సూర్యరశ్మి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
+ఓజోన్ క్షీణత లింకు
పంక్తి 18:
మానవ శరీరం సూర్యరశ్మి నుంచి [[డి విటమిన్]]ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ సేపు ఎండ తగలకుండా ఉండటం వల్ల, తీసుకునే ఆహారంలో ఇది తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల, శరీరంలో ఈ విటమిన్ కొరత ఏర్పడవచ్చు. ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురికావడం మూలాన దానిలో ఉన్న అతినీలలోహిత కిరణాల వల్ల [[చర్మ క్యాన్సర్]] వచ్చే అవకాశం కూడా ఉంది.
 
సూర్యకాంతిలోని నులివెచ్చని కిరణాలు ముఖ్యంగా ఉదయం, సాయంత్రపు వేళల్లో మన దేహానికి 'డి' విటమిన్ అందించినా, ఆహ్లాదం కలిగించినా, సూర్యరశ్మికి మరీ ఎక్కువగా ప్రభావితమైతే, కొన్నిసార్లు హాని జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాంటి ప్రమాదాలే శరీర చర్మంపై కమిలిన మరకలుగా (Sun burns) ఏర్పడుతాయి. అవే కాలం గడిచే కొద్దీ చర్మ సంబంధిత క్యాన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. వీటికి కారణం సూర్యరశ్మి నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన అతి నీలలోహిత కిరణాలు. ఈ కిరణాలు మన దేహానికి సోకకుండా ఆకాశానికి భూమికి మధ్య [[ఓజోన్]] పొర పరచుకొని ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో ఈ ఓజోన్ పొర [[ఓజోన్ క్షీణత|గాఢత చాలా వరకు తగ్గింది]]. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలపైన. దీనికి కారణం శీతలీకరణకు వాడే [[రిఫ్రిజిరేటర్లు]], ఏసీలు. వాహనాలను నడపడానికి ఉపయోగించే [[పెట్రోలు]], [[డీజిల్]] లాంటి ఇంధనాల కాలుష్యాలు. అవి వెలువరించే క్లోరో ఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీఎస్). వీటి ప్రభా వాన్ని అరికట్టినా, ఆకాశంలోని ఓజోన్ పొర మునుపటి పరిమాణాన్ని, సాంద్రతను అందుకుంటుందనే విషయంలో శాస్త్రజ్ఞులు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఆ ఓజోన్ పొర మరీ బలహీన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
 
==ఇతరత్రా==
"https://te.wikipedia.org/wiki/సూర్యరశ్మి" నుండి వెలికితీశారు