కాశీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (67), typos fixed: ె → ే , , → , (64)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 21:
}}
 
'''[[కాశీ]]''' లేదా ''[[వారాణసి]]'' [[భారత దేశం|భారతదేశం]] అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. [[హిందూమతము|హిందువులకు]] అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే [[గంగానది]]లో [[స్నానం]] ఆచరిస్తే సర్వపాపాలు నశించి [[పునర్జన్మ]] నుంచి విముక్తులౌతారని [[హిందువులు|హిందువుల]] నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద [[గంగ|గంగానదిలో]] కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి [[వారణాసి]] (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. [[బ్రిటిషు]]వారి వాడుకలో [[వారణాసి]], [[బెనారస్]] అయింది.
'''''కాశ్యాన్తు మరణాన్ ముక్తి:''''' - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని [[హిందూమతం|హిందువులు]] విశ్వసిస్తారు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల్లో]] ఒకటైన '''విశ్వేశ్వర లింగం''' ఇక్కడ ఉంది. [[బౌద్ధులు|బౌద్ధు]]<nowiki/>లకు, [[జైనులు|జైను]]<nowiki/>లకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే [[:en:List of oldest continuously inhabited cities|అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది]] అని భావిస్తున్నారు.<ref name=bsfw /><ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-9074835/Varanasi |title=Varanasi |publisher=[[Encyclopædia Britannica Online]] |accessdate=2008-03-06}}</ref>
 
[[గంగా నది|గంగానది]], [[హిందూమతము]], హిందూస్తానీ [[సంగీతము]], పట్టు వస్త్రాల [[నేత]], [[హిందీ]] మరియు, సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. [[హరిశ్చంద్రుడు]], [[గౌతమ బుద్ధుడు]], [[వేదవ్యాసుడు]], [[తులసీదాసు]], [[శంకరాచార్యుడు]], [[కబీర్ దాసు]], [[ప్రేమ్‌చంద్|మున్షీ ప్రేమ్‌చంద్]], [[లాల్ బహదూర్ శాస్త్రి]], పండిట్ [[రవిశంకర్]], [[బిస్మిల్లా ఖాన్]], కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] ప్రముఖులు [[వారాణసి]] నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి [[గంగా నది|గంగానది]] ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో [[సారనాథ్]] బౌద్ధ క్షేత్రం ఉంది.
 
విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి [[ఆలయం]], వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత [[దేవాలయం]], [[భారతమాత]] మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]] ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.<ref>{{cite web |url=http://www.bhu.ac.in/varanasi.htm |title=Varanasi: The eternal city |publisher=[[Banaras Hindu University]] |accessdate=2007-02-04 |website= |archive-url=https://web.archive.org/web/20120620142336/http://www.bhu.ac.in/varanasi.htm |archive-date=2012-06-20 |url-status=dead }}</ref>
పంక్తి 48:
 
=== పురాణకథనాలు ===
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.[[అయోధ్య]], [[మథుర]], [[గయ]],[[కాశి]], [[ఉజ్జయిని|అవంతిక]], [[కంచి]], [[ద్వారక]] నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు, తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. [[పురాతత్వ శాస్త్రం|పురాతత్వ]] అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా [[అథర్వణ వేదం|అధర్వణ వేదం]]<nowiki/>లో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో [[స్థానికులు]] నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు మరియు, ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.
 
=== ఆర్ధికం ===
వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి మస్లిన్ మరియు, పట్టు వస్త్రాలకు, [[సుగంధ ద్రవ్యము|సెంటు]], దంతపు వస్తువులు మరియు, శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమబుద్ధుడు (జననం 567 క్రీ.పూ)నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. [[గౌతమ బుద్ధుడు|గౌతమబుద్ధుడు]] కాశీలోని సారనాధ్ వద్ద " ధర్మచక్రం కదిలింది (టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా ) " మొదటిసారిగా గంభీరఉపన్యాసం ప్రజలకు అందించాడు. [[చైనా]] యాత్రికుడు హూయంత్సాంగ్ క్రీ.శ 635లో వారణాశిని దర్శించాడు. కాశీ పశ్చిమతీరంలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాశి మతం మరియు, కళలకు కేంద్రంగా ఉండేదని హూయంత్సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హూయంత్సాంగ్ వారణాశిలో నివసించాడు. హూయంత్సాంగ్ వారణాశిని " పోలనైస్ " అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు. 8వ శతాబ్దంలో [[శంకరాచార్యుడు]] శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.
=== ప్రముఖులు ===
[[మౌర్య సామ్రాజ్యం|మౌర్యుల]] కాలంలో [[తక్షశిల]] మరియు, [[పాటలీపుత్ర]] మద్య ఉన్న [[రహదారి]]<nowiki/>తో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వశం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వశం చేయబడ్డాయి. ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిదువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వశం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరికవైపు వారణాశి మేధావులకు మరియు, తాత్వికులకు కేంద్రంగా మారింది.
మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు మరియు, విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన [[కబీరుదాసు]] జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో కీర్తించబడ్డాయి. అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు మరియు, మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం మరియు, [[దక్షిణాసియా]] అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో [[గురునానక్]] దేవ్ [[శివరాత్రి]] సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.
 
