కందుకూరి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 136:
::తెల్లని మబ్బుల బెలూన్లతో
::ఇల్లంతా పండగ చేసుకుంటుంది
 
* తెలంగాణ కవితా పీఠభూమి కందుకూరి శ్రీరాములు *
 
* ఐ. చిదానందం *
-------------------------------------------------------------------
 
చిన్నతనం నుండి కవిత్వం పై ప్రేమ ను పేంచుకున్న ఒక విద్యార్థి .తన చిన్నతనంలో స్కూల్ సమావేశంలో సర్పంచ్ తదితర ప్రముఖల సమక్షంలో ఆ పాఠశాల మౌలిక సదుపాయాలపై ఒక కవిత ను రాసి వినిపించారు. అంతే ఆ విషయం అధికారుల దృష్టికీ వెళ్లి ఆ సమస్య పరిష్కారం అయ్యింది. కవిత్వం కు ఉన్న ఆ శక్తి ని చూసీ ఆ విద్యార్థి కవిత్వం పై మక్కువను మరింత పెంచుకున్నారు . అప్పటి ఆ విద్యార్థి యే కందుకూరి శ్రీరాములు. వీరు 1951 అక్టోబరు 20 న జన్మించినారు. మలక్ పేట లో నివసిస్తున్న కందుకూరి శ్రీరాములు గారి స్వగ్రామం సిద్దిపేట లోని రావు రూకల. వీరు ప్రస్తుతం ఇబ్రహీం పట్నం లోని ఒక డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులు గా పనిచేస్తున్నారు.
 
శ్రీరాములు చిన్న తనం నుండీ పద్యం పై ప్రేమ ను పెంచుకున్నారు. సినారె ; శీలా వీర్రాజు గార్ల రచనలతో ప్రభావితం చేంది సాహిత్యం పై అభిలాష ను పెంచుకున్నారు. చిన్నతనం లో తన క్లాసు రూమ్ లో కాలివేళ్లతో పెన్ను పట్టుకోని రాసుకునే దివ్యాంగురాలైన విద్యార్థి ని చూసి చలించి శబ్దశరీరం అనే కవితను రాశారు. దీనిని శీలా వీర్రాజు గారు ఆంగ్లంలోకీ అనువాదం చేసి డౌన్ టు ఏర్త్ గా ప్రచురింపచేశారు. శ్రీరాములు ఇందూరు భారతీ వంటి సాహిత్య సంస్థలలో సభ్యులుగా కోనసాగుతూ బెడద రాజేశ్వర రావు వంటి వారి దగ్గర కంద పద్యాలను నేర్చుకున్నారు. అలాగే ముప్పై (30) మంది కవులతో ఏర్పాటైన ఉస్మానియా రైటర్స్ సర్కిల్ అనే సంస్థలో వీరు చురుకుగా పనిచేసినారు.
 
*వీరి రచనలు*
 
* వయోలిన్ రాగమో వసంత మేఘమో (1993)
* సంధర్భం (2001)
* దహన కావ్యం (దీర్ఘ కవిత -2003)
* కవ్వం (2002)
* పీఠభూమి (2005)
* వెన్నెల బలపం (2008)
* రావు రూకల (2009)
* తెలంగాణ రధం (2013)
* అలుకు పిడచ (2014)
* దివిటీ (మినీ కవిత ల సంపుటి)
[{ *దీనిని నందిని సిద్దారేడ్డి ; కర్ణాల బాల రాజు గార్ల తో సహ సంపాదకత్వం*}]
 
1974 లో గాయకులు ఘంటసాల గారి మరణం విని....
 
పదివేల పాటలను పలికించి
ఎన్నో హృదయాలను కదిలించిన
కంచు గంట మన ఘంట కంఠం
 
అంటూ అమరుడు అనే స్మృతి కవిత ను ఘంటసాల వేంకటేశ్వర్లు గారి పై రాసారు. ఈ కవిత సిద్దిపేట లోని మాతృభూమి అనే వార పత్రిక లో అప్పట్లో అచ్చయింది. దీనిని వేముగంటి నరసింహచార్యులు వంటి కవులచే ప్రశంసలు పోందింది. కందుకూరి గారి అచ్చయిన రచనలలో ఈ అమరుడు తోలి కవిత కాగా ; వీరి అచ్చుకాని రచనలలో మొదటిది మాత్రం మా మిత్ర ద్వయం అనే కవిత.
 
