నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (10), typos fixed: ె → ే , , → , (11), , → , (5)
పంక్తి 1:
[[దస్త్రం:Motor oil refill with funnel.JPG|thumb|right|కృత్రిమ [[మోటారు నూనె]]ను ఒంచుతున్న దృశ్యం]]
 
'''నూనె''' లేదా''' తైలం''' ([[ఆంగ్లం]]: '''Oil''') ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద, సాధారణ వాతావరణ పీడనంలో ద్రవరూపంలో ఉండే ద్రవ రసాయన పదార్ధాలు. ఇవి సాధారణంగా [[నీరు|నీటి]] లో కరుగవు. ఇవి ఎక్కువగా [[హైడ్రోజన్]] మరియు, [[కార్బన్]] మరియు, [[ఆక్సిజన్]] సమ్మేళనాలు.కొన్నింటిలో వీటికి అదనంగా [[సల్ఫరు]], [[నైట్రోజన్]], వంటివికూడ చేరివుండును. [[వంట నూనెలు]], [[పెట్రోలియం]] మొదలైనవి ముఖ్యమైన నూనెలు.
 
== రకాలు ==
[[దస్త్రం:Italian olive oil 2007.jpg|thumb|left|ఆహారంలో వాడే అవిసెఅవిసే నూనె సీసా]]
 
నూనెలు స్థూలంగా రెండు రకాలు: 1. శిలాజ నూనెలు. ముడి పెట్రోలియం నుండి తయారగు నూనెలు. 2. సేంద్రియ నూనెలు. జంతు, వృక్ష సంబంధిత నూనెలు.
 
== శిలాజ సంబంధిత నూనెలు ==
ముడి [[పెట్రోలియం]] నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling point) కలిగిన [[హెక్సెను]], పెట్రొలు/[[పెట్రోల్]], [[కిరోసిన్ ]], [[డీసెలు]] వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి, అధిక మరుగు ఉష్ణోగ్రత ఉన్నవి [[ఖనిజ తైలము]] / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు, ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగున్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగుండవు. ఇవి ఆధునిక మానవునికి విస్తృతంగా [[ఇంధనం]]గా ఉపయోగపడుతున్నాయి.
 
== సేంద్రియ (ఆర్గానిక్) నూనెలు ==
పంక్తి 15:
 
=== జంతు నూనెలు ===
'''జంతు/జీవనూనెలు''' : జంతు నూనెలను భూమిమీద నివసించు మరియు, నీళ్లలో జీవించు [[జంతువు]]ల నుండి ఉత్పత్తి చేయుదురు. ఇవి రెండు రకాలు.
 
* 1. క్షీరద జంతువుల [[పాలు|పాల]] నుండి ఉత్పతిచేయు కొవ్వులు (ఆవు, గేదె, మేక వంటి క్షీరదాలు).
పంక్తి 23:
'''వృక్షనూనెలు''' : వృక్ష నూనెలు రెండు రకాలు.
 
1. మొక్కల/చెట్ల పళ్లగుజ్జు, విత్తనాల నుండి ఉత్పన్నమగు నూనెలు/కొవ్వులు. వీటినే''' శాకతైలములు/నూనెలు''' (vegetable oils) అంటారు. ఇందులో ఎక్కువ నూనెలు ఆహారయోగ్యమైనవి (edible oils). ఇవి[[సంతృప్త కొవ్వు ఆమ్లం|సంతృప్త కొవ్వుఆమ్లాలు]] మరియు, [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వుఆమ్లాలను]] కలిగి ఉంటాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో రెండు రకాలున్నవి.ఒకటి ఏక ద్విబంధమున్న అసంతృప్త ఆమ్లాలు, ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న ఆమ్లాలు.ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వుఆమ్లాలను బహుద్విబంధ కొవ్వు ఆమ్లాలని అంటారు. కొన్ని నూనెలు (ముఖ్యంగా కొన్ని చెట్ల గింజల నూనెలు) ఆహారయోగ్యం కాదు. వాటిని సబ్బులు, [[కొవ్వు ఆమ్లాలు]], గ్రీజుల తయారిలో వాడెదరు.
 