=== స్వాతంత్రానికి ముందు చరిత్ర ===
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి [[ఆక్బర్]] పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు, [[విష్ణుమూర్తి]]కి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి [[కొలకత్తా]] నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత [[బ్రిటిషు|బ్రిటిష్]] పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ [[ఔరంగజేబు]] మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు మరియు, మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (క్రీ.శ 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం ( కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.
 
=== ప్రత్యేక సంఘటనలు ===
పంక్తి 66:
== భౌగోళికం ==
 
వారాణసి నగరo [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, [[గంగానది]] ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగం, దాని పరిసర ప్రాంతాలు ("Varanasi Urban Agglomeration") కలిపి మొత్తం 112.26&nbsp;చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి.<ref name=heritageUNESCO>{{cite web |url=http://www.sasnet.lu.se/EASASpapers/46RanaSingh.pdf |title=Varanasi as Heritage City (India) on the scale the UNESCO World Heritage List: From Contestation to Conservation |accessdate=2006-08-18 |last=Singh |first=Rana P.B. |format=[[Portable Document Format|PDF]] |work=EASAS papers |publisher=Swedish South Asian Studies Network |archive-url=https://www.webcitation.org/60pvfX7Np?url=http://www.sasnet.lu.se/EASASpapers/46RanaSingh.pdf |archive-date=2011-08-10 |url-status=dead }}</ref> ఈ నగరం ప్రాంతం 82° 56’తూ. - 83° 03’తూ. రేఖాంశాల మధ్య మరియు, 25° 14’ఉ. - 25° 23.5’ఉ. అక్షాంశాల మధ్య ఉంది.<ref name=heritageUNESCO/> గంగానది వరదలతో (low level floods) ఈ ప్రాంతం నేల సారవంతంగా ఉంటుంది.
 
వారాణసి నగరం మాత్రం [[గంగ]], [[వరుణుడు|వరుణ]] నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71&nbsp;మీటర్ల ఎత్తులో ఉంది.<ref name=varanasiairtrip>{{cite web |url=http://www.atrip4india.com/india-cities/varanasi.htm |title=Varanasi |accessdate=2006-08-18 |work=India-cities |publisher=Atrip4india.com |archive-url=https://web.archive.org/web/20060419124147/http://atrip4india.com/india-cities/varanasi.htm |archive-date=2006-04-19 |url-status=dead }}</ref> పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.
పంక్తి 83:
మొదటినుండి యాత్రా స్థలం అవ్వడం వలన, వారాణసి దేశం అన్ని ప్రాంతాలనుండి జనులను ఆకర్షించేది. కనుక ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.
 
వారణాశిలోని 29% ప్రజలు ఉద్యోగాలను కలిగి ఉన్నారు. వారిలో 40% వస్తూత్పత్తి పరిశ్రమలలో పనిచేస్తుండగా 26% ప్రజలు వ్యాపార వాణిజ్యాలు చేస్తున్నారు, 19% ప్రజలు సేవారంగాన్ని జీవనోపాధిగా ఎంచుకున్నారు, 8% రవాణా మరియు, సమాచార రంగంలో పనిచేస్తున్నారు, 4% వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు, 2% నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు ( వీరికి సంవత్సరంలో ఆరుమాసాలు మాత్రమే పని ఉంటుంది). తయారి పనివారిలో 51% స్పిన్నింగ్ పనిలో ఉన్నారు, 6% ప్రజలు ముద్రణ మరియు, ప్రచురణ పనిలో ఉన్నారు, 5% ప్రజలు విద్యుత్తు మిషనరీ పనిలో ఉన్నారు, మిగిలిన వారు పరిశ్రమలోని ఇతర పనులలో ఉన్నారు.
 
వారణాశిలో తయారీ వ్యవస్థలో [[పట్టు]]<nowiki/>నేత ఆధిక్యత వహిస్తుంది. వారణాశిలో సాధారణంగా నేతపని కుటీరపరిశ్రమగా ఉంటుంది. నేవారిలో అధికంగా మోమిన్ అంసారీ [[ముస్లిములు]] ఉన్నారు. వారణాశి పలుచని పట్టువస్త్రాలు మరియు, బనారస్ పట్టు చీరలు భారతదేశం అంతటా పఖ్యాతి వహిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలలో ధరించే ఈ పట్టు చీరలు వెండి మరియు, అంగారు జరీనూలుతో అలకృతమై ఉంటాయి. మిగిలిన [[భారత దేశము|భారతదేశం]] కంటే వారణాశిలో అత్యధికంగా బాలలను కట్టుబానిసలుగా పట్టుపరిశ్రమలో వాడుకుంటున్నారు. సమీపకాలంలో అభివృద్ధి చెందుతున్న పవర్ లూంస్ మరియు, కంప్యూటర్ డిజైన్లు అలాగే చైనా పట్టువస్త్రాల పోటీ వంటి సమస్యలు సంప్రదాయక పట్టునేత పరిశ్రమను కలవరానికి గురిచేస్తూ ఉంది.
 
లోహ తయారీ పరిశ్రమలో డీసెల్ లోకోమోటివ్ వర్క్స్ ప్రధానమైనది, భారత్ హెవీ ఎలెక్ట్రానికల్స్ లిమిటెడ్ అధికంగా విద్యుత్చక్తి పరికరాలను ఉత్పత్తి చేస్తుంది, ఈ సంస్థ హెవీ ఎక్విప్మెంట్ రిపెయిర్ ప్లాంట్ కూడా నిర్వహిస్తుంది, ఇంకా కామ్మోడిటీ తయారీ కూడా ప్రధాన్యత వహిస్తుంది, చేతితో చేసిన మిజాపిఉర్ కార్పెట్లు, రగ్గులు, ధుర్రీలు, [[ఇత్తడి]] వస్తువులు, [[రాగి]] వస్తువులు, కొయ్య మరియు, బంకమట్టి బొమ్మలు, హస్థకళా ఉత్పత్తులు, [[బంగారం|బంగారు]] నగలు మరియు, సంగీత పరికరాలు, తమల పాకులు, లాంగ్రా మామిడి మరియు, ఖోవా వంటి ముఖ్యమైన వ్యసాయ ఉత్పత్తులు ప్రధానమైనవి.
 
వారణాశిలో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ. ఇది ఆర్థికంగా రెండవ స్థానంలో ఉంది. సంవత్సరానికి 30 లక్షల దేశీయ మరియు, 2 లక్షల విదేశీ పర్యాటకులు వారణాశికి విచ్చేస్తున్నారు. పర్యాటకులు సాధారణంగా మతపరంగా వారణాశికి వస్తుంటారు. దేశీయంగా బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ మరియు, ఉత్తర ప్రదేశ్ నుండి వస్తుంటారు. విదేశీ యాత్రికులలో అధికంగా శ్రీలంక మరియు, జపాన్ నుండి వస్తుంటారు. అక్టోబరు మరియు, మార్చి మద్యలో యాత్రీకుల రాక అత్యధికంగా ఉంటుంది. వారణాశిలో యాత్రీకుల అవసరార్ధం దాదాపు 12,000 పడకల అవసరం ఉంది. వీటిలో సగం ఖరీదైనవి కాగా మూడవ భాగం ధర్మశాలలలో లభిస్తాయి. అయినప్పటికీ వారణాశి పర్యాటక నిర్మాణాలు సౌకర్యవంతమైనవి కావు. ఈ రంగంలో అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదు.
 
వారణాశిలో సిగ్రాలో ఉన్న ఐపి మాల్, భేల్‌పూర్‌లో ఉన్న ఇ.పి విజయా మాల్, వారణాశి కంటోన్మెంటు ప్రాంతంలో ఉన్న లక్సా వద్ద ఉన్న పి.డి.ఆర్ మరియు, జె.హెచ్.వి ముఖ్యమైనవి. నగరంలో [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]], ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, [[అలహాబాద్ బ్యాంక్]] మరియు, ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు బ్యాంకులు,
 
== సంస్కృతి ==
[[దస్త్రం:Varanasiganga.jpg|right|thumb|250px|Situated on the banks the river Ganges, Varanasi attracts thousands of Hindu piligrims every year.]]
వారాణసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత,, హిందూ-ముస్లిమ్ సహ జీవనం (మరియు, మత కలహాలు కూడా), హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు.
 
== గంగానది ==
పంక్తి 101:
 
=== స్నాన ఘట్టాలు ===
వారణాశిళొని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు (సింధియాలు), హోల్కార్లు, భోంస్లేలు మరియు, పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్" మరియు, "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి మరియు, దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాథలతో ముడివడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంశించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం మరియు, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.
* తులసీ ఘాట్ వద్ద [[తులసీదాసు]] తులసీ రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు.
 
పంక్తి 134:
వారాణసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షమంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం, దైవ దర్శనం చేసుకొంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని [[శివ లింగము|శివలింగం]] ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు.<ref name=leaflet2/> గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.
 
బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రాస్థలాలలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకునికంటెఅశోకునికంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థఅనంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.
 
జైనుల 23వ తీర్ధంకరుడైన '''పార్శ్వనాధుని జన్మ స్థలం''' అయినందున వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.
పంక్తి 141:
 
== ఆలయాలు ==
వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం మరియు, దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).
=== విశ్వనాధ మందిరం ===
కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో [[ఇండోర్]] రాణి [[అహల్యాబాయి హోల్కర్]] కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాలలో]] ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ [[వారన్ హేస్టింగ్స్]] సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన [[మహారాజా రంజిత్ సింగ్]] ఈ iఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.<ref>{{cite web |url=http://varanasi.nic.in/temple/KASHI.html |title=Shri Kashi Vishwanath Mandir Varanasi |publisher=National Informatics Centre, Government of India |accessdate=2007-02-04}}</ref> మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]] కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి<ref>{{cite news |url=http://www.tribuneindia.com/1998/98dec06/head1.htm |title=Countrywide alert on Masjid demolition anniversary |publisher=[[The Tribune]] |date= 1998-12-06 |accessdate=2007-02-05}}</ref>
పంక్తి 158:
 
=== సంకట మోచన్ హనుమాన్ మందిరం ===
కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా మరియు, కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసినదీతీరంలో ఉంది. ప్రస్తుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర్య సమరవేత్త మరియు, " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. మద్యయుగానికి చెందిన సన్యాసి మరియు, రామాయణ ( తులసి రామాయణం) సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ మరియు, శనివారాలలో హనుమతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి కనుక ఈ రెండు రోజులలో ఆలయానికి వేలాది భక్తులు వస్తుంటారు. కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతి ఇస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలోంవివాహబృదం పూజలు నిర్వహిస్తున్న కారణంగా అధికసంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ మరునాడు ఆలయంలో పూజాదికాలు నిర్వహిచి హనుమాన్ చాలిసా, సుందరా కాండ పారాయణం నిర్వహించి తులసీదాసు విరచిత హనుమాన్ చాలిసా, సుందరా కాండ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. తీవ్రవాదుల దాడి తరువాత ఆలయంలో పోలీస్ రక్షణ ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్యాఇవాలైన సీతారాముల ఆలయం ఉంది.
 
=== తులసీ మానస మందిరం ===
ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది.పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాలు మీద తులసీ రామాయణం లిఖింబడి ఉంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాలరూపంలో ప్రదర్శించబడుతున్నాయి. అలాగే రామాయణ కావ్యసంబంధిత తామ్రఫలకాలు కొన్ని కూడా ఇక్కడ బధ్రపరచబడి ఉన్నాయి.
=== భారతమాత ఆలయం ===
భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ అంకితం భారత మాతా ఆలయం, 1936 లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. . ఇది పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటణ్ ఉంది. బాబు శివ ప్రసాద్ గుప్తా మరియు, దుర్గా ప్రసాద్ ఖత్రీ, ప్రముఖ, పురాతన వస్తువులను అధ్యయన శాఖ మరియు, జాతీయ నేతలు, దాని నిర్మాణం కోసం విరాళంగా నిధులను అందించారు.
 
=== బిర్లా మందిరం ===
పంక్తి 177:
 
=== మసీదులు ===
వారణాశిలో ఉన్న [[మసీదు]]లలో ప్రధానమైనవాటిలో విశ్వేశ్వరాలయ సమీపంలో ఉన్న గ్యానవాపి మసీదు ఒకటి, తరువాత అలాంగిరి మసీదు, ది గంజ్ షహీదాన్ మసీదు మరియు, చుఖాంబా మసీదు మొదలైనవి. 10లక్షల ముస్లిములలో నలుగవ వంతు ముస్లిములు వారణాసిలో న నగరంలో ఉన్నచుఖాంబా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆరంభమైన తరువాత వారణాశిలో ప్రారంభమైన ముస్లిముల రాక ఇప్పటికీ పలు తరాలుగా కొనసాగుతూ ఉంది.
పెరుగుతున్న ఆ ముసల్మానుల సంఖ్య హిందూ సంస్ర్కతికి ఆటంకంగా మారింది
 
పంక్తి 205:
* మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.
* తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చి మాసాల మద్య నిర్వహించబడతాయి.
* సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి (మార్చి-ఏప్రిల్) హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి మరియు, ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు రోజులపాటు సాస్కృతిక సంగీతం మరియు, నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.
* రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 రోజులు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
* భారత్ మిలాప్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను [[విజయదశమి]] మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
* కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణిని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం మరియు, పడవలలో ఉండి చూస్తుంటారు.
* గంగాఅహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణిమనాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.
* గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో మరియు, పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.
 
