స్త్రీవాదం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి ఐ.చిదానందం (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 42:
[[వర్గం:ఉద్యమాలు]]
[[వర్గం:స్త్రీవాదం]]
 
 
 
* స్త్రీ వాద సాహిత్య విమర్శ - ఒక పరిశీలన *
 
ఐ.చిదానందం
-----------------------------------------------------------------------
 
ఫెమినిజం అనే మాట కు సమానార్థకం గా తెలుగు లో వచ్చిన మాట స్త్రీ వాదం ; 1943 లో అస్థిత్వ వాద బీజాలు ఏర్పడి ప్రెంచి లో స్త్రీ వాద సాహిత్యం రావడం జరిగింది. 1953 లో ది సెకండ్ సెక్స్ అనే పుస్తకం స్త్రీ వాద ధృక్పధం కు భూమిక గా మారింది. అప్పటి నుంచే స్త్రీ వాదం బలం గా రావడం ప్రారంభం అయినది. 1975-85 అంతర్జాతీయ మహిళ దశాబ్ది. ఈనాటికే పురుష వైఖరి పై స్త్రీ విమర్శ కోణం ప్రారంభం అయింది. నీలి మేఘాలు కవితా సంకలనం ద్వారా స్త్రీ వాద కవిత్వం బల పడింది. అయితే ఇలాంటి కవిత్వం మిశ్రమ స్పందనలు వచ్చాయి.
 
స్త్రీ వాద కవితలు చదివి యవ్వనం లో ఉన్న ఆడపిల్లలు పెళ్లి సంసార బంధాలు బాధ్యత పట్ల అసహ్యం ఏర్పరుచుకుంటే అదే వీరు సాధించిన సాహిత్య ప్రయోజనమా అంటూ మంజీర లాంటి వారు ప్రశ్నించారు.
 
*స్త్రీ వాద విమర్శ లో ప్రధానం గా విమర్శకులు పరిశీలన చేసిన విషయాలు*
 
* పెళ్లి ; సంసారం ; ఇంటి పని ; గర్భధారణ వంటివి స్త్రీల సాధరణ జీవిత విషయాలు స్త్రీ వాదమేనా..?
* స్త్రీ వాదము లో ఎంచుకున్న వస్తువు పై మరియు అభివ్యక్తీ పై విమర్శ.
* స్త్రీ లైంగికత్వ శ్రమ దోపిడి పై వివేచన.
* నవల ; కథలలో స్త్రీ పాత్రలు చిత్రణ పై విమర్శ.
* కవిత్వం లో జెండర్ వివక్ష పై పరాధీనత పై నిరసన వ్యక్తీకరణ విధానం పై చర్చ విమర్శ.
 
స్త్రీ వాద కవిత్వం విషయం కు వస్తే 1984 మార్చి 23 న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కవిత బంధీపోట్లు.దీనిని సావిత్రి రాసారు. దీనిని తోలి స్పష్టమైన స్త్రీ వాద కవిత గా చాలా మంది అంగీకరించారు. అప్పట్లో చేరా గారు ఈ కవిత వాక్య నిర్మాణ పద్దతులపై వ్యాసం కూడా రాసారు.
అంతే కాదు విమల కవిత్వం పై జయప్రభ కవిత్వం లో పోలికలను ; కోండేపూడి నిర్మల కవిత్వం లో కోత్తదనం పై ; ఘంటసాల నిర్మల కవిత్వం లో వస్త్యంశాలను ఇలా అన్నీ రకాల అంశాల పై విమర్శ చేస్తు చేరా మంచి వ్యాసాలేన్నో రాసారు. కేతవరపు రామకోటి శాస్త్రి గారు కూడా స్త్రీ వాదం పై విమర్శ వ్యాసాలు రాసారు. వీరు హృదయానికి బహువచనం (కోండేపూడి) ; కఠోర షడ్జమాలు (వసంత కన్నాభిరామ్) ; మూడు తరాలు (నవల) వంటి రచనలపై వ్యాసాలు రాసారు. కాత్యాయనీ విద్మహే రాసిన వ్యాస సంకలనం సంప్రదాయ సాహిత్యం - స్త్రీ వాద ధృక్పధం. (1998). దీనిలో 1986 నుంచి 1997 వరకు దాదాపు దశాబ్ది కాలం కు పైగా వున్న స్త్రీ వాదం పై 13 వ్యాసాలు గలవు.
 
*స్త్రీవాదము పై కాత్యాయనీ విద్మహే సాహిత్య విమర్శ గ్రంధాలు*
 
* ఇటీవలి నవలలు - స్త్రీ వాద ధోరణులు (1994)
* స్త్రీ వాదం (2012)
* అలంకార శాస్త్రం లో స్త్రీ (1987)
* భరతుని నాట్య శాస్త్రం లో మహిళల జీవితం (2005)
* సాహిత్య ఆకాశం లో సగం
* ప్రాచీన సాహిత్యం మరో చూపు
* ఆధునిక తెలుగు సాహిత్యం స్త్రీ వాద భూమిక
 
*స్త్రీ వాద విమర్శ సంబంధిత వ్యాసాలు*
 
* స్త్రీ విముక్తి పథం లో రంగనాయకమ్మ (1986) - చేరా
* తెలుగు సాహిత్యం లో స్త్రీ వాదం - పి.సంజీవమ్మ
* స్త్రీ వాద సాహిత్యం ఒక పరిశీలన (2010) - డా.నళిని
* స్త్రీ వాదం - భాష వస్తు రూప నవనీత (2011) - ఎమ్.ఎమ్. వినోదిని
* సంప్రదాయ సాహిత్యం - స్త్రీ వాద ధృక్పధం (1998) - కాత్యాయనీ విద్మహే
* మీకు మీరే మాకు మేమే - శోభా రాణి
* ఔను....! ఇదీ .....విశృంఖలం - మంజీర
* ఎమిటీ విడ్డూరం - జి.కె.మూర్తి
* ప్రశ్నించండి సాహిత్య పీఠాధీపతుల్నీ - కాత్యాయనీ విద్మహే
* విరసానిది వినయమే అహంకారం కాదు - వరవర రావు
* ఇంతకీ ఈ కవిత్వం పేరేమిటి - చేరా
* వచన కవిత్వం - ఫేమినిజం (1993) - కాత్యాయనీ విద్మహే
 
విమర్శ ల విషయం లో ఎడేళ్ల క్రితం కవిత్వ భాషలో భావం లో కనిపించని తెగువ ; ఆత్మస్థైర్యం ఈ తరం స్త్రీవాదం లో కనిపించిదనీ ఆఫ్సర్ స్త్రీ వాదం ను సమర్ధించారు. కాని జ్వాలా ముఖి వంటి వారు కాస్మోటిక్ పూత లలో కవి సమయం కూరుకుపోయిందని స్త్రీ వాద కవిత్వం వాక్య విన్యాసం అనుభూతి విశేషం వున్నా కూడా ఇది నీలి కవిత్వం వార కవిత్వం అనీ తీవ్ర స్థాయి లో జ్వాలాముఖి మండిపడ్డారు. దీనికి ప్రతి గా జయప్రభ గారు జ్వాలాముఖి పై ఒక కవిత రాయగా దానికీ స్పందించి డాలర్ ప్రభ అనే కవిత రాసారు. ఆడవాళ్లు ఇంత ధైర్యం గా రాస్తున్న విషయాలు వీరికీ (జ్వాలాముఖి) విచ్చల విడిగా రాస్తున్నట్టు కనిపిస్తున్నాయా. అసలు సంకోచాలు లేకుండా మాట్లాడడం దిగంబర కవులే నేర్పరారు. కాని ఇప్పుడు జ్వాలాముఖి ప్యూడల్ వ్యవస్థ వాసనల ఉబిలో జ్వాలముఖి కూరుకుపోయారనీ చేరా విమర్శించారు. అయితే దీనికి ప్రతిగా ఎస్వీ సత్యనారాయణ ఎదుటి వాళ్ల ను ప్యూడల్ అనీ తాము ప్రోగేసివ్ లా ఫోజు కోట్టడం నేడు ఫ్యాషన్ అయ్యిందనీ ఘాటుగా స్పందించారు.
 
