రాజ్యసభ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
Gk obtate
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
{{భారత రాజకీయ వ్యవస్థ}}
 
[[భారత పార్లమెంటు]] లోని ఎగువ సభను '''రాజ్యసభ''' అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల [[శాసనసభ]]ల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. దీని సభ్యుల సంఖ్య 250. ఇందులో రాష్ట్రాల నుండి 229,కేంద్రప్రాలిత ప్రాలిత నుండి 9, 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని [[రాష్ట్రపతి]] నామినేటు చేస్తారు.అయితే ప్రస్తుతం సభ్యుల సంఖ్య 245. ఇందులో రాష్ట్రాల నుండి 229, కేంద్రప్రాంత ప్రాంతాల నుండి 4, వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని [[రాష్ట్రపతి]] 12 మందిని నామినేటు చేస్తారు. సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
 
రాజ్యసభకు సభాపతి (చైర్మను) గా [[ఉపరాష్ట్రపతి]] వ్యవహరిస్తారు. సభ్యుల నుండి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. [[లోక్‌సభ]] వలె రాజ్యసభ రద్దు కావడం అనేది ఉండదు. లోక్‌సభ వలెనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి, రాజ్యసభ నిర్ణయాన్ని తోసిరాజనే అధికారం లోక్‌సభకు ఉంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్యా వివాదం తలెత్తినపుడు రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగు జరిపినపుడు, సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినపుడు, సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు.
"https://te.wikipedia.org/wiki/రాజ్యసభ" నుండి వెలికితీశారు