== కళ, సాహిత్యం ==
పంక్తి 217:
అనాదిగా వారాణసి నగరం సాహిత్యానికి, పాండిత్యానికి, కళలకు నిలయంగా ఉంది. [[కబీర్]], [[తులసీదాస్]], [[రవిదాస్]], [[కుల్లూకభట్టు]] (15వ శతాబ్దంలో మను వ్యాఖ్య రచయిత)<ref>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V02_297.gif The Indian Empire] [[The Imperial Gazetteer of India]], 1909, v. 2, p. 262.</ref> వంటి పురాతన రచయితలు, భారతేందు హరిశ్చంద్ర ప్రసాద్, జయశంకర్ ప్రసాద్, ఆచార్య రామచంద్ర శుక్లా, మున్షీ ప్రేమ్ చంద్, జగన్నాధ ప్రసాద్ రత్నాకర్, దేవకీ నందన్ ఖత్రీ, తేఘ్ ఆలీ, క్షేత్రేశ చంద్ర ఛటోపాధ్యాయ, బలదేవ్ ఉపాధ్యాయ, వాగీశ్ శాస్త్రి, విద్యా నివాస్ మిత్రా, కాశీనాథ్ సింగ్, నమ్వార్ సింగ్, రుద్ర కాశికేయ, నిర్గుణ వంటి ఆధునిక రచయితలు వారాణసికి చెందినవారు. శుశ్రుత సంహితం వ్రాసిన [[ఆయుర్వేద]] శస్త్రచికిత్సానిపుణుడు [[శుశ్రుతుడు]] వారాణసికి చెందినవాడే.<ref>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V02_605.gif Susruta] [[The Imperial Gazetteer of India]], 1909, v. 2, p. 570.</ref>
 
రాజ కొషోర్ దాస్ (కళా శోధకుడు), ఆనంద కృష్ణ (చరిత్ర కారుడు) మరియు, ఓంకార్ ఠాకుర్ పండిట్ [[రవిశంకర్]], [[బిస్మిల్లా ఖాన్]], [[గిరిజాదేవి]], సిద్ధేశ్వరీ దేవి, డా. లాల్ మణి మిశ్రా, డా. గోపాల శంకర్ మిశ్రా, డా. ఎన్.రాజన్, డా. రాజభాను సింగ్, పండిట్ సమతా ప్రసాద్, కంథే మహరాజ్, పండిట్ ఎమ్.కల్వంత్, సితారా దేవి, గోపీకృష్ణ, పండిట్ కిషన్ మహరాజ్, రాజన్-సాజన్ మిశ్రా (అన్నదమ్ములు), మహాదేవ మిశ్రా వంటి అనేక సంగీతకారులు వారాణసినుండి ప్రఖ్యాతులయ్యారు.
 
వారాణసిలో ఉత్తర హిందూస్తానంలో జరుపుకొనే పండుగలన్నింటినీ ఘనంగా జరుపుకొంటారు.
 
== జన విస్తరణ ==
2001లో పరిసర ప్రాంతాలతో కలిపి వారాణసి (Varanasi urban agglomeration) జనాభా 1,371,749. ఆడు, మగ నిష్పత్తి 879 కి 1000 <ref name=censusmillioncities>{{cite web |url=http://www.censusindia.net/results/miilion_plus.html |title=Urban Agglomerations/Cities having population of more than one million in 2001 |accessdate=2006-08-18 |date=2001-07-25 |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India |archive-url=https://web.archive.org/web/20060828021534/http://www.censusindia.net/results/miilion_plus.html |archive-date=2006-08-28 |url-status=dead }}</ref> వారాణసి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనాభా 1,100,748<ref name=uptownscensus1>{{cite web |url=http://www.censusindia.net/results/data/upd_uatowns.PDF |title=Population, Population in the age group 0–6 and literates by sex - Urban Agglomeration/Town: 2001 |accessdate=2006-08-17 |format=PDF |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India |pages=53-54}}</ref> మరియు, ఆడు, మగ నిష్పత్తి 883కి 1000.<ref name=uptownscensus1/> అక్షరాస్యత శాతం మొత్తం అర్బన్ ప్రాంతంలో 61.5% మరియు, మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 61%.<ref name=uptownscensus1/>. మునిసిపల్ ఏరియాలో సుమారు 138,000 మంది మురికివాడ (slums)లలో నివసిస్తున్నారు.<ref name=censusmillionslums>{{cite web |url=http://www.censusindia.net/results/slum1_m_plus.html |title=Slum Population in Million Plus Cities (Municipal Corporations): Part A |accessdate=2006-08-18 |date=2002-01-22 |work=Census of India 2001 (Provisional) |publisher=Office of the Registrar General, India |archive-url=https://web.archive.org/web/20070611131026/http://www.censusindia.net/results/slum1_m_plus.html |archive-date=2007-06-11 |url-status=dead }}</ref>. నగరంలో నేరాలు రేటు 2004 సంవత్సరంలోలో 128.5 (ప్రతి 100,000కు). ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య 73.2 మరియు, దేశం మొత్తానికి 168.8.<ref name=ncrb>{{cite book | author =National Crime Records Bureau |year=2004 |title=Crime in India-2004 |chapter=Crimes in Mega Cities | chapterurl = http://ncrb.nic.in/crime2004/cii-2004/CHAP2.pdf | pages= 158 | format= [[PDF|PDF Format]] |publisher=Ministry of Home Affairs | accessdate=2006-08-18}}</ref>
===వసతిగృహాలు===
ఇచ్చట జంగంబాడి సత్తరం ఉంది.ఇచ్చట గదులు తక్కువ అద్దెకు ఇస్తారు.ఉచిత భోజనం వసతికూడా ఉంది.మరియు, నాట్టు కోట్టై నగర సత్తరం [[తమిళనాడు]] వారిచే నిర్వహించ బడుచున్నది.ఇచ్చట తక్కువ అద్దెకు గదులు దొరుకుతాయి.సత్తరం చాల పరిశుభ్రంగా ఉంటుంది.ఇచ్చట తక్కువ దరకే ఉదయం టిఫన్,మద్యాన్నం భోజనం,రాత్రికి టిఫన్ లభించును.ఇధి ఆంధ్రావారికి,తమిళ వాడు వారికి భాగుంటుంది.మరియు, శ్రీ వాసవి అన్నపూర్న సత్తరం ఉన్నధి.ఇక్కడ గదులు దొరుకుతాయి.ఉచిత భోజనం (మద్యాన్నం)దొరుకుతుంది.రాత్రికి టిఫన్ కూడా దొరుకుతుంది.ఇచ్చట ఆర్య వైశ్యులకు మాత్రమే ఇస్తారు.ఇవికాక ఇంకా హోటల్స్ ఉన్నాయి.అన్నిప్రాంతాల వారికి,అన్నిరకాల,ఆహారం దొరుకుతున్నది.
 
