పంచె: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: ె → ే , , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
'''పంచె''' భారతదేశంలో కొన్ని రాష్ట్రాలతో బాటు [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]]లో [[పురుషులు]] (కొన్ని ప్రాంతాల్లో [[స్త్రీ]]లు కూడా) ధరించే [[సాంప్రదాయ వాదం|సాంప్రదాయ]]<nowiki/>క వస్త్రము. కుట్టకుండా, దీర్ఘ చతురస్రాకారంలో సాధారణంగా 4.5 మీటర్లు (15 ఆడుగుల) పొడవు ఉండే ఈ వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టి ముడి వేయటం వలన ఒక పొడవు స్కర్టు వలె ఉంటుంది.
 
భారతదేశంలో [[తమిళనాడు]], [[కేరళ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[బీహార్]], [[మధ్యప్రదేశ్]], [[పశ్చిమ బెంగాల్]] మరియు, [[ఒడిషా]] లలో పంచె విరివిగా ధరించబడుతుంది. ఉత్తర [[గుజరాత్]], దక్షిణ [[రాజస్థాన్]] లలో కేడియా అనే ఒక పొట్టి [[కుర్తా]]తో బాటు ధరిస్తారు. భారతదేశం సర్వత్రా ప్రత్యేకించి [[బీహార్]], [[పశ్చిమ బెంగాల్]] మరియు, [[శ్రీలంక]] లలో పంచెను కుర్తాతో ధరిస్తారు. వీటిని ధోవతి-కుర్తా అని సంబోధిస్తారు. [[తమిళనాడు]]లో సట్టై ([[చొక్కా]]) తో బాటు, [[ఆంధ్ర ప్రదేశ్]]లో చొక్కా లేదా కుర్తా (జుబ్బా) తో ధరిస్తారు. [[పాకిస్థాన్]], [[పంజాబ్]] లలో కూడా ధోతీలు సాంప్రదాయిక దుస్తులుగా ధరించబడతాయి. [[లుంగీ]] అనే మరో వస్త్రం కూడా [[ఆసియా]] మరియు, [[ఆఫ్రికా]] లలో విరివిగా ధరించబడుతుంది.
 
దీనిని కుర్తా, [[కండువా]], [[తలపాగా]]తో కలిపి ధరించడం [[తెలుగు]]<nowiki/>వారి స్వచ్ఛమైన వస్త్రధారణ.
 
==భారతదేశంలో వివిధ పేర్లు==
సంస్కృత పదం ధౌత నుండి ధోతి వ్యుత్పత్తి అయినది. దీనిని [[ఒడిశా]], [[హిందీ]] లలో ''ధోతి'' అని, [[గుజరాతీ]]లో ధోతియు అని, [[బెంగాలీ]]లో ధుతి అని [[అస్సామీ]]లో ''సురియా'' అని, [[పంజాబీ]]లో ''లాచా'' అని, [[మళయాళం]]లో ''ముండు'' అని, [[కొంకణ్]]లో ధోతార్, అంగోస్తర్, ఆడ్-నెశ్చె, లేదా పుడ్వెపుడ్వే అని, [[మరాఠీ]]లో ''ధోతార్'' లేదా పంచె అని, [[కన్నడం]]లో కూడా ''పంచె'' అని పిలుస్తారు, [[పంజాబీ]]లో లాచా అని, [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], తేరై ల నగరాలలో మర్దానీ అనీ, తమిళంలో వేట్టి లేదా వేష్టి అనీ పిలుస్తారు.
 
ఇవి సుమారు 7 గజాలు పొడవు ఉండి, నడుం, కాళ్ల చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.
 
==వాడుక మరియు, సంప్రదాయం==
యావత్ భారతదేశంలో పంచెని సాంప్రదాయిక వస్త్రంగానే పరిగణిస్తారు. ప్రభుత్వ మరియు, సాంప్రదాయిక కుటుంబ ఉత్సవాలలోనే కాకుండా గ్రామ సంఘాల (కంట్రీ క్లబ్బు) లలో సాంప్రదాయిక వస్త్రాలని కచ్చితంగా అమలు చేసే వ్యవస్థాపనలలో కూడా పంచెలు ఆమోద యోగ్యాలు. ఉపఖండంతో బాటు బంగ్లాదేశ్, శ్రీలంక, [[మాల్దీవులు|మాల్దీవుల]]లో కూడా ఇదే వర్తిస్తుంది. ఈ దేశాలలోని రాజకీయవేత్తలు, ప్రముఖులు పంచెలనే ధరించటం పై మొగ్గు చూపటంతో ఈ వస్త్రం సంస్కృతి, సంప్రదాయాల్ని పాటించేవారికి చిహ్నంగా రూపుదిద్దుకొన్నది. సూటు-టైలు (పెళ్ళి, విందు ల వంటి) ప్రత్యేక సందర్భాలలో, రోజు వారీ ఉద్యోగాలకు షర్టు-ప్యాంటులు వేసుకొన్ననూ, సంప్రదాయాన్ని అనుసరించే వారిలో మాత్రం పంచెదే పై చేయి.
 
[[దక్షిణ భారతదేశం]]లో పంచె అన్ని సాంస్కృతిక, సాంప్రదాయిక వేడుకలు, ఆచారాలలో ధరించబడుతుంది. వివాహ వేడుకల్లో వరుడు, ఇతర ఆచారలను నిర్వహించే ముఖ్య వ్యక్తి/వ్యక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొనే సమయాలలో పంచెలు తప్పనిసరి.
పంక్తి 28:
మొరటుగా ఉంటుందని, ఫ్యాషన్ కాదని, యువతకి నప్పదని ఒక శతాబ్దం పైగా యువకులు పాశ్చాత్య దుస్తుల వైపు మొగ్గిననూ గ్రామాలలో పెద్దరికాన్ని, హుందాతనాన్ని ఇనుమడింపజేసేది పంచే!
 
===వివిధ శైలులు మరియు, రకాలు===
సంస్కృతంలో పంచ అనగా ఐదు. బహుశ: ఐదు ఆడుగుల పొడవు ఉన్న వస్త్రం అని కాబోలు దీనికి ఈ పేరు వచ్చింది. '''ధువతి''' అన్న సంస్కృత పదానికి ధోవతి అనే పదానికి సంబంధం ఉండవచ్చును. ఒక రకమైన దక్షిణ భారత పంచెకట్టులో ఐదు ముళ్ళు వేయవలసిన అవసరం ఉన్నది, ఇది కూడా కారణం అయి ఉండవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు