"అరవింద్‌ స్వామి" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , , → , (2)
ట్యాగు: 2017 source edit
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , , → , (2))
| spouse = గాయత్రి రామమూర్తి (1994-2010)<br/>అపర్ణ ముఖర్జీ (2012-ప్రస్తుతం)
}}
'''అరవింద్ స్వామి''' దక్షిణ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మోడల్, పారిశ్రామికవేత్త, మరియు, టీవీ వ్యాఖ్యాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. [[తెలుగు సినిమా|తెలుగు]], [[మలయాళ భాష|మలయాళ]] సినిమాల్లో కూడా నటించాడు.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/entertainment/marathi/movies/news-interviews/Mahesh-Manjrekar-to-remake-Kaksparsh-in-Hindi-and-Tamil-with-Arvind-Swamy-and-Tisca-Chopra/articleshow/28789072.cms | work=The Times of India | title=Mahesh Manjrekar to remake Kaksparsh in Hindi and Tamil with Arvind Swamy and Tisca Chopra – ''The Times of India''}}</ref> 1991 లో [[మణిరత్నం]] తన సినిమా దళపతి లోదళపతిలో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన [[రోజా (1992 సినిమా)|రోజా]] (1992), [[బొంబాయి (సినిమా)|బొంబాయి]] (1995) సినిమాల్లో కథానాయకుడి పాత్రతో మంచి పేరు సంపాదించాడు.
 
== బాల్యం ==
అరవింద్ స్వామి [[చెన్నై]]<nowiki/>లో జన్మించాడు. అతన్ని పెంచిన తల్లిదండ్రులు పారిశ్రామికవేత్త వి. డి. స్వామి, మరియు, భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. శిష్య స్కూల్లో, డాన్ బాస్కో [[మెట్రిక్యులేషన్]] హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషన్ల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు.
 
అరవింద్ స్వామి చిన్నప్పుడు వైద్యుడు కావాలనుకున్నాడు. పాకెట్ మనీ కోసం చిన్నప్పుడు ప్రకటనల్లో నటించేవాడు.<ref name=arvindhindu>{{cite news|last=Kamath|first=Sudhish|title=Return of the heartthrob|url=http://www.thehindu.com/arts/cinema/return-of-the-heartthrob/article4360849.ece|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=31 January 2013|location=Chennai, India}}</ref> లయోలా థియేటర్ సొసైటీలో అతన్ని స్టేజీ మీద నుంచి కిందకు వెళ్ళిపొమ్మన్నారు. తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం అతన్ని ఒక ప్రకటనలో చూసి తనను ఓ సారి కలవమని అడిగాడు. తరువాత మణిరత్నం, సంతోష్ శివన్ అతనికి సినిమా నిర్మాణంలో మెలకువలు నేర్పించారు.<ref name=arvindhindu />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878188" నుండి వెలికితీశారు