* పళ్ళగుజ్జు నుండి తీయునూనెలు: [[ఆలివ్ నూనె]], మరియు, [[పామాయిల్]] వంటివి.
* మొక్కల విత్తనముల నుండి తీయు నూనెలు: [[వేరుశెనగ]], [[నువ్వులు]], [[ఆవాలు]], [[పొద్దుతిరుగుడు నూనె]], [[కుసుమ]], [[పత్తిగింజల నూనె]] వంటివి.
* చెట్ల గింజల నుండి తీయు నూనెలు: [[వేప]], [[కానుగ]], [[ఇప్ప]], [[మామిడి]], [[సాల్‌సీడ్ నూనె]] , [[నారింజ విత్తన నూనె]], [[షీ ఫ్యాట్]], [[మరూల నూనె]], [[ద్రాక్ష గింజల నూనె]], [[పైన్ గింజల నూనె]]
 
2. మొక్కల/చెట్ల [[ఆకులు]], [[పూలు]], పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins) మరియు, వేళ్ళ నుండి ఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలను'''[[ఆవశ్యక నూనె]] లు''' (essential oils) అంటారు. ఆవశ్యక నూనెలు మరియు, అవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేరు, వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌బెంజిన్ రింగులను కలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలుగా వినియోగిస్తారు.
 
* పూల నుండి తీయునూనెలు: [[గులాబీ]], [[మల్లె| మల్లెలు]], జాజి వంటివి.
* పూల మొగ్గల నుండి: లవంగనూనె వంటివి.
* బెరడునుండి: దాల్చినచెక్క (cinnamon), cassia, మరియు, sassafras లనుండి
* ఆకుల నుండి: నీలగిరి (Eucalyptus), దాల్చిన (cinnamon), లెమన్‌గ్రాస్‌, పెప్పెర్‌మెంట్, రోజ్‌మేరి, టీ నూనెలు
* కాండం నుండి: గంధంనూనె, దేవదారు (cedar), కర్పూరం, రోజ్‌వుడ్‌ నూనెలు.
పంక్తి 49:
 
=== చల్లదనం ===
మినరల్/ఖనిజ నూనెలను కొన్ని విద్యుత్ పరికరాలలోని వేడిని తగ్గించడానికి వాడతారు. ముఖ్యంగా[[విద్యుత్తు]] ట్రాన్సుఫారంలలో. విద్యుత్తు ఉత్పత్తికేంద్రాలలో ఉత్పత్తి అయిన విద్యుతును పంపిణి చేయునప్పుడు, ఉపవిద్యుత్తు పంపిణి కేంద్రాలకు పంపుటకు, ఎక్కువ వోల్టేజికి మార్చి (11-33KV) సరాఫరా చేయుదురు. అలాగే ఉపవిద్యుత్తుకేంద్రాలలో విద్యుత్తు వొల్టేజిని తగ్గించి (గృహాలకు250 volts, మరియు, పరిశ్రమలకు11Kv-440V) పంపిణిచేయుదురు. ఇలా విద్యుత్తు యొక్క [[వొల్టేజి]]ని తగ్గించుటకై, పెంచుటకై ట్రాన్సుఫారం (transform) లను ఉపయోగించెదరు. ఇలా వొల్టేజిని తగ్గించు, పెంచు సమయంలో వేడి ఉత్పన్నమగును. ఆ వేడిని తగ్గించుటకై ట్రాన్సుఫారం ఆయిల్‌ అనబడు మినరల్‌ నూనెను ట్రాన్సుఫారంలలో ఉపయోగించెదరు.
 
=== ఇంధనం ===
పంక్తి 73:
{{నూనెలు}}
{{ఆవశ్యక నూనె}}
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు