ధన్‌బాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (30), typos fixed: , → , (30)
పంక్తి 22:
[[జార్ఖండ్]] రాష్ట్ర 24 జిల్లాలలో '''ధన్‌బాద్ జిల్లా''' ఒకటి. ధన్‌బాద్ పట్టణం జిల్లకేంద్రంగా ఉంది. [[2011]] గణాంకాలు రాష్ట్రంలో ధన్‌బాద్ జిల్లా జనసంఖ్యాపరంగా రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది. మొదటి స్థానంలో [[రాంచి]] జిల్లా ఉంది. .<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate =30 September 2011 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> ధన్‌బాద్ జిల్లా [[భారతదేశం]] బొగ్గు రాజధానిగా గుర్తించబడుతుంది.
==చరిత్ర==
మునుపటి మంభుం జిల్లాలోని [[1956]]లో పాత ధన్‌బాద్ ఉపవిభాగం, సాదర్ ఉపవిభాగానికి చెందిన చాస్ మరియు, చందంకియారీ పోలీస్ స్టేషన్లు భూభాగం కలిపి ధన్‌బాద్ జిల్లా రూపొందించబడింది. ధన్‌బాద్ పోలీస్ జిల్లా [[1928]] నుండి ఉంది. [[1971]]లో బిహార్ రాష్ట్ర జిల్లాల పునర్నిర్మాణం ధన్‌బాద్‌ను ప్రభావితం చేయలేదు. ధన్‌బాద్ పురపాలకం జిల్లాలో ప్రధాన పట్టణం మరియు, జిల్లాకేంద్రంగా ఉంది. [[1991]]లో ధన్‌బాద్ జిల్లాలోని చాస్ ఉపవిభాగం మరియు, [[గిరిడి]] జిల్లాలోని బెర్మొ ఉపవిభాగం కలిపి [[బొకారో]] జిల్లాగా రూపొందించారు.
=== పురాతన చరిత్ర ===
చోటా నాగపూర్ మైదానం లోని ప్రధాన భాగంగా ఉన్న ధన్‌బాద్ గురించి పురాతన ఆధారాలు ఏవీలేవు. తరువాత కాలం గురించిన వివరాలు కూడా మర్మంగానే ఉండిపోయింది.
పంక్తి 29:
[[1964]] ధన్‌బాద్ జిల్లా గజటీర్ [[1928]] ఒప్పందపు దస్తావేజులను తిరిగి రూపొందించారు. ఇందులో మంభుం గురించిన పూర్తి వివరాలు లభిస్తున్నాయి. మునుపటి మంభుం జిల్లాలో ధన్‌బాద్
చిన్న కుగ్రామంగా ఉండేది. మంభుం జిల్లాకు [[పురూలియా]] (ప్రస్తుతం [[పశ్చిమ బెంగాల్]]లో భాగంగా ఉంది) కేంద్రంగా ఉండేది. మంభుం ప్రాంతాన్నిరాజా మాన్‌సింగ్‌కు బహుమాంగా ఇచ్చాడు. మాన్‌సింగ్‌ [[అక్బర్]] యుద్ధంలో విజయం సాధించడానికి సహకరించినందుకు బదులుగా ఈ ప్రాంతం బహూకరించబడింది. మాన్‌సింగ్‌ పేరు మీద ఈ ప్రాంతానికి మంభుం అనే పేరు వచ్చింది.
అత్యంత పెద్ద ప్రాంతంగా ఉన్న మంభుం జిల్లా పాలనాసౌలభ్యం కొరకు [[బిర్బం]], మంభుం మరియు, సింగ్భుం జిల్లాలుగా విభజించబడింది. [[1956]] అక్టోబరు 24 న ధన్‌బాద్ జిల్లాగా ప్రకటించబడింది. భౌగోళికంగా ధన్‌బాద్ ఉత్తర దక్షిణాలుగా 43 మైళ్ళు మరియు, తూర్పు పడమరలుగా 47 మైళ్ళు విస్తరించి ఉంది. [[1991]]లో ధన్‌బాద్ జిల్లా నుండి [[బొకారో]] జిల్లాను వేరుచేసిన తరువాత జిల్లా వైశాల్యం 2995 చ.కి.మీ ఉంటుంది.
=== మొదటి విభజన ===
ఆరంభంలో ఈ జిల్లా 2 ఉప విభాగాలుగా (ధన్‌బాద్ సాదర్ మరియు, బఘ్మర ) విభజించబడింది.
జిల్లా 6 బ్లాకులుగా విభజించబడింది. తరువాత 4 బ్లాకులుగా మార్చబడి 30 నగర పాలికలు, 228 గ్రామపంచాయితీలు మరియు, 1654 గ్రామాలుగా ఉప విభజన చేయబడ్డాయి.
తరువాత విశాలమైన జిల్లా భూభాగంలో 2 పోలీస్ ప్రధానకార్యాలయ భూభాగాలుగా ([[బొకారో]] మరియు, [[ధన్‌బాద్]]) విభజించబడింది. తరువాత జిల్లా ప్రస్తుత స్థితికి మారింది. జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం (ధన్‌బాద్ సాదర్) మాత్రమే ఉంది.
* ప్రస్తుతం జిల్లా 8 బ్లాకులుగా విభజించబడింది : ఝరియా, ధన్‌బాద్, నిర్స, గోవింద్పూర్, బలియపూర్, తుండి మరియు, టాప్‌చంచి. బ్లాకులు 181 గ్రామపంచాయితీలు మరియు, 1348 గ్రామాలుగా విభజించబడింది. [[1991]] గణాంకాలు జిల్లా జనసంఖ్య 19,49,526. వీరిలో పురుషులు 10,71,913 స్త్రీలు 8,77,613 ఉన్నాయి. జిల్లాలో 100850 కొండ గుట్టలు మరియు, 56454 ఎకరాల అరణ్యాలు ఉన్నాయి. జిల్లా భూభాగం సముద్రమట్టానికి 500-1000 అడుగుల ఎత్తున ఉంది. భూమిలో చిన్నవి పెద్దవిగా కంకరరాళ్ళు నిండి ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కారిడార్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 11 December 2009 |accessdate=17 September 2011}}</ref>
 
