గణేశ్ పాత్రో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
== నాటక, సినీరంగ జీవితం ==
[[కొడుకు పుట్టాల]] నాటికతో యావద్భారతదేశంలో కీర్తి లభించింది. ఆ నాటిక అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై, ఆకాశవాణి మరియు దూరదర్శన్ లలో ప్రసారమైంది. 1970 ప్రాంతంలో రచన ప్రారంభించిన గణేష్ పాత్రో అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటకకర్తగా పేరు తెచ్చుకున్నాడు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేష్ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత. మృత్యుంజయుడు, తెరచిరాజు, తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలాపుట్టాల, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు.
 
1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించాడు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీరంగానికొచ్చి [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]] సినిమాకు సంభాషణలు సమకూర్చాడు.<ref>[http://www.thehindu.com/features/cinema/keeping-to-the-old-ways/article4323090.ece Keeping to the old ways - The Hindu January 19, 2013]</ref> "హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం" [[నిర్ణయం]] సినిమాలో పాట రాశాడు.
"https://te.wikipedia.org/wiki/గణేశ్_పాత్రో" నుండి వెలికితీశారు