ఆ ఒక్కటీ అడక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: తో → తో , ఖచ్చితం → కచ్చితం, , → , (3)
పంక్తి 13:
 
== కథ ==
అటుకుల చిట్టిబాబు (రాజేంద్ర ప్రసాద్) అదృష్టాన్ని, జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే వ్యక్తి. తనకి రాసి పెట్టుంటే అది ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగాకచ్చితంగా జరిగి తీరుతుందన్న నమ్మకం అతనిది. దానికి తోడు పూంపుహార్ (బాబు మోహన్) అనే జ్యోతిష్కుడు అతనికి కొద్ది రోజుల్లో రాజయోగం పడుతుందని చెబుతాడు. దాంతో చిట్టిబాబు ఎం. ఏ చదివినా ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా రాజయోగం కోసం కలలు కంటుంటాడు.
 
పనిని దైవంగా భావించి చేపలు పట్టడంతో ప్రారంభించి అంచలంచెలుగా పైకెదిగిన వ్యాపారవేత్త రొయ్యలనాయుడు (రావు గోపాలరావు). ఒకసారి అనుకోకుండా చిట్టిబాబు రొయ్యలనాయుడు కూతురు రంభను రౌడీల బారి నుండి రక్షిస్తాడు. తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ రొయ్యలనాయుడు పాత్రం పనీ పాట లేకుండా తిరిగే అతనికి మాత్రం తన కూతురునిచ్చి పెళ్ళచేయనంటాడు. దాంతో రంభ అతనికి తమ కంపెనీలోనే ఉద్యోగం ఇమ్మంటుంది. కానీ చిట్టిబాబు ఆయనిచ్చిన చిన్నపాటి ఉద్యోగాన్ని నిర్లక్ష్యంగా కాదంటాడు. చిట్టిబాబుతో పెళ్ళికి తండ్రి అంగీకరించకపోవడంతో రంభ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. దాంతో రొయ్యలనాయుడు తన కూతురి కోరిక నెరవేర్చడానికి చిట్టిబాబు తోచిట్టిబాబుతో పెళ్ళి చేస్తాడు. కానీ అతనిలో మార్పు తీసుకురావడానికి తనకే ఒక లక్ష ఎదురు కట్నం ఇమ్మంటాడు. పెళ్ళిలో చదివింపులు స్వీకరించి తన మామకు ఆ డబ్బు ఇచ్చేయాలనుకుంటాడు కానీ ఆప్రయత్నం బెడిసికొడుతుంది. మరో వైపు రొయ్యలనాయుడు తన చేతిలో లక్ష రూపాయలు పెడితే గానీ కూతురితో కాపురానికి అంగీకరించడు. దాంతో చిట్టిబాబు నానా రకాలుగా అడ్డదార్లు తొక్కి డబ్బులు సంపాదించి దాన్ని రొయ్యలనాయుడికి నిర్లక్ష్యంగా ఇస్తుంటాడు. చివరికీ ఆ మోసం కూడా బయట పడుతుంది.
 
చివరికి రొయ్యలనాయుడు అతన్ని మార్చడానికని చిట్టిబాబు కుటుంబ సభ్యులని ఇంటికి పిలిచి అవమానిస్తాడు. తన కూతురికి వేరే పెళ్ళి చేస్తానని బెదిరిస్తాడు. దాంతో అవమానానికి గురైన చిట్టిబాబు నష్టాల్లో ఉన్న ఓ బట్టల మిల్లును కష్టపడి తన తెలివి తేటలతో పైకి తీసుకువస్తాడు. డబ్బు కూడా సంపాదిస్తాడు. ఆ డబ్బు తీసుకుని రొయ్యల నాయుడుకి ఇచ్చి తన భార్యను స్వంతం చేసుకోవాలనుకుంటాడు. చివరికి పెళ్ళి మంటపానికి వెళ్ళగానే అసలు పెళ్ళి జరుగుతుంది తన చెల్లికనీ, తన మామ తనలో మార్పు తీసుకురావడానికే ఇలా నాటకం ఆడి అవమానించాడనీ తెలుస్తుంది. చిట్టిబాబు, రంభ ఒకటవడంతో కథ ముగుస్తుంది.
పంక్తి 51:
* అమ్మొమ్మో రాతిరి వచ్చిందిరోయ్ - గానం : [[ఎస్.జానకి]]
* అంకులూ దిగి రావేమయ్యో - గానం : [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]]
* కొ కొ కో కోనా కోనా కోలాటకే తోడే రానా - గానం : ఎస్.జానకి మరియు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
* పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా - గానం : ఎస్.జానకి మరియు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
* రాజాధి రాజును నేనురా - గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
* వారెవా మానవా ఎదలే అదిరే - గానం : ఎస్.జానకి మరియు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆ_ఒక్కటీ_అడక్కు" నుండి వెలికితీశారు