==భౌగోళికం==
జిల్లా పశ్చిమ సరిహద్దులో [[గిరిడి]] మరియు, ఉత్తర సరిహద్దులో [[బొకారో]], తూర్పు సరిహద్దులో [[దుమ్కా]] మరియు, [[గిరిడి]] మరియు, దక్షిణ సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రానికి చెందిన [[పురూలియా]] జిల్లాలు ఉన్నాయి. జిల్లా 23°37'3" ఉ మరియు, 24°4' ఉ అక్షాంశం మరియు, 86°6'30" తూ మరియు, 86°50' తూ రేఖాంశంలో ఉంది.
 
===సహజ విభాగాలు===
భౌగోళికంగా ధన్‌బాద్ జిల్లా 3 భాగాలుగా విభజించబడింది. ఉత్తర మరియు, వాయవ్య భూభాలు పర్వత భూభాగం. ఎగువభూములు ఇందులో బొగ్గుగనులు మరియు, అధికంగా పరిశ్రమలు ఉన్నాయి. దామోదర్ నదికి దక్షిణంగా మిగిలిన ఎగువ భూములు మరియు, మైదానాలు వ్యవసాయ భూములుగా ఉన్నాయి. ఉత్తర మరియు, వాయవ్య భూభాగాన్ని పూర్తిగా గ్రాండ్ ట్రంక్ రోడ్డు
విభజించింది. జిల్లా పశిమ భూభాగంలో ధంగి కొండలు ఉన్నాయి. ఇవి గ్రాండ్ ట్రంక్ రోడ్డు మరియు, తూర్పు రైలు మార్గం మద్యలో విస్తరించి ఉన్నాయి. ఈ కొండలు ప్రధాన్‌కంట నుండి గోవింద్‌పూర్ వరకూ విస్తరించి ధంగివద్ద క్రమంగా 1256 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఉత్తరంలో ప్రశాంత్ కొండలు తూప్చంచి మరియు, తుండి వరకు విస్తరించి లఖి వద్ద క్రమాంగా 1,500 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. జిల్లా దక్షిణ భూభాగం అధికంగా ఎగుడుదిగుడు భూమిగా ఉంది. ఇది పడమర నుండి తూర్పుకు విస్తరించి 2 ప్రధాన నదులు దామోదర్ మరియు, బరకర్‌తో ముగుస్తుంది.
 
===నదులు ===
చోటానాగ్పూర్ మైదానంలో ప్రధానమైన నది దామోదర్. [[పాలము]] జిల్లాలో జన్మించిన దామోదర్ నది తూర్పుగా ప్రవహించి [[రాంచి]] మరియు, [[హజారీబాగ్]] మైదానాల గుండా ప్రవహిస్తూ
బొకారో కోనార్ మరియు, బర్కర్ ఉపనదులను తనలో కలుపుకుంటుంది. తరువాత దామోదర్ నది ధన్‌బాద్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత ఈ నదిలో జమూరియా (ధన్‌బాద్ పశ్చిమ సరిహద్దులో ఉంది) కలుస్తుంది. తరువాత మరి కొంత తూర్పుగా ప్రవహించి కార్తి నదిని తనలో కలుపుకుని ప్రశాంత్ పర్వత పాదాలను తాకుతూ కోయల్ ఫీల్డులో ప్రవహిస్తుంది. దామోదర్ నది జిల్లా గుండా 77 కి.మీ దూరం ప్రవహిస్తుంది. దామోదర్ నదిమీద నిర్మించబడిన పంచెత్ ఆనకట్ట దాదాపు 6 కి.మీ పొడవుంటుంది. ఇక్కడ నిర్మించబడిన హైడల్ స్టేషను 40,000 కి.వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
 
జిల్లాకు బర్కర్ నది జిల్లాకు పశ్చిమ సరిహద్దుగా ఉంది. ఇది 77 కి.మీ దూరం ప్రవహించి జిల్లాకు ఆగ్నేయ దిశలో ప్రవహిస్తూ క్రమంగా దక్షిణ దిశకు చేరి చిర్కుడా వద్ద దామోదర్ నదితో కలుస్తుంది. ఈ నది దామోదర్ నదితో సంగమించే 13 కి.మీ ముందు మైతన్ ఆనకట్ట నిర్మించబడింది. ఇక్కడ నిర్మించబడిన మైతాన్ పవర్ స్టేషను 60,000 కి.వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
* జిల్లాలో ప్రవహిస్తున్న ఇతరనదులలో గోబై, ఇర్జి, ఖుడియా మరియు, కర్తి గురినతగినవి.
 
== వాతావరణం ==
పంక్తి 128:
 
=== భాషలు ===
ధన్‌బాద్ జిల్లాలో పలు సాంస్కృతిక సంప్రదాయాలకు చెందిన ప్రజలు మిశ్రితమై ఉన్నారు. జిల్లాలో బెంగాలీలు, బిహారీలు మరియు, గిరిజనులు అధికంగా జీవిస్తున్నారు. బెంగాలీ ప్రజలు మరాఠీ మిశ్రిత బెంగాలీని మరియు, ఖొర్తా భాషలను మాట్లాడుతుంటారు. జిల్లాలో గుజరాయీ, పంజాబీలు, తమిళులు, మలయాళీలు, తెలుగు వారు మరియు, రాజస్థానిక్ మార్వారీ ప్రజలు నివసిస్తున్నారు.
అందుకే ధన్‌బాద్ సాంస్కృతిక సంగమ ప్రాంతంగా గుర్తించబడుతుంది. ఈ కారణంగా జిల్లాలో పలుభాషలు వాడుకలో ఉన్నాయి.
 
పంక్తి 149:
|Northwest = [[గిరిడి]] జిల్లా
}}
 
 
 
{{coord|23|47|24|N|86|25|48|E|region:IN-JH_type:adm2nd_source:kolossus-nowiki|display=title}}
"https://te.wikipedia.org/wiki/ధన్‌బాద్_జిల్లా" నుండి వెలికితీశారు