నా ఊహ
ఎండ లో పడిన ఇటుకలు
నా దృష్టి
ఎండ లో పరుగిడుతున్న రోడ్డు
నా అన్వేషణ
నీటిలో తడిసి హేంగర్ కు వేలాడుతున్న షర్ట్
 
అంటూ ఎండ ను వయోలిన్ రాగమో వసంత గీతమో లో వర్ణిస్తారు. ఈ తోలి సంపుటి వచ్చిన సుధీర్ఘ కాలం (ఏడేళ్ల ) తర్వాత రెండవ సంపుటి సంధర్భం. దీనిలో కవితలను వాటి నేపథ్యంను చూస్తే నామౌచిత్యం సరిగ్గా కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ సంపుటి చీమక్షేత్రం అనే కవిత తో మొదలవుతుంది....
 
వీటికి ప్రాణమిచ్చిందేవడో కాని
భూరంధ్రాల్లోంచి వెదజల్లిన వరి విత్తనాలై
వరుసగా మొలుస్తుంటాయి చీమలు
ఎక్కడ చూసినా క్యూలు కట్టి
ఆహార పోరాటాల కోసం చీమలే చీమలు
 
అంటూ చీమలు అనంత పోరాటానికీ ప్రతిబింబంగా నిర్వహిస్తారు శ్రీరాములు. మెదక్ జిల్లా లో విప్లవోద్యమ సమయం ను గమనించిన ఈ కవి రాసిన కవిత్వం లో ఆ ప్రభావం అంతర్లీనంగా గమనించదగినది. సంధర్భం సంపుటి లో పట్టాలు పరుగేతుతున్నాయి అనే కవిత మొత్తంగా ఉద్యమ స్వభావం ను చేప్పేదే. అలాగే ప్రజా యుద్ద నౌక గద్దర్ మీద హత్యయత్నం జరిగినప్పుడు వీరు రాసిన కవిత పాట గోప్పది
 
వరికంకులు కోడవళ్ళును
నమ్మినంత ప్రేమగా పాటలు
మాటల్ని నమ్మాయి
నిఘా వేసి బరిగీసి గురిపెట్టాటాలు
కిరాయి బురఖాలతో
ఖరార్ నామా లు రాసుకోవటాలు
హాయిగా ఆడుకోలేని
పాడుకోలేని స్వేచ్ఛ చూసీ
యాభై యేళ్ళ స్వాతంత్ర్యం
జెండా అవనతం చేసుకోంది
 
అంటూ విచారిస్తారు కవి. పాట గోంతు కోసే ప్రజాస్వామ్యం ఎంత విచిత్రం అనీ చింతిస్తారు. మరో సంధర్భం లో 28 ఆగస్టు 2000 సంవత్సరం నాడు బహీర్ బాగ్ లో ప్రజల పై పోలీసుల కాల్పులు జరిపారు. ఇది నాటి జలియాన్ వాల్ బాగ్ తో పోల్చదగిన దురాంతం. దీనిపై శ్రీరాములు గారు బహీర్ బాగ్ అనే కవిత ను రాశారు. ఏ కవికీ సహజసిద్దమైన నేపధ్యం ఉంటుంది. నాస్టాల్జియాలా గా కవితలుంటాయి. అలాంటి కవితలే సంధర్భం లో శ్రీరాములు గారు అమ్మ మీద రాసిన కవితలు అమ్మ పాట ; అమ్మ బ్రహ్మ ; మూడో నేత్రం వంటి కవితలు. ఇవే కాకండా మధ్య తరగతి మనస్తత్వాల డోలాయాన స్థితి పై కూడా కవితలు కలవు.
 
సంధర్భం కవితా సంపుటి లోని కోన్ని కవితా పంక్తులు....
 