== రవాణా ==
పంక్తి 232:
 
--[[ప్రత్యేక:Contributions/117.195.145.146|117.195.145.146]] 14:22, 2014 జూన్ 17 (UTC)== పాలన, సేవా వ్యవస్థ ==
తక్కిన నగరాలలాగానే వారాణసిలో పాలనా బాధ్యతలు మునిపల్ సంస్థ (వారాణసి నగర్ నిగమ్) అధ్వర్యంలో నడుస్తాయి. ప్రణాళిక, ప్రగతి విషయాలు అధికంగా "వారాణసి డెవలప్‌మెంట్ అథారిటీ" చూస్తుంది. నీటి సరఫరా, మురుగు నీటి తొలగింపు వంటి పనులు "జల నిగమ్" బాధ్యత. విద్యుత్ సరఫరా "ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్" బాధ్యత. నగరంలో రోజుకు 350 మిలియన్ లీటర్ల మురుగునీరు<ref name=schemevaranasi>{{cite news |first=Gopal |last=Bhargava |url=http://www.tribuneindia.com/2000/20001025/mailbag.htm |title=Scheme for Varanasi |publisher=The Tribune}}</ref> మరియు, 425 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది.<ref name=cpcbsolidwaste>{{cite web |url=http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm |title=Waste Generation and Composition |accessdate=2006-08-18 |work=Management of municipal solid wastes |publisher=Planning Division, Central Pollution Control Board |archive-url=https://web.archive.org/web/20060717141102/http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm |archive-date=2006-07-17 |url-status=dead }}</ref> ఈ చెత్తను "లాండ్ ఫిల్" సైటులలో పారవేస్తారు.<ref name=cpcbsolidwaste2>{{cite web |url=http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm |title=Status of landfill sites in 59 cities |accessdate=2006-08-18 |work=Management of municipal solid wastes |publisher=Planning Division, Central Pollution Control Board |archive-url=https://web.archive.org/web/20060717141102/http://www.cpcb.nic.in/pcpdiv_plan4.htm |archive-date=2006-07-17 |url-status=dead }}</ref> చాలా మురుగునీరు గంగానదిలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల, గంగానది వడ్డున ఉన్న అనేక నగరాల లాగానే, తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. "గంగా యాక్షన్ ప్లాన్" పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణసి ఒకటి.
 
నగరంలో ఎస్.పి. అత్యధిక హోదా కలిగిన పోలీసు అధికారి.<ref name=uppoliceorg>{{cite web |url=http://uppolice.up.nic.in/About%20UP%20Police.html |title=UP Police Is divided into following zines consisting ranges & districts |accessdate=2006-08-18 |work=UP Police |publisher=[[National Informatics Centre|NIC]] |archive-url=https://web.archive.org/web/20100524150259/http://uppolice.up.nic.in/About%20UP%20Police.html |archive-date=2010-05-24 |url-status=dead }}</ref>. వారాణసి నగరం ఒక లోక్ సభ నియోజక వర్గం. 2014లో ఇక్కడినుండి భరతియ జనత పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గెలుపొందాడు.
పంక్తి 242:
సారనాథ్‌లో ఉన్న "కేంద్రీయ ఉన్నత టిబెటన్ అధ్యయన సంస్థ" (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్)కు కూడా విశ్వవిద్యాలయ హోదా ఉంది.
<ref name=cihts>{{cite web |url=http://www.varanasicity.com/education/tibetan-university.html |title=Central Institute for Higher Tibetan Studies |accessdate=2006-08-18 |publisher=Varanasi City}}</ref> క్రీడా రంగంలోను, విజ్ఞాన రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణనిచ్చే "ఉదయ్ ప్రతాప్ కళాశాల" కూడా విశ్వవిద్యాలయ హోదా కలిగి ఉంది. ఇంతే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు, సాంప్రదాయిక విద్యా కేంద్రాలున్నాయి. సనాతన కాలంనుండి సంస్కృతం, వేదాంతం, జ్యోతిషం వంటి సంప్రదాయ పాండిత్యానికి వారాణసి ప్రధాన అధ్యయన కేంద్రంగా ఉంటూ వచ్చింది. దీనిని "సర్వ విద్యా రాజధాని" అంటుండేవారు.<ref name=varanasicityedu>{{cite web |url=http://www.varanasicity.com/education/index.html
|title=Educational Institutes in Varanasi |accessdate=2006-08-18 |publisher=Varanasi City}}</ref> నగరంలో జామియా సలాఫియా అనే సలాఫీ ఇస్లామీయ అధ్యయన సంస్థ కూడా ఉంది.<ref>{{cite web |url=http://www.darulumoor.org/institutions.html |title=Darul Uloom Jamia Rasheedia |publisher=Tipu Sultan Advanced Study & Research Centre (TSASRC) |accessdate=2007-03-07 |website= |archive-url=https://web.archive.org/web/20100318004928/http://www.darulumoor.org/institutions.html |archive-date=2010-03-18 |url-status=dead }}</ref> ఇవే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ పాఠశాలలు మరియు, కాలేజీలు కూడా ఉన్నాయి.
=== ఆరోగ్యసంరక్షణ ===
సుస్రుతసంహిత అనే సంస్కృత శస్తచికిత్సా వైద్య గ్రంథ రచయిత సుష్రుతుడు వారణాశిలో నివసించాడు. నగరంలో ఇప్పటికీ ఆయుర్వేదం మరియు, పంచకర్మ వైద్యవిధానాన్ని అవలంబిస్తుంది. నగరంలో పలు ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. పునామావా హెల్త్ ఆయుర్వేదిక్ సెంటర్ శుశ్రుత ది ఇంపీరియల్ గజటీర్ ఆఫ్ ఇండియా ఉంది. నగరంలో వారణాశి హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, హెరిటేజ్ హాస్పిటల్, శివ్ ప్రసాద్ గుప్తా హాస్పిటల్, సర్ సుందర్లాల్ హాస్పిటల్, రాజకీయ హాస్పిటల్, మాతా ఆనందమయీ హాస్పిటల్, రామక్రష్ణ మిషన్ హాస్పిటల్, మార్వారి హాస్పిటల్ మరియు, కేంసర్ ఇంస్టిట్యూట్ ఉన్నాయి. 1964లో బృహత్తరమైన వారణాశి హాస్పిటల్ బైజినాథ్ ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ హాస్పిటల్‌లో 2012 నాటికి 66 పడకల స్థాయికి చేరుకుంది. వారణాశి మరియు, పరిసరప్రాంతాల నుండి ఇక్కడకు శస్త్రచికిత్సలకు వస్తుంటారు. ఇందులో ఎక్స్ రే, అల్ట్రాసోనోగ్రఫీ, ఎకోకాడ్రియాలజీ మరియు, పాథాలజీ వంటి ఆధునిక వైద్యసౌకర్యాలు ఉన్నప్పిటికీ నిధులకొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాది. వారణాశి నగరప్రాంతంలో 1000 మందికి 70 శిశుమరణాలు సంభవిస్తున్నట్లు 2010-2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి.
 
The urban portion of Varanasi District had an infant mortality rate of 70 per 1,000 live births as of 2010–2011.[55]
 
