ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: కు → కు , గా → గా , → (4), , → , (4)
పంక్తి 8:
|predecessor = [[ముహమ్మద్ హమీద్ అన్సారి]]
|term_start = [[ఆగస్టు 11|11 ఆగస్టు]] [[2017]]
|office1 = మాజీ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు మరియు, పట్టణాభివృద్ధి మంత్రి
|term_start1 = 26 మే 2014
|term_end1 = 17 జులై 2017
పంక్తి 26:
|signature =
}}
భారతదేశ 13వ [[ఉపరాష్ట్రపతి]]. [[ముహమ్మద్ హమీద్ అన్సారి]] తరువాత [[ఆగస్టు 11]], [[2017]] న ప్రమాణ స్వీకారం చేశారు.
 
==బాల్యం విద్యాభ్యాసం==
[[1948]], [[జూలై 1]] న [[నెల్లూరు]] జిల్లాలోని [[చవటపాలెం]] గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించిన వెంకయ్యనాయుడు నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల]] నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. విద్యార్థి జీవితం నుంచే వెంకయ్యనాయుడు సాధారణ ప్రజానీకపు సంక్షేమానికి పాటుపడ్డాడు.<ref>http://www.bjp.org/leader/July%200102a.htm</ref> ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాల కొరకు మరియు, రైతు కుటుంబాల కొరకు అతడు కృషిచేశాడు. రాజకీయ మరియు, సామాజిక కార్యకలాపాలలో కూడా అతనిలో అప్పుడే బీజాలు పడ్డాయి. స్వలాభం కొరకు కాకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుల మరియు, [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]]కి వ్యతిరేకంగా గళమెత్తిన నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకున్నాడు. [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపినాడు.
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 36:
==రాజకీయ జీవితం==
 
[[1973]]-[[1974|74]]లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. [[1977]] నుంచి [[1980]] వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదే సమయంలో [[1978]]లో తొలిసారిగా [[ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం]] నుంచి [[ఆంధ్ర ప్రదేశ్]] శాసనసభకు ఎన్నికైనాడు. [[1980]] నుంచి శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించాడు. [[1983]]లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై [[1985]] వరకు కొనసాగినాడు. [[1980]]లో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాడు. [[1985]]లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించబడి [[1988]] వరకు కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [[1993]]నుండి [[భారతీయ జనతా పార్టీ]] ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. [[1998]]లో [[రాజ్యసభ]]కు ఎన్నుకోబడినాడు. [[2000]]లో [[అటల్ బిహారీ వాజపేయి]] నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసాడు. [[2002]] [[జూలై 1]] నుంచి [[2004]], [[అక్టోబర్ 5]] వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షపదవిలో సేవలందించి [[మహారాష్ట్ర]] ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు.<ref>{{Cite web |url=http://www.wowtelugu.com/Telugupeople/Politicians/venkaiahnaidu.asp |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-06-24 |archive-url=https://web.archive.org/web/20080612010939/http://www.wowtelugu.com/Telugupeople/Politicians/venkaiahnaidu.asp |archive-date=2008-06-12 |url-status=dead }}</ref> [[2005]] [[ఏప్రిల్]]లో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించాడు. ప్రస్తుతం రాజకీయాలకు రాజీనామా చేసి [[ఉపరాష్ట్రపతి]] గా నామినేషన్ దాఖలు చేసాడు.
 
==ప్రమాదాలు==
రెండు సార్లు వెంకయ్యనాయుడికి తృటిలో పెద్ద ప్రమాదాలు తప్పాయి. [[2005]], [[జనవరి 29]]న [[బీహార్]] లోని [[గయ]] పర్యటనలో ఉండగా మావోయిస్టులు అతని [[హెలికాప్టర్]] కు నిప్పంటించారు. అప్పడు నాయుడు ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నాడు. వెంటనే తేరుకొని తప్పించుకున్నాడు. మరోసారి [[2007]], [[జూలై 15]]న [[ఉత్తర ప్రదేశ్]] లోని [[లక్నో]] విమానాశ్రయం సమీపంలో అతను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైడ్రాలిక్ బ్రేకులు విఫలం కావడంతో అత్యవసరంగా కిందికి దిగాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు.
 
==వ్యక్తిగత జీవితం==
[[1971]], [[ఏప్రిల్ 14]]న వెంకయ్య నాయుడు వివాహం చేసుకున్నాడు. భార్య పేరు ఉష. వారి సంతానం ఒక కుమారుడు మరియు, ఒక కుమార్తె ఉన్నారు. అతని కుమార్తె [[దీపా వెంకట్]] స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ.<ref>{{Cite news|url=https://www.deccanchronicle.com/nation/politics/180717/venkaiah-naidu-a-true-friend-of-telangana-andhra-pradesh.html|title=Venkaiah Naidu: A true friend of Telangana, Andhra Pradesh|date=2017-07-18|work=https://www.deccanchronicle.com/|access-date=2018-01-28}}</ref> ఆమె నెల్లూరు లోని అక్షర విద్యాలయకు కరెస్పాండెంట్ గా ఉన్నారు.
 
పరాయి బాషా కంటే మాతృబాషా బాగా గౌరవించే మనిషి. మాతృబాషా కళ్లు వంటిది అని అలాగే పరాయి బాషా కళ్లద్దాలు వంటిదని చెబుతుంటారు. కళ్ళు ఉంటేనే కళ్లద్దాలు వాళ్ళని అలాగే మాతృ బాషా వస్తేనె వేరే భాష నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం.