"జంద్యాల పూర్ణిమ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
ట్యాగు: 2017 source edit
 
బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.
 
===ఉపాకర్మ-వేదవ్రత చతుష్టయము===
 
ప్రతీ సంవత్సరము శ్రావణ పౌర్ణమి రోజున నాలుగు వేదశాఖలవారు ఉపాకర్మ అనువేద వ్రాతమును ఆరంభించవలయును:
1) ప్రాజాసత్య వ్రతము
2) సౌమ్య వ్రతము
3) ఆగ్నేయ వ్రతము
4) వైశ్వదేవ వ్రతము
 
వీనినే '''వేదవ్రత చతుష్టయము''' అని అందురు. ఆ నాలుగు వ్రతములు, వీనికి ఉత్సర్జనములు చేయవలయును. ఉపనయనము అయిన వటువు గురుకులమునందు వేదము నేర్చుకొను కాలమునందీ వ్రతములు చేయవలెను. ఒక్కొక్క వ్రతము ఒక్కొక్క సంవత్సరమునందు చేయవలెను. ఒక సంవత్సరము వ్రతము, మరొక సంవత్సరము నందు ఉత్సర్జనము చేయవలెను. ఈ విధముగ 4 వ్రతములు, 4 ఉత్సర్జనములు పూర్తియగు సరికి 8 సంవత్సరములు పూర్తి యగును. ఈ 8 సం.లలో గురుకులమునందు గోదానమును వేద సంస్కారము జరుపుకొనవలెను. అనగా '''గర్భాష్టమేషు బ్రాహ్మణాముపనయాత'''- 8 సంవత్సరము నందు ఉపనయనము జరిగిన, 8 సంవత్సరములు గురుకులమునందు ఉండుటతో 16 సం.లు పూర్తిఅగునని భావము.యజుర్వేదము నందు ప్రాజాపత్యకాండము, సౌమ్యకాండము, ఆగ్నేయ కాండము, వైశ్వదేవ కాండము అను 4 కాండములు కలవు. కాండ ప్రమణములు ప్రస్తుతము తెలియుటలేదు. శ్రావణమాసమునందు పూర్ణిమ దినమున శ్రవణా నక్షత్రముండును. ఆ దినమున పగటికాలమునందు ఉపాకర్మ చేయవలెను. శ్రావణ శుద్ధ పంచమి దినమున హస్తా నక్షత్రమునందును చేయవచ్చును. ఔపాననాగ్నియందు అధ్యాయోపా కర్మ చేయవలెనని శౌనకుడు చెప్పినాడు.
 
ఈ విధమగు యుక్తాయుక్త కాలనిర్ణయము చూచుకొని వేదప్రతిపాదితమగు ఉపాకర్మాది సంస్కారముల నాచరించవలసియున్నది. ఈ సంస్కారము ముఖ్యముగా వేదము నేర్హ్చుకొను విద్యార్ధుల కొరకు నిర్దేశించబడినది. అపౌరుషములు, దైవదత్తములునగు వేదశాస్త్రములను నేర్చుకొనుటకు, తగుశక్తి, తేజస్సు, గ్రహణశక్తి, ఆత్మజ్ఞానము స్పష్టమగు శబ్దోచ్చారణ, శ్రావ్యమగు ధ్వనిని కలిగి వేదవిద్యను ఆసాంతము నేర్చుకొనుటకు వేదమంత్రములచే చేయబడు సంస్కారమిది.
 
అందుకనే శ్రావణ పౌర్ణమి భారత దేశమందు ముఖ్యపర్వదినముగా చెప్పబడుచున్నది.
 
== మూలాలు==
{{మూలాలజాబితా}}
*[https://www.facebook.com/ManaTelugu/posts/637654359599158 శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి,రాఖీ పౌర్ణమి]
 
* 1978 భారతి మాస పత్రకి- వేదవ్రత చతుష్టయము వ్యాసకర్త శ్రీ శివకోట సత్యనారాయణమూర్తి.
 
[[వర్గం:హిందువుల పండుగలు]]
660

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2875100" నుండి వెలికితీశారు