వేటూరి ప్రభాకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 34:
| portaldisp =
}}
'''[[వేటూరి ప్రభాకరశాస్త్రి]]''', ([[ఫిబ్రవరి 7]], [[1888]] - [[ఆగష్టు 29]], [[1950]]) [[తెలుగు]] కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, [[రచయిత]], విమర్శకుడు, రేడియో [[నాటక రచయిత]] మరియు, తెలుగు, సంస్కృత పండితుడు.<ref>తెలుగు వైతాళికులు రెండవ భాగములో వేటూరి ప్రభాకరశాస్త్రిపై ఎన్.సచ్చిదానందం రాసిన వ్యాసం (పేజి.87-104) (ఆంధ్ర ప్రదేశ సాహిత్య అకాడమీ ప్రచురణ.1977)</ref> చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము ''నాగబు'' అని కనుగొన్నది ఈయనే. సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వంటి వ్యక్తి ప్రపంచ సాహితీ చరిత్రకు ప్రకాశము వంటి వారు. ఆయన వట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి [[అక్షరాలు]] మోసిన కూలీ! ఆయన వట్టి [[రచయిత]] కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు. ఈయన తెలుగుభారతీ సంతానములో చిరస్మరణీయులు, తెలుగువారికి ప్రాతఃస్మరణీయులు.
 
==జీవిత విశేషాలు==
ప్రభాకరశాస్త్రి, [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలములో [[కృష్ణా నది]] తీరమున ఉన్న [[పెదకళ్ళేపల్లి]]లో శ్రీవత్స గోత్రజులైన వేటూరి సుందరశాస్త్రి, శేషమ్మలకు మూడవ సంతానముగా [[1888]], [[ఫిబ్రవరి 7]] న అనగా సర్వజిత్ మాఖ బహుళ ఏకాదశి మంగళ వారం ఉదయం జేష్టా నక్షత్రం మిథున లగ్నమున జన్మించారు. ఈయనకు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు. తండ్రి సుందరశాస్త్రి [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] వైద్యుడు. ప్రభాకరశాస్త్రి ప్రాథమిక విద్య స్వగ్రామములోనే సాగినది, తండ్రి వద్ద, మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములను నేర్చుకొన్నారు. ఉపనయనమైన తర్వాత ప్రభాకరశాస్త్రిని ఆయన తండ్రి శాస్త్రాలు అభ్యసించడానికి [[చల్లపల్లి]]లోని అద్దేపల్లి సోమనాథశాస్త్రి వద్ద చేర్పించాడు.
 
16 యేళ్ల వయసులో, [[చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి]] [[బందరు]] ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిసి కొందరు సహాధ్యాయులతో కలిసి అక్కడ చేరాడు. బందర్లో విద్యాభ్యాసము చేస్తున్న కాలములో ఈయన [[కొండా వెంకటప్పయ్య]] మరియు, వల్లూరి సూర్యనారాయణరావుల ఇంట నివసించాడు. తెలుగులో తనకు తెలిసినదంతా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రితో ముఖతః వినోదగోష్ఠిలో విని నేర్చుకున్నదేనని ఆ తరువాత ప్రభాకరశాస్త్రి చెప్పుకున్నాడు.
 
ఆ తరువాత తన 19వ యేట [[మద్రాసు]] చేరి వెస్లీ మిషన్ హైస్కూలులో తెలుగు పండితునిగా రెండేళ్ళు పనిచేశాడు. ఆ సమయములో మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలకు వెళ్ళి అక్కడి గ్రంథాలను చదువుతుండేవాడు.