"మాలిక్ మక్బూల్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[బొమ్మ:Malik Maqbool tomb Delhi.jpg|250px|right|thumb|ఢిల్లీలో జీర్ణావస్థలో ఉన్న మాలిక్ మక్బూల్ సమాధి.]]
'''మాలిక్ మక్బూల్''' లేక '''దాది గన్నమ నాయుడు''' / యుగంధర్ ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు [[గణపతి దేవుడు|గణపతి దేవుని]] కడ మరియు [[రుద్రమదేవి]] కడ సేనాధిపతి గా నుండెను. దాది వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు [[కాకతీయులు|కాకతీయ]] చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. కొత్త భావయ్య గారి పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల. ఈ విషయముపై మరికొంత పరిశోధన అవసరము.
 
గన్నమ నాయుడు [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేసెను. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుదు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణము ను గన్నయ కు అంకితమిచ్చెను. ఈతనికి ఫిరోజ్ షా తుగ్లక్ (1351–1388) 'ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ' అను గొప్ప బిరుదును ఇచ్చెను.
 
 
1323వ సంవత్సరములొ ముస్లిముల ధాటికి [[ఓరుగల్లు]] తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు మరియు పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కిరి. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకొనెను. ఢిల్లీ చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చెను. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. మరియు తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట ఢిల్లీ సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడెను. సుల్తాను మక్బూల్ ను పంజాబ్ పాలకునిగా ముల్తాను పంపెను. కొంత కాలము పిమ్మట ఫిరోజ్ షా కాపయనాయుని లొంగదీయుటకు పెద్ద సైన్యముతో మక్బూల్ ను ఓరుగల్లు పంపెను. కాని తెలుగు నాయకుల ఐక్యత వల్ల ఓరుగల్లు మక్బూల్ వశము కాలేదు. అటు పిమ్మట మక్బూల్ గుజరాత్ మరియు సింధు దేశములలొ పెక్కు విజయములు సాధించెను. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారు లో వజీరు (ప్రధాన మంత్రి)గా నియమించబడెను. భాషాప్రాంతమతభేధములనధిగమించి ఢిల్లీ దర్బారునందు క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/287365" నుండి వెలికితీశారు