*స్త్రీ వాదం పై అనుకూల ధృక్పధం తో రాసిన వారు*
 
* చేరా
* సీతారామ్
* తిరుపతి రావు
* వరవర రావు
* రావి ప్రేమ లత
* రావి భారతి
* సోదం జయరాం
* ఎన్. గోపి
* అద్దేపల్లి
 
*వ్యతిరేక ధృక్పధం తో రాసిన వారు*
 
* జ్వాలాముఖి
* ఎస్వీ సత్య నారాయణ
* రావి శాస్త్రి
* జి.లక్ష్మీ నరసయ్య
* ముదిగోండ వీరభద్రయ్య
 
తెలుగు లో స్త్రీ వాద ధృక్పధం తో నవలలు రాసిన రంగనాయకమ్మ తన నవలలని స్త్రీ పాత్రల ద్వారా స్త్రీ వాదం వినిపించారు.స్త్రీ వాదం లో తోలి స్త్రీ వాద నవల జానకీ విముక్తి (1978-ముప్పాళ్ళ రంగనాయకమ్మ ). నవలా ప్రక్రియ పరంగా చూస్తే 1983 లో ఉప్పల లక్ష్మణ రావు రాసిన నవల అతడు - ఆమె.ఈ నవల పై ఓల్గా ఒక విమర్శ ను రాసారు. ఇదీ స్త్రీ వాద కోణం లో సాగింది. చలం రాసిన మైదానం లోని రాజేశ్వరి పాత్రను ఫెమినిస్టుగా ఓల్గా వ్యాఖ్యానించారు. అలాగే చలం రాసిన మైదానం నవల ను విశ్వనాధ వారి చెలియలి కట్ట నవల తో పోలుస్తూ జయ ప్రభ గారు మన చలం అనే సంకలనం లో ఒక వ్యాసం రాసారు. ఇదీ కూడా స్త్రీ హృదయ ఆవిష్కరణ పై సాగింది. 2008 లో కె.లక్ష్మి నారాయణ ; రాచపాళేం చంద్ర శేఖర్ రెడ్డి గార్ల సంపాదకత్వం లో తెలుగు స్త్రీ వాద నవల అనే వ్యాస సంకలనం వచ్చింది. దీనిలో దాదాపు 20-25 నవలలోని స్త్రీ పాత్రలు స్త్రీ చైతన్యపు ధృక్పధం పై విమర్శలు కలవు.
 
ఇక స్త్రీ వాద కథ విమర్శ కు వస్తే చేరా గారు 1987 లో పి.సరళాదేవి ; కె.రామలక్ష్మి కథలపై స్త్రీ వాద కోణం లో వ్యాసాలు రాసారు. అలాగే చేరా గారు తన వ్యాసాలలో ఓల్గా రాజకీయ కథల పై ; కుప్పిలి పద్మ మనసుకో దాహం (కథల సంపుటి ) పై ; పి.సత్యవతి ఇల్లలకగానే కథల సంపుటం పై మరియు అబ్బూరి ఛాయా దేవి అయిదు నక్షత్రాలు అనే కథ పై చేరాతలలో విమర్శ వ్యాసాలు రాసారు. ఇక కాత్యాయనీ విద్మహే గారు చలం కథ లైన నాయుడి పిల్ల ; భార్య ; నేనేం చేశాను ; అనసూయ వంటి కథ లపై విమర్శ రాసారు. మరో స్త్రీ వాద విమర్శకురాలు డా.నళినీ గారు పి.సత్యవతి ఇల్లలకగానే కథల పై ; ఓల్గా రాజకీయ కథలపై మోక్కుపాటి సుమతీ (అ)మానవ సంభాందాలు వంటి కథలపై విమర్శలు రాసారు.
 