== పర్యాటక రంగం ==
వారణాసిలో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం. నగరంలో 3,4, 5 స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమౌతాయి.అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి. పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామానుకు వారాణసి ప్రసిద్ధి చెందినది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు, ఆకర్షణీయమైన దీపపు స్తంభాలు మరియు, హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభిస్తాయి. చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు, లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు<ref name="leaflet2"/> పురాతనమైన వారణాశి నగరంలో నాలుగవ భాగం గంగాతీరంలోనే ఉంది. ఇరుకైన సందులతో కూడిన వీధులతో ఉంటుంది. ఇవి కొత్తవారిని చాలా అయోమయంలో పడవేస్తాయి కనుక ఇక్కడ తిరగాలంటే సహాయకుల అవసరం ఎంతైనా ఉంది. హిందూ ఆలయాలు వీధివెంబడి అంగళ్ళూ ఇక్కడ ప్రసిద్ధం. ఈ నగర పురాతన తత్వం విదేశీ పర్యాటకులను సైతం అమితంగా ఆకర్షిస్తుంది. వారణాశిలో మద్యతరగతి మరియు, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు నివసించడానికి అనువైన ప్రదేశాలు ఆలయానికి దూరంగా ఉంటాయి. అక్కడ తక్కువ కాలుష్యం అరియు తక్కువ జనసాంద్రత ఉండడం విశేషం.
అంతేకాక పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో సారనాథ్ మ్యూజియం, జంతర్ మంతర్, భారత్ కళాభవన్ మరియు, రామనగర్ కోట ముఖ్యమైనవి.
=== జంతర్ మంతర్===
గంగాతీరంలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో జంతర్ అంతర్ ఒకటి. ద్శాశ్వమేధ్ ఘాట్ సమీపంలో గంగాతీరంలో ఎత్తైనప్రదేశంలో జయపూర్ రాజు అయిన రాజా జై సింగ్ ఘాటును ఆనుకుని
జంతర్ మంతర్ ఉంది. డిల్లీ మరియు, జైపూర్ అబ్జ్ర్వేటరీలలా వారణాశి అబ్జర్వేటరీలో ఉపకరణాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్న " సన్డయల్ ఏక్వేషనల్ "
ఒకే ఒకేఒక న్యక్తి నిర్వహిస్తూ వివరాలనలు నమోదు చేయబడుతున్నాయి.
 
=== రామనగర్ కోట ===
రామనగర్ కోట గంగానది తూర్పుతీరంలో తులసీఘాటుకు ఎదురుగా ఉంది. రామనగర్ కోటను 18వ శతాబ్దంలో కాశీనరేష్ రాజా బలవంత్ సింగ్ చేత నిర్మించబడిది. ఈ కోట చునార్ ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఇది మొగల్ నిర్మాణశైలితో వంపైన బాల్కనీలు, బహిరంగ సభామండపాలు మరియు, సుందర ద్వారాలు కలిగిఉంది. ప్రస్తుతం ఈ కోట జీర్ణావస్థలో ఉంది.
ఈ కోట మరియు, ఇందులో ఉన్న పురాతన వస్తుసంగ్రహాలయంలో బెనారస్ రాజవంశానికి చెందిన వస్తువులు బధ్రపరచబడి ఉన్నాయి. 18వ శతాబ్దం నుండి ఈ కోట కాశీనరేశ్ నివాసస్థాంగా ఉంది. ప్రస్తుతం ఈ కోటలో ప్రస్తుత కాశీనరేస్ అనంత నారాయణ్ సింగ్ నివసిస్తున్నాడు. 1971లో నుండి కాశీ రాజరికం తొలగించినప్పటికీ నామమాత్ర రాజరికం మరియు, పురాతన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. " యాన్ ఎసెంట్రిక్ మ్యూజియం" (అసాధారణ మ్యూజియం) అన్న పేరుతో ఉన్న ఉపభాగంలో నవరత్నఖచిత పల్లకీలు, అద్భుతమైన ఆయుధశాల మరియు, అరుదైన జ్యోతిష గడియారం భద్రపరచబడి ఉన్నాయి. సరస్వతీ భవనంలో మతసంబంధిత వ్రాతపతులు భద్రపరచబడి ఉన్నాయి. గోస్వామీ తులసీదాస్ వ్రాసిన రామాయణప్రతులు కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. సుందరమైన డిజైనులు కలిగిన కవర్లను తొడిగిన మొగల్ మినియేచర్ శైలిలో పలు వర్ణచిత్ర పుస్తకాలుఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఈ పుస్థకాలలో గంగాతీర సౌందర్యం ప్రతిబింబించే చిత్రాలు ఉన్న కారణంగా ఇవి చలనచిత్రాల ఔట్‌డోర్ చిత్రాలలో ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడ నిర్మించిన చలనచిత్రాలలోంబెనారస్ పేరున్న చలనచిత్రం చిత్రం ప్రధానమైన చలనచిత్రం చిత్రాలలో ఒకటి. ఈ కోటలో కొంతభాగం పర్యాటకుల కొరకు తెరచి ఉన్నప్పటికీ మిగిలిన భాగం కాశీ నరేష్ మరియు, కుటుంబానికి నివాసంగా ఉపయోగపడుతూ ఉంది. ఈ కోట వారణాశి నుండి 14 కిలోమీటర్ల ( 9 మీటర్లు) దూరంలో ఉంది.
 
== ఇతరాలు ==
"https://te.wikipedia.org/wiki/కాశీ" నుండి వెలికితీశారు