తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
మరియు తొలగింపు
పంక్తి 11:
తమిళ భాషకి అత్యంతము దగ్గర పోలికలు గల భాష [[మలయాళం]] అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దము వరకు తమిళ, మలయాళ భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పదునాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.
 
ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ మరియు, యెరుకుల మొదలైనవి తమిళ భాషకి ఉప భాషలుగా వాడుకలో ఉన్నాయి.
 
మొట్టమొదటి తమిళ గ్రంథం రచన క్రీ.పూ.3వ శతాబ్దంలో జరిగినని ఆధారాలు ఉన్నాయి. 'సంగమ కాలం'గా పిలువబడే క్రీ.పూ.300 - క్రీ.శ.300 మధ్య కాలంలో తమిళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖనాలు వ్రాయబడ్డాయి. దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లేకపోవటం విశేషం. సంగకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం నుంచి రక్షించబడుతూ ఇప్పటికీ లభ్యంగా ఉన్న గ్రంథాలు అనేకం ఉన్నాయి.
పంక్తి 22:
* ప్రస్తుత కాలం ( క్రీ.శ.1800 - ఇప్పటి వరకు).
 
భక్తి సాహిత్య కాలంలో మరియు, మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసినవి. తరువాతి కాలంలో 'పరిధిమార్ కళైఞర్' (1870 - 1903), 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.
 
== తమిళం గురించి ==
"https://te.wikipedia.org/wiki/తమిళ_భాష" నుండి వెలికితీశారు