ప్రబంధ సాహిత్యం లోని స్త్రీని గురించి చెబుతూ నాయిక పై లైంగిక కాముకత కేవలం నాయకుడి కి మాత్రమే కాదు. నాయకుడి తో పాటు కవి కామ వాంఛ తో ఉంటాడనీ కట్టమంచి రామలింగా రెడ్డి గారు ఒక రచన లో ప్రబంధాలపై విమర్శ చేశారు. ఇదే విషయం పై సమాంతరం గా జె.కనుకదుర్గ గారు నంది తిమ్మన పారిజాతాపహరణం లోని లైంగిక రాజకీయాలను విప్పి చెబుతూ ఒక వ్యాసం రాసారు. అలాగే జయప్రభ గారు మంచన రాసిన కేయూర బాహు చరిత్ర లోని కథలను స్త్రీ కోణం లో విమర్శ చేస్తూ వ్యాసాలు రాసారు.
 
*స్త్రీ వాదము పై వచ్చిన కోన్ని పరిశోధనలు*
 
* విశ్వనాథ నవలా సాహిత్యం లో స్త్రీ - ఉషారాణి
* స్త్రీ వాదం తాత్వికత - ఓల్గా సాహిత్యం (2010) - కిన్నెర శ్రీదేవి
* స్త్రీ వాద కవిత్వం సమగ్ర పరిశీలన (1999- ఎయూ) - బి.బాపిరెడ్డి
* స్త్రీ వాద కవిత్వం పరిశీలన (1999- ఎస్వీయూ) - వి .విజయ లక్ష్మీ
* తెలంగాణ స్త్రీ వాద నవలల్లో సాంఘికోద్యమం (1998-బనారస్ ) - జి.శ్యామల
* స్త్రీ వాద కవిత్వం వస్తు వైవిద్యం అభివ్యక్తీ (2005-టియూ) - పి.సత్యవతి
* తెలంగాణ రచయిత్రుల - సాహిత్య ధృక్పధం (ప్రస్తుతం -ఓయూ ) - బి.రజిత
* తెలుగు కవిత్వం స్త్రీ స్వభావ చిత్రణ (ప్రస్తుతం -ఓయూ ) - బి.నాగరాజు
* తెలుగు సాహిత్య విమర్శ - స్త్రీల కృషి (2012) - కందాళ శోభరాణి
* కవయిత్రుల కవిత్వం లో స్త్రీ మనో భావాలు (1993-ఎమ్.ఫిల్) - పి.లక్ష్మి
 
ఇక తేలంగాణ విషయం కు వస్తే బండారు అచ్చమాంబ గారు తోలి సారి గా స్త్రీ వాద విమర్శ చేసారనీ చేప్పవచ్చు. వీరు అబల సచ్చరిత్ర రత్నమాల (1905) లో స్త్రీల పై పురుషాధిక్యత ను ప్రశ్నించారు. అలాగే తేలంగాణ మాండలికం (నిజామాబాద్ యాస లో ) లో తోలి సారి గా వచ్చిన స్త్రీ వాద నవల ఆమే అడవిని జయించింది (భారతి). ఇంకా తేలంగాణ లో పని ప్రాంతాలలో స్త్రీ పురుషుల మధ్య గల వ్యత్యాసాలను పేర్కోంటూ అస్మిత అనే సంస్థ మహిళావరణం అనే పుస్తకం ను ప్రచురితం చేసింది.సి.మృణాళి గారు రామయణ భారతం లోని స్త్రీ పాత్రలను స్త్రీ కోణం లో ఒక్కోక్కటీ గా ప్రస్తావన చేస్తూ ఇతిహాసం అనే రచన చేసారు.
చివరగా నిజానికీ స్త్రీలు రాసిన ఇలాంటి సాహిత్యంను తోలినాళ్ళలో స్త్రీ చైతన్య కవిత గా పిలిచేవారు. ఆతర్వాతే స్త్రీ వాదం గా స్థిరపడింది. అనేకాచర్చోపచర్చలకు ; సాహిత్య చైతన్యం కు ఆలవాలం అయిన ఇలాంటి ఉద్యమ సాహిత్యాలు మళ్లీ రావాలనీ కోరుకుంటూ..........
 
* ఐ.చిదానందం *
చరవాణి - 8801444335
"https://te.wikipedia.org/wiki/స్త్రీవాదం" నుండి వెలికితీశారు