కాలువ మల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎పరిచయ వ్యాసం: తెలంగాణ కథానిక కృషీవలుడు * కాలువ మల్లయ్య * గారి పై చిరు వ్యాసం ...... * ఐ.చిదానందం * ------------------------------------------------------------------------------ ఒకప్పుడు కథ చెప్పమనీ తాతనో అమ్మమ్మనో నాయనమ్మ నో బ్రతిమలాడి కథలు వింటూ హాయిగా నిద్రేంచేవారు . కాలం మారిపోయింది కథల రూపం మారింది కానీ కథల ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. తెలుగు కథను ప్రజా చైతన్యంతో ప్రచారం కల్పించిన వ్యక్తి .ప్రజల జీవనం లో వచ్చిన మార్ప...
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 155:
|}
 
==పరిచయ వ్యాసం==
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
తెలంగాణ కథానిక కృషీవలుడు * కాలువ మల్లయ్య * గారి పై చిరు వ్యాసం ......
 
* ఐ.చిదానందం *
------------------------------------------------------------------
 
ఒకప్పుడు కథ చెప్పమనీ తాతనో అమ్మమ్మనో నాయనమ్మ నో బ్రతిమలాడి కథలు వింటూ హాయిగా నిద్రేంచేవారు . కాలం మారిపోయింది కథల రూపం మారింది కానీ కథల ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. తెలుగు కథను ప్రజా చైతన్యంతో ప్రచారం కల్పించిన వ్యక్తి .ప్రజల జీవనం లో వచ్చిన మార్పులను కథల ద్వారా బాధ్యత గా చిత్రీకరణ చేసిన వ్యక్తి .ఎంచుకున్న వస్తువులో, శిల్పంలో సహజంగా రాసే రచయిత కాలువ మల్లయ్య గారు.
 
కాలువ మల్లయ్య తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జూపల్లి మండలం తేలుకుంట గ్రామంలో జనవరి 1953లో జన్మించారు . ఉపాధ్యాయునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కెమిస్ట్ గా పనిచేసి పదవీ విరమణ చేసారు.1980లో వెెలి అనే తొలికథ ద్వారా రచనావ్యాసంగం ప్రారంభించి ఇప్పటి వరకు సుమారు 850 కథలు, 12 నవలలు, అనేక వ్యాసాలు రాశాడు. వీరి కథలు కన్నడ, హిందీ, తమిళ, మళయాళ భాషల్లోకి కూడా అనువదింపబడ్డాయి.
 
వీరి రచనలు
 
*కవిత్వం*
 
* కవితా ఝరి
* కవితా సౌరభం
 
*నవలలు*
 
* అస్పృశ్య కోయిల
* భూమి పుత్రుడు (1991)
* సాంబయ్య చదువు (1995)
* మాట్లాడే బొమ్మలు (1999)
* బతుకు పుస్తకం (2000)
* డబ్బు - తృప్తి =దుఃఖం (2002)
* గువ్వల చెన్న (2005)
* ఊరంటే (1994)
* నీ బాంచెన్ కాల్మొక్తా (1997)
* మాదిగ విజయం
 
*కథల సంపుటిలు*
 
* అవ్వ తోడు గీదీ తెలంగాణ
* కాలువ మల్లయ్య కథలు
* చెప్పుల తయారీ
* కట్నం కథలు (1973)
* ఇదేనా ఇంటర్వ్యూ (1983)
* రాజకోడి (1987)
* మూడు తరాలు
* మా కథలు ఘర్మ జలానికీ ఖరీదు కట్టే .....షరాబు
* నేల తల్లీ
* మమతలే మరుగై
* వెలి
* సంఘర్షణ (1995)
* బాకీ బతుకులు
 
