అతడే ఒక సైన్యం: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
చి →‎కథ: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 24:
 
== కథ ==
ప్రకాష్ రావు (ప్రకాష్ రాజ్) గుడ్ లక్ కోపరేటివ్ బ్యాంకు యజమాని. ఆ బ్యాంకు వినియోగదారుల నుంచి కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్లు సేకరిస్తుంది. కీలక సమయంలో బ్యాంకు మేనేజరు రాఘవరావు (సుమన్) తప్పిదం వల్ల బ్యాంకు దివాలా తీస్తుంది. నిజానికి ఆ బ్యాంకు చైర్మన్ ప్రకాష్ రావు, మరియు, అతని అనుచరులు సొమ్మును తనకిష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకుని అంతా పోగొట్టేస్తారు. బాధ్యత గల ఉద్యోగియైన రాఘవరావు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని వారి మీద తిరగబడతాడు. పోలీసులకు తెలియజేయక ముందే విలన్ గ్యాంగు రాఘవ రావు కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని చంపి దాన్ని అత్మహత్యగా చిత్రీకరించి బ్యాంకు దివాలాకు అతనే కారణమని జనాల్ని నమ్మిస్తాడు.
 
చంటి అలియాస్ శ్రీధర్ (జగపతి బాబు) రాఘవరావు తమ్ముడు. అన్నయ్య క్రమశిక్షణలో పెరుగుతాడు. పదిమందికి సాయం చేయడం ఎలాగో అన్నయ్య నుంచి నేర్చుకుంటాడు. జర్మనీలో ఉండి చదువుకుంటూ ఉంటాడు. జరిగిన ప్రమాదం తెలుసుకుని ఉన్నపళంగా భారతదేశానికి వస్తాడు. జరిగిన ఘోరానికి కారణం ప్రకాష్ రావు మరియు, అతని భాగస్వాముల పనే అని తెలుసుకుంటాడు. తనలాగా మోసపోయిన కొంతమందిని తనతో చేర్చుకుని ప్రకాష్ రావును తెలివిగా దెబ్బ కొడతాడు. అతని ఆస్తులన్నీ కొట్టేసి నష్టపోయిన వినియోగదార్లకు పంచిపెడతాడు. ప్రకాష్ రావును తప్పు ఒప్పుకొనేలా చేసి తన అన్నయ్య మీదున్న అపవాదును తుడిచివేయడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అతడే_ఒక_సైన్యం" నుండి వెలికితీశారు