ఏనుగు శక్తి ఎలుగుబంటికి రాదు
దేహమే యుద్ధభూమి రోగానికి తావులేదు
కవచానికి సోమరితనం
ఖడ్గానికి పిరికితనం పనికిరాదు
 
* అప్పట్నుంచి *
 
నదుల్ని మళ్ళించు
భూములన్ని సముద్రాలవుతాయి
వీరుల్ని రప్పించు
మైదానాలన్ని కదనాలవుతాయి
 
* జోలపాటలోద్దు-లాలీపాటలోద్దు *
 
ధిక్కార స్వరం లేకపోతే లోకమంతా మూగదే
గాలి వీచకపోతే చెట్లున్నా అచేతనత్వమే
 
* ఒకానొక సంధర్భం *
 
గాలి వీస్తుంది తూర్పు నుండీ పడమర
ప్రవహిస్తుంది కాలువ నుండీ నది దాకా
స్వేచ్ఛ దాని ఊపిరి
 
* డోలాయనం *
 
తెలుపుదనాన్ని సైతం ఎరుపుదనం చేసే చర్య
ఒక ఉద్యమానికీ తెలుసు
ఒక ఉదయానికీ తెలుసు
ఒక కదనానికీ తెలుసు
ఒక ఖడ్గానికీ తెలుసు
 
* జనపదం - జలపాతం *
 
నామాలు దిద్దుతూనే
అనాదిగా ఆధిపత్యం
పాలను నీరును వేరు చేయాటానికీ
మనసు హంస కావాలి
 
* చిగురించిన బోటన వేలు *
 
2014 క్రితం న్యాయబద్దమైన తెలంగాణ రాష్ట్రం ను అటూ కేంద్రం ఇటూ రాష్ర్ట నాయకులు ఏన్నో డ్రామాలు చేసి అడ్డుకుంటున్నారు. ఈ విషయం పై విసుగు చెంది రాసిన కవిత
 
ఇక
అసెంబ్లీ తీర్మానాలు
పార్లమెంట్ బిల్లులు అక్కర్లేదు
ఇక నుండీ
రాష్ర్ట ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తో సంబంధం లేదు
తెలంగాణకిప్పుడు ప్రత్యేక రాజ్యంగం కావాలి
దేశానికీ ఉండాలిసిన లక్షణాలు
హంగు ఆర్బాటాలన్ని ఉన్నాయి
----------------------------------------
----------------------------------------
జాతి జనులకోక సందేశం
తెలంగాణ మన దేశం
 
అంటూ శ్రీరాములు గారు రాసిన కవిత సంచలనము గా ఆలోచనత్మకం గా సాగుతుంది. మరో కవిత గ్లోబలీకరణ నేపధ్యంలో సాగుతుంది
 
చెమట విలువ
యంత్రాలకు తెలియదు
రక్తం విలువ
ఇంధనానికీ తెలియదు
రూపాయి మేకను
పులి డాలర్ మింగేయకుండా
ప్రాణాంతకం చేసే వాటిని
బోనులో బంధిద్ధాం
 
ఇలా సమస్త సంపదల మీద ప్రపంచీకరణ వల విసురుతుంది. మొత్తం భూమండలంను మింగేయాలనీ చూస్తుంది. అలాంటి డాలర్ పులిని బోనులో బంధించమంటాడు కందుకూరి. మ్యానిఫేస్టో లో కారల్ మార్క్సు తాను రాసిన కమ్యూనిస్ట్ మ్యానిఫేస్టో లో ఉద్యమం పోరాటం ఎందుకు పుడుతుందో తెలియచేశారు. ఇదే విషయం పై శ్రీరాములు గారు...
 
వీరులు ఎందుకు పుడతారు?
పోరాటాన్ని అడుగు
పోరాటం ఎందుకు పుడుతుంది?
ఉద్యమాన్ని అడుగు
ఉద్యమం ఎందుకు పుడుతుంది ?
సాహిత్యాన్ని అడుగు
సాహిత్యం ఎందుకు పుడుతుంది ?
పీడితుల్నడుగు
పీడితులు ఎందుకవుతున్నారు?
పీడకుల్నడుగు
పీడకులేందుకు పుడుతున్నారు?
పాలకుల్నిడుగు
పాలకులేందుకు పుడుతున్నారు?
ప్రజల్నడుగు
 
అంటూ సమాజం లోని రూపాంతరాలను తెలియచేసారు. బతుకమ్మ ని తమ గ్రామాలలో ఏలా జరుపుకుంటారో రావురూకల అనే కవితలో చెబుతూ.....
 
బతుకమ్మ పండుగంటే
పూల కోసం వెతుకమ్మ అనే వాళ్ళు
ఎన్ని రకాల పూలో
వేటగాడు తిరిగినట్లు
పూలకోసం వల పన్నేవాళ్ళం
 
అంటూ పల్లేలో జనులు బతుకమ్మ పండుగ కోసం ఎంత కష్టపడుతారో వివరించారు.
 
తలకు రుమాలు నోట్లో చుట్ట చెతిలో కట్టే
అర్దనగ్న శరీరాలతో ఆకలి కడుపుల్తో
ఇదో గోప్ప వేషం అదో అద్బుత సజీవ భాష
 
అంటూ పల్లె లో నివసించే మగవారి శరీర వస్త్ర ధారణ ను నన్ను గన్న నేల అనే కవిత లో చిత్రించారు. ఆడవారి కీ ఆభరణాలు ధరించడం లో వచ్చిన మార్పుల పై కవి ఇలా అంటారు.
 
చెవులకు రాగి పోగులు పెట్టుకున్న దానివి
బుట్టాలు పెట్టుకుని
మెళ్ళో రవ్వల నెక్లేస్ కట్టుకుంటునావు
చెవి ముక్కు కంఠము
నడుము నగలే నగలు
 
అంటూ వేడుక సమయం లో స్త్రీలు ధరించే అతి అలంకారం ను హైటేక్కులాడీ అనే కవిత వ్యంగం గా సున్నితం గా శ్రీరాములు గారు అధిక్షేపిస్తారు.
 
బాట నిండా ముళ్లేననీ
గమ్యం చాలా దూరమనీ
ఎడుస్తూ కూర్చోంటే
చలి లో చావాలి
ఎండ లో మాడాలి
మాడి చావటం కంటే
ముళ్ల ప్రయాణమే నయం
 
అంటూ దివిటీ లో వీరు రాసిన మినీ కవిత ఎంతో స్పూర్తిదాయకమైంది.
 
వీరి మరో కవితాసంపుటి అలుకుపిడచ. అనగా గ్రామీణులకు అర్దమయ్యే పదం. ఇదీ శుభ్రత కు చిహ్నం. పూర్వం కట్టేల పోయ్యిని శుభ్రం చేయుడానికీ ఎర్రమట్టి బుడ్డిలో బట్ట ను నాన్చి పోయ్యి ని శుభ్రం చేసేవారు
 
తోలి పోద్దు పోడుస్తుంటే
పల్లె ఇళ్లు జూలు దులిపి జలదరించాలి
మూలకున్న చీపురకట్ట కు
సిగమోచ్చి ఒళ్లేరుగకుండా
ఇల్లంతా ఊగేది
 
అంటూ అలుకు పిడచను గురించి కవి పరిచయం చేస్తారు. ఇల్లాంతా ఊగేది అనేది ఇక్కడ క్రియాపదంగా కనిపించినా శుభ్రం చేస్తుంది అనేది లోనారసి. దీనిలోనే ....
 
ఎయిలి వరంగ లేచింది
మొదలు నడిరాత్రి పడుకునే దాకా
పోక్కీలైన నేలకు
అలుకు పిడచయ్యేది
అనీ చెప్పడం మనల్ని మన పాత జ్ఞాపకాలలోకి తీసుకేళ్లతారు కవి. అలుకుపిడచ కవితలు 2011 నుండీ 2017 కాలం లో శ్రీరాములు రాసిన 49 కవితల సమాహారం. ఇదీ వీరి 10 వ కవితా సంపుటి. దీనిలో మొదటి కవిత భూమి కీ చిరునవ్వు పచ్చ గడ్డి . దీనిలో శీర్షికే ఎంతో అందంగా వుంది...
 
