సాత్యకి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 4:
సాత్యకి [[కృష్ణుడు|కృష్ణుని]] భక్తుడు. ఇతను [[అర్జునుడు|అర్జునునితో]] కలసి [[ద్రోణుడు|ద్రోణుని]] వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను [[అర్జునుడు]] మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి [[సాత్యక]]. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[పాండవులు|పాండవులతో]] కలసి [[కౌరవులు|కౌరవులపై]] యుద్ధం చేసెను. [[కృష్ణుడు]] శాంతి రాయబారమునకు [[హస్తినాపురం]]నకు వచ్చునపుడు సాత్యకితో కలసి వచ్చెను.
 
సాత్యకి మరియు, [[కృతవర్మ]]లు [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పోరాడిన [[యాదవ]] వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి [[పాండవులు|పాండవుల]] వైపు, [[కృతవర్మ]] [[కౌరవులు|కౌరవుల]] వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి [[ద్రోణుడు|ద్రోణుని]] విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న [[భూరిశ్రవుడు|భూరిశ్రవునితో]] యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. [[భూరిశ్రవుడు]] సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునునితో]] జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. [[భూరిశ్రవుడు]] సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో [[అర్జునుడు]] తన బాణంతో [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
 
[[భూరిశ్రవుడు]] ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని [[అర్జునుడు|అర్జునుని]] నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని [[అర్జునుడు]] ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
పంక్తి 10:
అంతట [[భూరిశ్రవుడు]] ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని [[ధ్యానం]] చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] తల ఖండింస్తాడు.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో సాత్యకి, [[కృతవర్మ]] ఇద్దరూ బ్రతికారు. [[కృతవర్మ]] [[కృపాచార్యుడు]] మరియు, [[అశ్వద్దామ]]లతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు రాత్రి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని [[కృతవర్మ]]ని, [[కృతవర్మ]] నిరాయుధుడైన [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, [[కృతవర్మ]], మిగిలిన [[యాదవ వంశం]] మొత్తం [[గాంధారి శాపం]] మూలంగా నాశనం అయింది.
 
{{మహాభారతం}}
"https://te.wikipedia.org/wiki/సాత్యకి" నుండి వెలికితీశారు