"భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: , మరియు → , (2)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: , మరియు → , (2))
 
== ప్రాముఖ్యత మరియు లక్షణాలు ==
ప్రాథమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, మరియు బాధ్యతగలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇక్కడ ప్రభుత్వమనగా, భారతదేశంలో అధికారంగల అన్ని అంగాలు. వీటిలో [[భారత ప్రభుత్వము]], [[పార్లమెంటు]], భారతదేశంలోని రాష్ట్రాలూ, రాష్ట్రాలలో గల, జిల్లాపరిషత్తులూ, కార్పొరేషన్లు, నగరపాలికలు, పంచాయతీలు, గ్రామపంచాయతీలు వగైరా.
 
== సమానత్వపు హక్కు ==
సమానత్వపు హక్కు, రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17 మరియు 18 ల ప్రకారం ప్రసాదించబడింది. ఈ హక్కు చాలా ప్రధానమైనది, స్వేచ్ఛా సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు, క్రింది విషయాల గ్యారంటీనిస్తుంది :
* చట్టం ముందు సమానత్వం : రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, బారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం <ref name=State/> వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ మరియు పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి వివక్ష చూపరాదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 14 Fundamental Rights]].</ref>
* పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం మరియు సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, మరియు [[దేవాలయాలు]] మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వాలు కలుగజేయవచ్చు.</ref>
* పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం : అధికరణ 16 ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు, పౌరులకు ఏలాంటి వివక్షలూ చూపరాదు. 2003 'పౌర (సవరణ) బిల్లు' ప్రకారం, ఈ హక్కు, ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు.<ref name="OCI">{{cite web
| url = http://rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2871439" నుండి వెలికితీశారు