*కొన్నీ కథల పేర్లు*
 
* తల్లీ రుణం
* ఆశాజీవి
* హత్య
* నిరీక్షణ
* ప్రస్థానం
* అవసరం
* వెలి (తొలి కథ)
* లంచాల దేవుడు
* ఆదివారం
* సంఘర్షణ (1995)
* బాకీ బతుకులు
* అగ్ని గుండం
* నా తెలంగాణ
* ఎంగిలి చేత్తో
* చావు
* హింస రచన
* అల్లము రబ్బా
* ఆంబోతు
* బోధివృక్షం
* మళ్లీ తల్లీ ఒడిలోకీ
* అడవి కాచిన వెన్నెల
* గుప్పెడు మనసు
* యుద్ద భూమి
* అన్న
* జీవఛ్ఛవం
* కర్రోడు
* రూపాయి రూపాయి
* అమ్మ మీది సొమ్ములు
* దొరసాని చీర
* సృష్టికర్త ఆవేదన
* సృష్టికర్త చిరునామా
* పరాధీన
* హక్కు
* దాహం
* ఇల్లు
* కరువు
* మేము నుండి నేను లోకి
* పేగుమాడుతున్న వాసన
* ద్రౌపదీ
* ఆకలి దాడులు
* మనసు - మనువు
* దొర గారి భార్య
* అంబేద్కర్ సాక్షిగా
* అక్షరాస్యత
* అడ్డాల నాడు
* అతడే చివరి తెలుగోడు
* అమ్మమ్మ
* గలుమ
* టాకింగ్ డాల్
* తీపి
* దగా దగా మేఘం
* నా తెలంగాణ ఆహ్వానం
* నిరుడు కురిసిన సమూహాలు
* భద్రత
 
*ఇతరములు*
 
* కుల రహిత భారతం
* తెలుగులో ప్రగతి శీల కథా సాహిత్యం (సిద్దాంత వ్యాసం)
* గుమ్మి (తెలంగాణ పదకోశం)
 
వీరి కథలలో దొరసాని చీర కథ దొరల పశుత్వ లైంగిక దోపిడీకి నిరసనగా రాసిన కథ ఇదీ , ఎంగిలిచేత్తో అనే కథ దుబ్బమ్మ అనే దళిత స్త్రీ కన్నీళ్లను చిత్రించింది. చావు కథ సంప్రదాయాల వల్ల మనుషులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేస్తుంది. చేతులు అనే కథ వివిధ వర్గాల్లోని విలువలను వివరంగా విశదీకరిస్తుంది. భూస్వామ్య-జమీందారీ వ్యవస్థకు ప్రతినిధులైన దొరల ఇండ్లలో స్త్రీల జీవితాలు పంజరంలోని చిలుకల్లా వుంటాయనీ ‘పంజరం’ రాసారు. ఈ కథలో మంజులాదేవి ని యాభైయేళ్ళ పైబడిన మాధవరావు దొర రెండవ భార్యగా తెచ్చుకుంటాడు. దొరగడిలో అడుగు పెట్టేనాటికి తనంత వయస్సున్న కొడుక్కి, పదిహేనేళ్ళ కూతూరికి తల్లిగా మారాల్సి వస్తుంది మంజులాదేవి. రెండేళ్ళకే విధవగా మారి తన జీవితాన్ని ఆ కుటుంబానికే ధారబోయాల్సి వస్తుంది. దొర కొడుకు అధికారం చేలాయిస్తూ మంజులాదేవికి స్వంత వ్యక్తిత్వమంటూ లేకుండా చేస్తాడు. ఆ తర్వాత తరంలోంచి వచ్చిన మనవరాలు చదువుకుంటూ చైతన్య ఉద్యమాల్లో పాల్గొంటుంది. భూస్వామ్య వ్యవస్థలో స్త్రీ స్థానం గత యాభై ఏళ్ళు నుండి ఎట్లా మారుతూ వస్తున్నదో రచయిత ఈ కథ ద్వారా వ్యక్తపరిచారు.
 
