మొదటి మరియు, రెండవ వంతెనలు
బొమ్మ:Rjy city view from rail cum road bridge.jpg|రాజమండ్రి నగర దృశ్యం రైలు రోడ్డు వంతెన మీద నుండి
బొమ్మ:Rjy rajarajanaderna.JPG|రాజమండ్రిలో పుష్కర ఘాట్ కి ఎదురుగా ఉన్న రాజరాజనరేంద్రుడు విగ్రహం
{{వికీసోర్స్|ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదునాలుగవ ప్రకరణము#రాజమహేంద్రవరము.}}
== మూలాలు ==
[[వర్గం:రాజమండ్రి]]
<references />
==వెలుపలి లంకెలు==
{{Commons category|Rajahmundry}}{{గోదావరి పరీవాహకం}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:రాజమండ్రి]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2866225" నుండి వెలికితీశారు