ఇబ్న్ కసీర్: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
}}
 
'''ఇస్మాయీల్ ఇబ్న్ కసీర్''' ([[ఆంగ్లము]] : '''Ismail ibn Kathir''') ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : ابن كثير ), ఒక [[ముస్లిం పండితులు|ముస్లిం పండితుడు]] మరియు, [[ఖురాన్]] గురించిన, ప్రసిద్ధి చెందిన [[వ్యాఖ్యాత]]
 
== జీవిత చరిత్ర ==
ఇతని పూర్తిపేరు '''అబూ అల్-ఫిదా, ఇమాముద్దీన్ ఇస్మాయీల్ బిన్ ఉమర్ బిన్ కసీర్ అల్-ఖురాషి అల్-బుస్రవి'''. [[సిరియా]], [[బుస్రా]] నగరంలో [[1301]]లో జన్మించాడు. (బుస్రాలో జన్మించాడు కావున 'బుస్రవీ' అంటారు). [[డమాస్కస్]] లోని ప్రఖ్యాత పండితుడైన [[షేక్-ఉల్-ఇస్లాం]] [[ఇబ్న్ తైమియ్యా]] మరియు, సిరియాకు చెందిన అబూ అల్-హజ్జాజ్ అల్ మిజ్జీ, ల వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన అభ్యాసం పూర్తయి 1341 లో అధికారిక నియామకం గావింపబడ్డాడు. ఇంకనూ అనేక చోట్ల పండితుడిగా నియమింపబడ్డాడు, ఆఖరున డమాస్కస్ లోని [[మహా మస్జిద్]]లో జూన్/జూలై 1366 లో నియమింపబడ్డాడు. ఇబ్న్ కసీర్ తన ప్రఖ్యాత రచన "[[ఖురాన్]] పై వ్యాఖ్యానాలు" వ్రాశాడు, దీన్కి [[తఫ్సీర్ ఇబ్న్ కసీర్]] అని పేరు పెట్టాడు. ఈ తఫ్సీర్ ([[హదీసులు|హదీసుల]] తోనూ) [[ముహమ్మద్]] ప్రవక్త ఉపదేశాలనూ, [[సహాబా]]ల వ్యాఖ్యానాలను కలిగివున్నది. [[ఇస్లామీయ ప్రపంచం]]లో ఈ ఇబ్న్ కసీర్ ఎంతో ప్రాముఖ్యతనూ, ప్రాశస్తాన్నీ కలిగివున్నది.
 
ఇబ్న్ కసీర్ ను [[ఖాదీ (ఇస్లాం)|ఖాదీ]] అని, [[ఇస్లామీయ చరిత్ర]] తెలిసిన ఘనుడనీ పేర్కొంటారు. ఇతను [[ముఫస్సిర్]] (తఫ్సీర్ ను వ్రాసేవాడు) గా ప్రసిద్ధి. ఇతను 'తబక్ఖాత్-ఎ-షాఫయీ' నూ రచించాడు. ఇతను [[షాఫయీ]] పాఠశాల అవలంబీకుడు. ఇతను, తన జీవిత రెండో దశలో 'గ్రుడ్డి'వాడై పోయాడు. [[అహ్మద్ ఇబ్న్ హంబల్]] యొక్క [[ముస్నద్]] ను, దీర్ఘకాలంగా రేయింబవళ్ళూ వ్రాస్తూ, తన కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇబ్న్ కసీర్ ఫిబ్రవరీ [[1373]], డెమాస్కస్ లో మరణించాడు.
పంక్తి 27:
== రచనలు ==
*''[[తఫ్సీర్ ఇబ్న్ కసీర్]]''
*''అల్ బిదాయాహ్ వల్ నిహాయా'' (ఆరంభం మరియు, అంతము) లేదా "తారీఖ్ ఇబ్న్ కసీర్". లభ్యమయ్యే చోటు [http://ar.wikisource.org/wiki/%D8%AA%D8%B5%D9%86%D9%8A%D9%81:%D8%A7%D9%84%D8%A8%D8%AF%D8%A7%D9%8A%D8%A9_%D9%88_%D8%A7%D9%84%D9%86%D9%87%D8%A7%D9%8A%D8%A9 wikisource]
*''అల్-సీరా అల్-నబవియ్యా''
*''తబఖాత్ అష్-షాఫియా''
"https://te.wikipedia.org/wiki/ఇబ్న్_కసీర్" నుండి వెలికితీశారు