బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి 117.241.6.170 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6400:FCA8:70E9:7DF6:E860:7BCE చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: దృవ → ధ్రువ, , → , (5)
పంక్తి 9:
బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలూ [[వ్యాసుడు|వ్యాస]] విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీ కృష్ణ నిర్యాణానాంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాధ్‌ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది.
 
[[స్కంద పురాణం]]లో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది ''స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు''. [[పద్మ పురాణం]]లో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుఠం గానూ భక్తులచే విశ్వసించ బడుతుంది. [[రామానుజాచార్యులు]], [[మధ్వాచార్యులు]] మరియు, [[వేదాంత దీక్షితులు]] ఇక్కడకు వచ్చి బద్రీనాధుని దర్శించుకుని [[ఉపనిషత్తులు|ఉపనిషత్తులకు]], [[బ్రహ్మ సూత్రాలు|బ్రహ్మ సూత్రాలకు]] భాష్యాలు వ్రాశారు.
 
==బద్రీనాథ్ గుడి==
పంక్తి 27:
 
==తీర్ధ యాత్ర ==
బద్రీనాథ్ [[చైనా]], [[టిబెట్]] సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌కు రెండు రోజుల ప్రయాణదూరంలో ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్ (నాలుగు సౌధములు) లలో ఇది మొదటిది. బద్రీనాథ్ పోయే దారిలో [[హేమకుండ్ సాహెబ్]] అనే సిక్కుల పవిత్ర క్షేత్రం మీదుగా పోవాలి. శీతాకాలంలో అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. బద్రీనాథ్, హేమకుండ్ కు వెళ్ళే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమ్మర్ధం అధికమై రద్దీగా ఉంటుంది. బద్రీనాధుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబరుల మధ్యకాలం. స్వెట్టర్లు మొదలైన చలిని తట్టుకొనే దుస్తుల అవసరం సంవత్సరమంతా ఉంటుంది. బద్రీనాథ్ మరియు, పరిసర పల్లెలను బస్సు మార్గంలో చేరవచ్చు. ఆదిశంకరాచార్యుడు ఉత్తరభారతంలో స్థాపించిన జ్యోతిమఠం బద్రీనాథ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో ఉన్న ఇతర పుక్ష్యక్షేత్రాలు [[హరిద్వార్]] మరియు, [[కేదార్‌నాధ్]].
==క్షేత్రమహిమ==
ఈ క్షేత్ర మహత్యం స్కందపురాణంలో శివుడు తనపుత్రుడైన కుమారస్వామికి వర్ణించాడు.ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని, త్రేతాయుగంలో యోగసిద్దిద అని, ద్వాపరంలో విశాల అని పేర్లు ఉండేవి.జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటినిజ్ఞానంవలన నశింపచేసే క్షేత్రంకనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం.ఇక్కడి రేగుచెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బద్రీక్షేత్రమని పిలువబడినదని క్షేత్రపురాణం వివరిస్తుంది.బద్రీక్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని శువుడు కుమారస్వామికి వివరించాడు.ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్ధాలు నిక్షిప్తమై ఉంటాయని స్కందపురాణం చెప్తుంది.ఇది విష్ణుక్షేత్రం విష్ణువు ఏక్షేత్రం విడిచినా ఈ క్షేత్రం విడువడని ప్రతీతి.ఈ క్షేత్రంలో అన్ని తీర్ధాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాశిలో అరవైవేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయదర్శన మాత్రంచే కలుగుతుందని పురాణకథనం.సమస్త దేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి.ద్వాపరయుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్దవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపసు చేయమని ఆదేసించడం వలన యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఉద్దవుడు రక్షింపబడ్డాడు.
పంక్తి 61:
 
=== విశేషాలు ===
విశే: స్వయం వ్యక్తక్షేత్రము. అష్టాక్షరీ మంత్రము అవతరించిన స్థలం. పూర్వం దీనిని విశాలపురి అనేవారు. ఇచట స్వామి అగ్నితప్త కుండముగా ఉన్నాడు. ముందుగా నారద కుండములో స్నానముచేసి పిమ్మట అగ్నికుండములో స్నానమాచరించవలెను. ఇచట పెరుమాళ్లు మాత్రమే దృవమూర్తిగాధ్రువమూర్తిగా ఉపస్థితమై ఉన్నాడు. మిగతావారు ఉత్సవమూర్తులు. ఈస్వామి ఎదుట తెరవేయరు. తిరుమంజనాదులన్నియు బహిరంగముగనే జరుగును. మంచు పడుట వలన తులమాసం పౌర్ణమినాడు (వెణ్ణకాప్పు) వెన్న సమర్పించి తలుపులు వేయుదురు. తిరిగి మేష మాసం పౌర్ణమినాడు తలుపులు తీయుదురు. సన్నిధికి వెనుకగల లక్ష్మీనృసింహ మందిరమున ఉడయవర్ వేదాంత దేశికన్ మొదలగువారికి సన్నిధులు ఉన్నాయి. ఈ క్షేత్రమున శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారిచే నిర్మింపబడిన సన్నిధి ఉంది. ఇక్కడకు 1 కి.మీ దూరములో బ్రహ్మకపాలము ఉంది. ఇక్కడకు 8 కి.మీ. దూరమున వసుదార ఉంది. ఇందు జలము పుణ్యులైన వారిమీదనే పడుతుందని ప్రతీతి.
 
=== మార్గం ===
పంక్తి 85:
 
==ప్రయాణ సదుపాయాలు==
అతి సమీపంలోని విమానాశ్రయం డెహరాడూన్‌లో ఉన్న [[డెహరాడూన్]] (317కిలో మీటర్లు), సమీపంలోని రైల్వే స్టేషను హరిద్వార్ రైల్వే స్టేషను (310కిలోమీటర్లు) [[రిషికేశ్]] రైల్వే స్టేషను (297) మరియు, [[కోట్‌ద్వార్]] రైల్వే స్టేషను (327 కిలో మీటర్లు). ప్రతి రోజు [[ఢిల్లీ]], హరిద్వార్ మరియు, ఋషికేశ్ లనుండి బస్సు సర్వీసులు (వసతులు) ఉంటాయి. రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి కనుక ప్రయాణీకులు జాగ్రత్త వహించడం మంచిది. ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం ఉత్తమం. కొంతకాలం క్రితం వరకు ఇక్కడకు ప్రయివేట్ వాహనాలు నిషిద్దం కానీ స్వంత వాహనాలలో ప్రస్తుతం గుడి పరిసరాల వరకు ప్రయాణం చేయవచ్చు .
 
==జనసంఖ్య==
"https://te.wikipedia.org/wiki/బద్రీనాథ్" నుండి వెలికితీశారు