యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (11), typos fixed: ె → ే (15), , → , (10)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 3:
[[File:Yaksha2.jpg|thumb|right|200px|దక్షిణదిక్కు/తెట్టు వేషధారణ]]
 
'''యక్షగానం''' ([[కన్నడ భాష|కన్నడ]]:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత<ref name=eb>{{cite web|url=http://www.britannica.com/eb/article-9077732/yaksha|title=yaksha|publisher=Encyclopædia Britannica|accessdate=2007-09-06}}</ref>. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ <ref>http://www.yakshagana.com/</ref>. కరావళి జిల్లాలైన [[ఉత్తర కన్నడ]], [[దక్షిణ కన్నడ]], [[ఉడుపి]] జిల్లాలలోనూ [[శివమొగ్గ]], కేరళ లోని [[కాసరగోడు]] జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు<ref>{{cite web |url= http://kasargod.nic.in/profile/yakshagana.htm|title= YAKSHAGANA|website= |access-date= 2013-05-18|archive-url= https://web.archive.org/web/20130530225428/http://kasargod.nic.in/profile/yakshagana.htm|archive-date= 2013-05-30|url-status= dead}}</ref>.
యక్షగాన ప్రదర్శన సాయంత్రం వేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు, తలపై సవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కువగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా, వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుగుణంగా నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది.
ఎన్నో యేళ్ళుగా కేలికె, ఆట, బయలాట, దశావతార మొదలగు వివిధ పేర్లతో ప్రదర్శించబడే ఈ కళకు 200 యేళ్ళ క్రితం యక్షగానమనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. భక్తి ఉద్యమం జరిగే సమయంలో ఉన్న శాస్త్రీయ సంగీతం ఇంకా నాటక కళ యక్షగానంగా పరిణితి చెందాయన్నది ఒక నమ్మిక<ref name="preclassical">Prof. Sridhara Uppura. 1998. Yakshagana and Nataka Diganta publications</ref>. గత కొద్ది కాలంగా బెంగుళూరులో యక్షగానం బాగా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వానాకాలంలో-ఇదే సమయంలో కోస్తా ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి. యక్షగానం వ్యుత్పత్తి ప్రకారం ఒక యక్షుడి పాట(గానం). ఇక్కడ యక్షుడంటే ప్రాచీన భారతదేశంలో నివసించే అడివిజాతి మనిషి అని అర్థం వస్తుంది. యక్షగానంలో నేపథ్యంలో హిమ్మెళ(హిందె+మేళ) నేపథ్య సంగీత సమూహం ఇంకా ముమ్మెళ(ముందె+మేళ) నృత్య, సంభాషణ గుంపు ఉంటాయి. ఈ రెండు గుంపుల సమన్వయమే యక్షగానం. హిమ్మెళలో ఒక భాగవత గాయకుడు(ఇతనే దర్శకుడు-ఇతనినే మొదలనే వేష(మొదటి వేషగాడు) అంటారు), మద్దెల వారు, [[హార్మోనియం]] (ముందులో హార్మోనియం స్థానంలో పుంగి అనే వాయిద్యాన్ని వాడేవారు) వాయించే వ్యక్తి, ఇంకా [[చందే(వాద్య పరికరం)|చండె]] (పెద్ద ధ్వని చేసే డప్పులు) వాయించేవారు ఉంటారు.
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు