అరుణా అసఫ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: చినది. → చింది., ప్రార్ధన → ప్రార్థన, స్వాతంత్ర → స్వాతంత్ర్య, , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 21:
}}
 
'''అరుణా అసఫ్ అలీ''' ([[ఆంగ్లం]] Aruna Asaf Ali) ([[బెంగాళీ]]: অরুণা আসফ আলী) ([[జూలై 16]], [[1909]] - [[జూలై 29]], [[1996]]) ప్రసిద్ధ భారత స్వాతంత్రోద్యమస్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. [[1942]]లో [[గాంధీజీ]] జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో [[బొంబాయి]]లోని గవాలియా టాంకు [[మైదానం]]<nowiki/>లో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన [[మహిళ]]<nowiki/>గా చిరస్మరణీయురాలు. [[ఢిల్లీ]] నగరానికి మెట్టమొదటి [[మేయర్]]. ఈమెకు మరణానంతరం [[భారతరత్న]] అవార్డు లభించింది.
 
==తొలి జీవితం==
అరుణా గంగూలీ, [[హర్యానా]]లోని కాల్కాలో ఒక [[బెంగాళీ]] [[బ్రహ్మ సమాజం|బ్రహ్మసమాజ]] కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[లాహోరు]] మరియు, [[నైనీతాల్]] లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. దేశములోని అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనతే. ఈమె [[కలకత్తా]]లోని [[గోపాలకృష్ణ గోఖలే|గోఖలే]] స్మారక పాఠశాలలో బోధించినదిబోధించింది. అరుణకు [[భారత జాతీయ కాంగ్రేసు]] నాయకుడైన అసఫ్ అలీతో [[అలహాబాదు]]లో పరిచయమేర్పడింది. ఈ పరిచయం [[పెళ్ళి]]<nowiki/>కి దారితీసింది. అరుణ తల్లితండ్రులు మతాలు వేరు (ఈమె హిందూ, అతను ముస్లిం), వయోభేదము (ఇద్దరికీ వయసులో 20 ఏళ్ళకి పైగా తేడా) ఎక్కువన్న భావనతో ఆ పెళ్ళిని వ్యతిరేకించినా 1928లో అసఫ్ అలీని వివాహమాడింది.
 
==కుటుంబము==
అరుణ తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బరిసాల్ జిల్లాకు చెందినవాడు. అయితే సంయుక్త రాష్ట్రాల్లో (యునైటెడ్ ప్రావిన్స్)లో స్థిరపడ్డాడు. ఆయన ఒక రెస్టారెంటు యజమాని మరియు, సాహసికుడు. ఈమె తల్లి అంబాలికా దేవి, అనేక హృద్యమైన బ్రహ్మసమాజ ప్రార్ధనాగీతాలుప్రార్థనాగీతాలు రచించిన ప్రముఖ బ్రహ్మజ నాయకుడు త్రైలోక్యనాథ్ సన్యాల్ యొక్క కూతురు. ఉపేంద్రనాథ్ గంగూలీ యొక్క చిన్నతమ్ముడు ధీరేంద్రనాథ్ గంగూలీ తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. ఇంకో సోదరుడు నాగేంద్రనాథ్, ఒక మృత్తికా జీవశాస్త్రజ్ఞుడు, [[రవీంద్రనాథ్ టాగూర్]] యొక్క జీవించి ఉన్న ఏకైక కుమార్తె మీరాదేవిని పెళ్ళిచేసుకున్నాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడిపోయారు. అరుణ సోదరి, పూర్ణిమా బెనర్జీ భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు.
 
==స్వాతంత్ర్యోద్యమం: తొలి రోజులు==
"https://te.wikipedia.org/wiki/అరుణా_అసఫ్_అలీ" నుండి వెలికితీశారు