పచ్చని గడ్డి చిరునవ్వు
దేహానికి అంటుకున్న చల్లదనం పోయి
మెల్ల మెల్ల గా మంచు పువ్వు
మీద ఎండకుస్తుంది
 
అంటూ పచ్చ పచ్చని గడ్డిని భూమాత చిరునవ్వు తో పోల్చారు. అలాగే మరో కవిత జీవశ్చవం అనే కవితలో.....
 
ఇక నుంచి
తల్లి తండ్రీ ఆచార్యుని తో పాటు
రైతు దేవోభవ అనాల్సిందే
 
అంటూ రైతు ను కూడా దైవం తో సమానంగా చూసినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందనే కవి మాటలు అక్షర సత్యాలు.
 
ప్రకృతిలో
ప్రణయముంది
ప్రళయముంది
ముంచటం కాదు పెంచటం నేర్చుకో
నిందించటం కాదు ప్రేమించటం నేర్చుకో
 
అంటూ బతకటం అంటే కేవలం తాను జీవించటం మాత్రమే కాదు ఇతరులను కలుపుకు పోవాలి. అందరిని ప్రేమించుకుంటూ పోవాలి అంటారు శ్రీరాములు. అందరి కన్నుల్లో ఆమె అనే కవితలో....
 
మేఘంలోంచి వచ్చిన చినుకు
మేఘం లోకి పోయినట్టు
మట్టి నుండీ పుట్టిన ప్రాణం
మట్టి లోనే కలిసిపోతుంది
 
అంటూ బ్రేస్ట్ క్యాన్సర్ తో చనిపోయిన ఓ అమ్మాయిని గురించి రాసారు. గరళ కంఠం అనే కవిత లో ఉద్యమం అనేది కన్ను తెరుస్తున్నట్లు అభ్యుదయం గా ఉండాలి కానీ కన్ను పోడుస్తున్నట్టు ఉండ రాదనీ హిత బోధ చేస్తారు . అలుకుపిడచ కు శ్రీరాములు నీవే కలవు అంటూ కే.శ్రీనివాస్ గారు పీఠిక ఈ సంపుటి లోని ఆత్మ ను చూపును .
*వీరికీ వచ్చిన పురస్కారాలు*
 
* సినారె కవితా పురస్కారం
( రావు రూకల కవితా సంపుటి కీ )
* ఈదురు సుబ్బయ్య పురస్కారం
( రావు రూకల కవితా సంపుటి కీ )
* శాతవాహన సాహిత్య పురస్కారం
( రావు రూకల కవితా సంపుటి కీ )
* ఉమ్మడి శేట్టి కవితా పురస్కారం
* స్నేహ నిధి పురస్కారం
* కాకతీయ విశ్వ విద్యాలయ పురస్కారం
(సంధర్భం కవితా సంపుటి కీ )
* ప్రీఫర్స్ ఫ్రంట్ పురస్కారం
(సంధర్భం కవితా సంపుటి కీ )
 
వీటి తో పాటుగా 2018 లో తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సంధర్భంగా రాష్ర్టప్రభుత్వం వీరిని ఆధునిక వచన కవిత్వ విశిష్ట సేవా పురస్కారం ను ఇచ్చి సత్కారించింది. అంతేకాకుండా వీరి కీ లభించిన మరో పురస్కారం వృత్తి రీత్యా రాష్ర్ట స్థాయి లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా లభించింది.
 
కందుకూరి శ్రీరాములు గారి రచనల పై కే. సౌభాగ్య గారు కవిత్వ జీవనదీ అనే విశ్లేషణత్మక పుస్తకం ను వెలువరించినారు. కందుకూరి శ్రీరాములు గారిది తాత్విక కవిత్వం. ఇది వారి జీవన నేపధ్యం నుంచి వచ్చినది. సున్నితమైన వ్యంగ్యం ; కవిత్వ మార్మికత వీరి కవిత్వం కు పెట్టని ఆభరణాలు.
 
* ఐ.చిదానందం *
చరవాణి - 8801444335
 
==మూలాలు==