కుతుబ్ షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (5), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 53:
== స్థాపన ==
 
కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు '''[[సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్]], ''' [[16వ శతాబ్దము]] ప్రారంభములో కొందరు బంధువులు మరియు, స్నేహితులతో కలసి [[ఢిల్లీ]]కి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన [[దక్కన్ పీఠభూమి]]కి వచ్చి [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ సుల్తాన్]] [[మహమ్మద్ షా]] కొలువులో పనిచేసాడు. అతడు గోల్కొండను జయించి [[హైదరాబాద్]] రాజ్యానికి అధిపతి అయ్యెను. [[1518]]లో [[బహుమనీ సామ్రాజ్యము]] పతనమై ఐదు [[దక్కన్ సల్తనత్]] ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించాడు.
 
== పరిపాలన ==
 
ఈ వంశము [[తెలుగులు|తెలుగు వారిని]] పరిపాలించిన తొలి ముస్లిం వంశము. ఇది అంధ్ర దేశమును ముస్లింలు పరిపాలి‌చిన (తెలంగాణ ప్రాంతము) మరియు, హిందూ పరిపాలనలో ఉన్న ఇతర ప్రాంతములుగా విభజించింది. ఈ వంశము [[1687]]లో [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] చక్రవర్తి [[ఔరంగజేబు]] యొక్క సైన్యాలు [[దక్కన్]]ని జయించేవరకు, 171 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత [[1948]]లో [[హైదరాబాదు రాజ్యము]], [[న్యూఢిల్లీ]] యొక్క సైనిక జోక్యం (పోలీసు చర్య) తో [[భారత దేశము]]లో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది.
 
కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా మరియు, శాస్త్ర పోషకులు. వీరు [[పర్షియన్ సంస్కృతి]]ని పోషించడమే కాకుండా, ప్రాంతీయ [[దక్కన్]] సంస్కృతికి చిహ్నమైన [[తెలుగు భాష]] మరియు, కొత్తగా అభివృద్ధి చెందిన [[ఉర్దూ]] ([[దక్కనీ]]) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత [[హైదరాబాదు]] రాజ్యమునకు రాజధానులుగా ఉండేవి మరియు, ఉభయ నగరములును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు.
 
== వంశ క్రమము ==
పంక్తి 72:
# '''[[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]]''' ([[1612]]-[[1626]])
# '''[[అబ్దుల్లా కుతుబ్ షా]]''' ([[1626]]-[[1672]])
# '''[[అబుల్ హసన్ కుతుబ్ షా]]''' ([[1672]]-[[1687]])
 
== బయటి లింకులు ==
* [http://www.vepachedu.org/golconda.html కుతుబ్ షాహీల పరిపాలనలో తెలుగు సాహిత్యము మరియు, సంస్కృతి]
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/కుతుబ్_షాహీ_వంశం" నుండి వెలికితీశారు