వేరుశనగ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 31:
 
==వేరుశెనగ పంట==
వేరుశనగ విత్తన మొలక సమయంలో 14-16 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. తొలకరి వర్షాలు అయ్యాక విత్తడం ఆంధ్రలో పరిపాటి. ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమలో వేరుశనగ సాగు అధికము.పంట కాయకొచ్చు సమయంలో ఉష్ణోగ్రత 23-25 సెంటిగ్రేడ్ డిగ్రీలు వున్నచో పంట దిగుబడి పెరుగును. పంటకాలంలో వర్షపాతం 12.5-17.5 సెం.మీ.వున్నచో మంచిది.పంటను విత్తు సమయములో 12.5-17.5 సెం.మీ., పంట పెరుగు నప్పుడు 37-60 సెం>మీ. వర్షపాతం వున్నచో మంచిది. వేరుశనగను అన్ని సీజనులలో సాగు చెయ్యవచ్చును.కాని వర్షకాలంలోని ఖరిప్‌ సీజనులో 80% సాగుచెయ్యడం జరుగుచున్నది. అందులో 90% పంటను కేవలం వర్షం మీదనే ఆధార పడి సాగుచెయ్యడం జరుగుచున్నది. దక్షిణ భారతములో ఖరీప్‌, మరియు, రబీ రెండు సీజనులలో వేరుశనగ పంటను సాగు చెయ్యుదురు. నీటి సదుపాయం గల ప్రాంతాలలో వేసవి కాలంలో జనవరి-మార్చి మధ్య తక్కువ సమయంలో పంటకోతకు వచ్చే రకాలను సాగుచెయ్యుదురు. వేరుశనగలో నూనె, ప్రోటీనులు, కార్బోహైడ్రెట్‌లు, మరియు, విటమిన్లు అధిక ప్రమాణములో వుండును. అందుచే వేరుశనగ బలవర్దకమైన ఆహారం. వేరుశనగ గింజలో (Kernel) 43-50% వరకు నూనె,25-30% వరకు ప్రోటిన్లు వుండును. వేరుశనగ విత్తనంల నుండి నూనె తీసిన తరువాత ఆయిల్‌ కేకులో (నూనె తీసిన వేరుశనగ విత్తనంల పిండి) ప్రోటీన్‌ శాతం పెరుగును. వేరుశనగ పంటకాలము, విత్తనం వైరైటిని బట్టి 90-150 రోజులు వుండును. గుత్తిరకము (Bunch type) పంటకాలము 90-120 రోజులు. వ్యాప్తి (spreading Type) రకము విత్తనము అయ్యినచో పంటకాలం 130-150 రోజులు వుండును. పై రెండు రకాలను ఎక్కువగా వర్షకాలం (ఖరీప్‌) లోనే సాగు చెయ్యుదురు. చీడ, పీడలను తట్టుకునే శక్తి గల సంకరజాతి (Hybride) వంగడాలను సాగు చెయ్యడం వలన 20% ఎక్కువ దిగుబడి సాధించవచ్చును. మాములు రకము ఎకరానికి 500-600 కేజిలు దిగుబడి యివ్వగా, హైబ్రిడ్‌ రకము 900-1200 కేజిలు గిగుబడి యిచ్చును. వేరుసనగ కాయ (pod) లో పొట్టు (shell) 25-30%, గింజ (Kernel) 70-75% వుండును.
భారతదేశం లోనే పేరుపొందిన కదిరి-3,5,7,9,71 మొదలగు వేరుశనగ వంగడాలు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయపరిశోధన కేంద్రం వారి సృష్టి.
 
పంక్తి 44:
 
'''3.ICGV 86590''':
యిది బంచ్‌ రకమునకు చెందినది. పంటకాలము 96-123 రోజులు. చేడ, పీడలను తట్టుకోగలదు.దిగుబడి హెక్టారుకు 3 టన్నుల వరకు ఉంది. ఈ రకమును ఎక్కువగా ఆంధ్ర, కర్నాటక, కేరళ, మరియు, తమిళనాడు లలో సాగు చెయుచున్నారు.
 
'''4.ICGV 91114 ''':
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ" నుండి వెలికితీశారు