శరభ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== కథా నేపథ్యం ==
శరభ (ఆకాష్‌ కుమార్‌) సిరిగిరిపురంలో సరదాగా కాలం వెల్లదీసే అల్లరి కుర్రాడు. కొడుకే ప్రాణంగా బతికే పార్వతమ్మ (జయప్రధ) ఎన్ని తప్పులు చేసినా శరభను ఒక్క మాట కూడా అనదు. దివ్య (మిస్తీ చక్రవర్తి) సెంట్రల్‌ మినిస్టర్(షియాజీ షిండే) కూతురు. తన జాతక దోశాలకు సంబంధించిన శాంతి కోసం మినిస్టర్‌ తన కూతురిని సిరిగిరిపురంలోని గురువు (పొన్‌వన్నన్‌) గారి దగ్గర విడిపెట్టి వెళతాడు. గురువుగారు దివ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను శరభ, పార్వతమ్మలకు అప్పగిస్తాడు. చిన్న గొడవతో ప్రారంభమైన దివ్య, శరభల పరిచయం తరువాత ప్రేమగా మారుతుంది. అదే సమయంలో దివ్య ప్రమాదంలో ఉందని తెలుస్తోంది. 17 మంది అమ్మాయిలను బలి ఇచ్చిన ఓ రాక్షసుడు 18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే సమయంలో శరభ గతానికి సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. అసలు శరభ గతం ఏంటి..? ఆ రాక్షసుడు దివ్యను ఎందుకు బలి ఇవ్వాలనుకున్నాడు..? రాక్షసుడితో శరభ చేసే పోరాటంలో దైవ శక్తి ఎలా సహాయపడింది..? అన్నదే మిగతా కథ.<ref>https://www.sakshi.com/news/movies/sarabha-telugu-movie-review-1137423</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/శరభ_(సినిమా)" నుండి వెలికితీశారు