తెలంగాణ గ్రామాల్లో నక్సలైట్‌ విప్లవోద్యమాల ప్రభావం అధికంగా ఉన్నకాలంలో దొరలు తననివాసాన్ని పట్టణాల్లోకి మార్చారు. పట్టణాల్లో స్థిరపడ్డాక భూస్వామ్య కుటుంబ స్త్రీల జీవితాలు మరింత దిగజారిన పరిస్థితుల్ని తెలియజేసే కథ ‘పాపం దొరసాని . రచయిత గత మూడు తరాలుగా స్త్రీల జీవితంలో ఆర్ధిక స్వేచ్ఛలేకపోవడాన్ని చిత్రించిన కథ ”పరాధీన”. అనే కథ లో . నేత కార్మికుని ఇంట్లో పుట్టిన మల్లవ్వకు యవ్వనంలోకి అడుగు పెట్టేనాటికి పట్టుపీతాంబరం కావాలన్న కోరిక కల్గింది. తండ్రిని అడిగితే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నామని పెళ్ళినాటికి చూస్తాంలే అని దాటవేస్తాడు. పెళ్ళయిన తర్వాత భర్తను అడిగితే వాయిదాలు వేసుకుంటూ వస్తాడే తప్ప ఆమె కోరిక నెరవేర్చడు. మరికొన్నాళ్ళు గడిచాక ఉద్యోగం చేసున్న కొడుకు పట్టుచీర తెస్తాడని భావిస్తే మాములు చీర తెస్తాడు. మూడు తరాలలో తన కోరిక తీరనందుకు తనలో తాను కుమిలిపోతుంది. ఒకరోజు భర్త మంచం పక్కన నేలపై చాపవేసుకొని పడుకున్న మల్లవ్వ శాశ్వత నిద్రలోకి జారిపోతుంది. ఈ కథలో తండ్రి, భర్త, కొడుకు మల్లవ్వ కోరిక తీర్చలేకపోయారు. పట్టుచీర కావాలన్న చిన్నకోరిక తీరని ఆమె బతికినన్ని నాళ్ళు పరాధీన జీవితాన్ని గడిపింది.
 
అలాగే స్వేచ్ఛలేని జీవితం నుండి విముక్తి కోరుకుంటున్న స్త్రీల జీవితాల్ని చిత్రించిన కథ ”గలుమ” ఇందులో మల్లీశ్వరి చదువుకున్న స్త్రీ పై చదువులకు వెళ్తానంటే తండ్రి అంగీకరించడు. పెళ్ళయిన తర్వాత భర్తనడిగితే అతనూ తిరస్కరిస్తాడు. ఆడవాళ్ళకు చదువు అవసరం లేదని, చదివి రాజ్యాలు ఏలేదిలేదని అతని అభిప్రాయం. స్త్రీ వంటపని, ఇంటిపని కాక బండెడు చాకిరీ చేసినా ఆ పనులకు ఏ మాత్రము విలువలేదనడం మల్లీశ్వరిని కలచివేస్తుంది. తనకు అందని ఉన్నత చదువులు కూతురికి అందిస్తుంది. కూతురు బాగా చదువుకొని స్త్రీవాద ఉద్యమాల్లో పాల్గొంటూ ఆడవాళ్ళ జీవితాలు గలుమల వద్ద ఎదురుచూడడం కాకూడదని, స్వంత వ్యక్తిత్వం కల్గి ఉండాలని తల్లికి చెప్తుంది. అంతేకాకుండా ”అమ్మా పైటల్ని తగలెయ్యడమే కాదు, గలుమలను తగలెయ్యాలి” అంటుంది. స్త్రీ లకు సహజ అందాన్ని తెచ్చిపెడ్తుందని తెలియచెప్పిన కథ ”శ్రమైక జీవన సౌందర్యం”. విధివంచితుల పట్ల ఉండాల్సిన స్పృహను సూచించిన కథ ‘శిల-శిల్పం’. బావమరదళ్ళ పవిత్రప్రేమను చిత్రీకరణ చేస్తు బతుకుదేరువు కోసం వలస వెళ్ళిన ఆ బావ రాక కోసం పరితపించే యువతి జీవితంలో ఎదురైన దురదృష్టాన్ని తెలియజేసే కథ ”నిరీక్షణ”. నేటి సమాజంలో స్త్రీలు స్వంత వ్యక్తిత్వం, సమానత్వం, ఆర్ధిక స్వావలంబన కోరుతున్న వైనాన్ని చిత్రించిన కథ ‘ఉద్ధరింపు’
 
ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్థ పతనాన్ని ప్రతిబింబించే 'ఆంబోతు', 'యుద్ధభూమి', 'దొరగారి గడి' వంటి కథలు, 'ఈ భూమి నాది', 'వెలి' వంటి విప్లవ సాంస్కృతిక కథలు రాశారు మల్లయ్య. దొరసాని కథలో అగ్రవర్ణ ; శ్రామిక ; ఆధునిక స్త్రీల బతుకు వెతలను తన కథలతో చిత్రీకరించారు. ఘర్మ జలానికి ఖరీదు కట్టే .....షరాబు కథలలో చేనేత కార్మికులు బట్టలు వుతికే వారి కూలీలు కార్మికులు జీవితాలలో ఆర్తిని ఆశని అసంతృప్తిని కథా వస్తువులుగా చేసుకొని రచన చేశారు.
 
నేలతల్లి కథలసంపుటి 30కథలతో బరువైన బతుకులతో చిత్రీకరించింది. భూమి కూడా మోసం చేస్తుంది. కన్న బిడ్డ ల మధ్య పేగు పంచుకుని పుట్టిన సొదరుల మధ్య సైతం కారణమవుతుంది. తల్లీ (భూమాత) ఎప్పుడు బిడ్డల నాశనం కొరదు. మధ్యలో దళారులే . అంటూ భూమి పుత్రుల వ్యధలను అంతరంగాలను చిత్రీకరణ చేసింది. ఆర్ధికంగా బాగానే వున్నా శరీరం చేతనైంనంత కాలం పనిచేసి సంపాదిస్తాననీ హక్కు అనే కథలో లింగమ్మ పాత్ర ద్వారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చెబుతారు కాలువ మల్లయ్య. సంభాషణ చాతుర్యంతో మాండలిక ప్రయోగం తో రాసే కథలు వీరివి . ద్రౌపదీ కథ నాటకీయ శైలిలో సాగుతూ స్త్రీ జాతిని మేల్కొల్పతుంది. అభ్యుదయం వైపు ఆలోచించమంటుంది. అలాగే ఆకలి దాడులు కథలో దోపిడీకి గురి అవుతున్న దళితుల గాధను చెబుతారు కాలువ మల్లయ్య గారు. ఇందులో అమాయకులపై ప్రభుత్వం చేసే దౌర్జన్యాలను లోపాయికారీ వ్యవస్థ ను రచయిత ఎత్తి చూపుతారు.
 
దాహం అనే కథ ద్వారా అధికారం పై డబ్బున్నోళ్లకు వున్న ప్రవర్తన ను మనసు - మనువు కథలో బ్రహ్మణ కులం లో క్లేషాలను ను చెప్పారు. సంస్కారం అనే కథలో మేరీ పాత్రకు జరిగిన మోసపు ప్రేమను ; చెట్టు కథలో దొరల ఆధిపత్య నిరసనను ; అతడే చివరి తెలుగోడు కథ ద్వారా తెలుగు భాషా చైతన్యంను రాస్తాడు రచయిత. వీరి కొన్నీ కథలు చదువుతుంటే ఒక డ్యాకుమెంటరీ చూస్తున్నట్లు వుంటుంది.వీరి కథలు ఎక్కడో జరిగిన కథలు లా కాకుండా పక్కనే మన ఇండ్లలోనే మనకే జరిగినట్లు గా వుంటాయి. అందుకేనేమో వీరి ప్రతి కథ చదివింపచేస్తుంది.
 
