కడవెండి: కూర్పుల మధ్య తేడాలు

కడవెండి కన్న బిడ్డ దొడ్డి కొమురయ్య
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 154:
# [[దొడ్డి కొమురయ్య]]: తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు.<ref name="విప్లవోద్యమ జ్వాల దొడ్డి కొమరయ్య">{{cite news|last1=నవతెలంగాణ|title=విప్లవోద్యమ జ్వాల దొడ్డి కొమరయ్య|url=http://m.navatelangana.com/article/net-vyaasam/50987|accessdate= 29 January 2020}}</ref>
 
==కడవెండి చరిత్రకు సజీవ సాక్షం దొడ్డి కొమురయ్య -==
==మూలాలు==
{{విలీనము అక్కడ|దొడ్డి కొమురయ్య}}
{{మూలాలజాబితా}}
 
==కడవెండి చరిత్రకు సజీవ సాక్షం దొడ్డి కొమురయ్య -==
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం! చరిత్రను రక్తాక్షరాలతో లిఖించిన అపూర్వ ఘట్టం. పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి, పిడికెడు భక్తి కోసం.. అంతిమంగా ఆత్మగౌరవం కోసం రైతుకూలీ జనం తిరగబడిన అద్భుత సందర్భం.. ఆ ఉక్కు సంకల్పంలో ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి పోరాడితన వీరులు, వీరవనితలూ ఎందరో. ఆ ఉద్యమంలో నేలకొరిగిన తొలి యోధుడు దొడ్డి కొమురయ్యా. పోరాటకారులకు నిత్యం స్ఫూర్తినిస్తున్న ఆ తొలి అమరుడి వర్ధంతి ఈ రోజే. 1946లో ఇదే రోజున నేలకొరిన ఆ రైతాంగ వీరుడి జీవితరేఖలను మరోసారి గుర్తుచేసుకుందాం..
 
Line 166 ⟶ 164:
దొర విసునూరు దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి, అతని తల్లి జానకమ్మల అకృత్యాలకు వ్యతిరేకంగా యువత పలు సంఘాలను ఏర్పాటు చేసుకుంది. గుత్పల సంఘం, వడిసెల సంఘం, కారంపోడి సంఘాల కింద జనం జమయ్యారు. కడివెండి గ్రామంలో జులై 4,1946న దేశ్‌ముఖ్ తొత్తులకు, రజాకార్లకు వ్యతిరేకంగా గుత్పల సంఘం తిరుగుబాటు లేవదీసింది. దొడ్డి కొమురయ్య నాయకత్వంలో ముందుకు ఉరికింది. ఊరేగింపు గడి కాడికి ర్యాలీ రాగానే రజాకార్లు, దొర బంట్లు గడి లోపలి నుంచి జనంపైకి కాల్పులు జరిపారు.
 
ముందు వరుసలో ఉన్న కొమురయ్య కడుపులోకి తూటా దూసుకెళ్లింది. ఆ యువ నాయకుడు అక్కడికక్కడే కన్నమూశాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా చరిత్రపుటల్లోకి ఎక్కాడు. అప్పటికి అతనికి నిండా ఇరవయ్యేళ్లు కూడా లేవు. అసలే ఆగ్రహంతో ఉన్న జనం నిప్పు కణికల్లా మండిపోయారు. కొమురయ్య త్యాగం వాళ్లకు స్ఫూర్తినిచ్చింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చుట్టుపక్కల నుంచీ జనం కెరటాల్లా వెల్లువెత్తారు. ఫలితంగా గడీ నేలమట్టమైంది. కొమురయ్య త్యాగంతో మొదలైన పోరాటం హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఆంధ్రమహా సభ కమ్యునిస్టు పార్టీగా అవతరించింది. ఎందరో నేతలు రైతులతో భుజం భుజం కలిపి తుపాకులు ఎక్కుపెట్టారు. ‘దున్నే వాడిదే భూమి’ నినాదం మార్మోగింది. భూస్వామ్య వ్యవస్థలోని సమస్త అవలక్షణాలపై దాడి జరిగింది. రైతు సంఘాలు గ్రామాల్లో ఎర్రజెండాలు పాతారు. లక్షల ఎకరాల భూమి లేని పేదలకు పంచాయి. దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక. {{దేవరుప్పుల మండలంలోని గ్రామాలు}}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
{{దేవరుప్పుల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కడవెండి" నుండి వెలికితీశారు