*వీరి పై వచ్చిన పరిశోధనలు*
 
* కాలువ మల్లయ్య కథలు - వస్తు రూప అధ్యయనం (sku) - సి.ఆది నారాయణ
* కాలువ మల్లయ్య కథలు - ఒక అధ్యయనం (2003-hcu) - శ్రీనివాస్ రెడ్డి
* కాలువ మల్లయ్య కథలు - ఒక పరిశీలన (2004-Tu) - ఎస్. వీరాస్వామి
* కాలువ మల్లయ్య నవలలు - సామజిక చిత్రణ (2005-ku) - బి.మల్లికార్జున్
* కాలువ మల్లయ్య రచనలు - సమగ్ర అధ్యయనం (ప్రస్తుతం-ఓయూ ) - వర ప్రసాద్
 
కథారచయితగా ఏలాంటి వైవిధ్యంతో కూడిన సాదాసీదా జీవితాలను నిక్షిప్తం చేసారో నవలాకారుడిగా కూడా మల్లయ్య గారు వెనుకబడిన వర్గాల సంస్కృతి ని శ్రామికుల వ్యధలను తెలిపారు. జానెడు పొట్ట కోసం రూపాయి సంపాదన కోసం శ్రమించే కష్టజీవుల గాధలను వస్తువులుగా తీసుకొని వాస్తవ దృష్టికోణం లో కథలు రాసారు. వీరి ప్రతి ఒక్క నవల తెలంగాణ మాండలిక భాష లో వుంటూ ఆ పాత్రలు మనకు పరిచయం వున్నట్లు వుంటాయి.
 
వీరు దాదాపుగా 12 నవలలు దాకా రాసారు. వీరి నవలలో భూమి పుత్రుడు ప్రత్యేకమైనది. గ్రామాలలో కులవ్యవస్థ రూపాంతరం చెంది కులవృత్తులు ఎలా నాశనం అవుతున్నాయో కాలానుగుణంగా పరిస్థితులను బట్టి వృత్తులు ఎలా చేతులు మారుతున్నాయో ఈ నవలలో చిత్రీకరణ చేశారు. సాంబయ్య చదువు అనే నవలలో నిజాం పాలన లో తెలంగాణ గ్రామీణ సమాజం ఎలా మార్పులకు లోనైంది అనే విషయం చెప్పారు. నక్సలైట్ ఉద్యమ ప్రభావం ; మద్యం మాంసం కల్లు విందు వినోదాలకు అలవాటు పడిన జనం దేశ్ ముఖ్ ల గడీలా పాలన నిజాం పాలన లి రైతు ల దుర్బర స్థితి ని ఇవ్వన్నీ సాంబయ్య చదువు నవల లో చర్చించారు. దేశ స్వాసంత్ర్యం తర్వాత గ్రామీణ జీవితం లో పలు మార్పులు జరిగాయి. వృధ్దిపెరిగింది ; సౌకర్యాలు పెరిగాయి అలాగే కొన్నీ అవలక్షణాలు మాత్రం అలాగే వున్నాయి. ఈ విషయం నే చెబుతూ మాట్లాడే బొమ్మలు అనే నవలను రాసారు. ఇలా ప్రతి నవలలో ను ఏదో ఒక సామాజిక విషయం ను చర్చించడం వీరి ప్రత్యేకత. అందుకే వీరి నవలలన్నీయు సమాజ ప్రతిబింబాలుగా నిలిచాయి. ఎందరో హేమహేమీల మధ్య సగర్వంగా నిలబడదగిన కథకులు. మంచి నవలాకారులు ; నిబద్దత గల విమర్శకులు కాలువ మల్లయ్య గారు.
 
* ఐ.చిదానందం *
8801444335
 
==ఆధార గ్రంధాలు==
# కాలువ మల్లయ్య కథలు – తెలంగాణా జన జీవితం – ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య
"https://te.wikipedia.org/wiki/కాలువ_మల్లయ్య" నుండి వెలికితీశారు