ఈక: కూర్పుల మధ్య తేడాలు

చి →‎క్విల్ ఈక నిర్మాణము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)

పంక్తి 1:
[[దస్త్రం:Types de plumes. - Larousse pour tous, -1907-1910-.jpg|thumb|వివిధ రకాలైన ఈకలు]]
'''ఈక''' ([[ఆంగ్లం]]: '''Feather''') బహువచనం '''ఈకలు''' [[పక్షి|పక్షుల]] బాహ్యచర్మము నుండి అభివృద్ధి చెంది, జీవి శరీరాన్ని కప్పుతూ బాహ్య అస్థిపంజరముగా ఏర్పడుతుంది. ఈకల అమరిక మరియు, విస్తరణను టెరిలాసిస్ (Pterylosis) అని అంటారు. [[రాటిటే]] లేదా ఎగరలేని పక్షులలో ఈకలు ఒకే రీతిలో విస్తరించి ఉంటాయి. [[కారినేటా]] లేదా ఎగిరే పక్షులలో ఈకలు క్రమ శ్రేణులలో అమరి ఉంటాయి. ఈ శ్రేణులను పిచ్ఛ ప్రదేశాలు (Pterylae) అని, వీటి మధ్యనున్న ఖాళీ స్థలాలను అపిచ్ఛక ప్రదేశాలు (Apterylae) అని అంటారు. [[మెలనిన్]] (Melanin) వర్ణ పదార్ధము ఉండటము వలన ఈకలు వివిధ వర్ణాలలో ఉంటాయి.

== రకాలు ==
పంక్తి 12:
[[దస్త్రం:Parts of feather modified.jpg|thumb|'''Parts of a feather:'''
1. Vane
2. Rachis
3. Barb
4. Afterfeather
5. Hollow shaft, calamus]]
[[దస్త్రం:Parrot-feather.jpg|thumb|Featherstructure of a [[Blue-and-yellow Macaw]]]]
క్విల్ ఈకలు పొడవుగా ఉంటాయి. ప్రతి ఈకలో మధ్య అక్షము మరియు, విస్తరించిన పిచ్ఛపాలము ఉంటాయి. మధ్య అక్షపు సమీపాగ్ర భాగమును కెలామస్ లేదా క్విల్ అని, దూరాగ్ర భాగమును విన్యాసాక్షము లేక షాఫ్ట్ అని అంటారు.
* కెలామస్ (Calamus) : కెలామస్ లేదా క్విల్ బోలుగా, గొట్టము వలె ఉండి పాక్షిక పారదర్శకముగా ఉంటుంది. దీని అడుగు భాగము బాహ్యచర్మపు పుటిక లోనికి చొచ్చుకొని ఉంటుంది. కెలామస్ చివర చిన్న [[రంధ్రము]] ఉంటుంది. దీనిని నిమ్ననాభి అంటారు. ఈ రంధ్రము ద్వారా అంతశ్చర్మపు సూక్షాంకురము ఒకటి ఈక లోపలికి వెళుతుంది. దీనిని పిచ్ఛ సూక్ష్మాంకురము అని అంటారు. దీని ద్వారా రక్త కేశనాళికలు ప్రవేశించి పెరిగే ఈకకు పోషక పదార్ధాలను, వర్ణకాలను సరఫరా చేస్తుంది. క్విల్, విన్యాసాక్షము కలిసే ప్రాంతంలో ఉదరతలములో మరొక సూక్ష్మ రంధ్రము ఉంటుంది. దీనిని ఊర్ధ్వనాభి అని అంటారు. దీని దగ్గర కొద్ది సంఖ్యలో మెత్తటి ఈకలు ఉంటాయి. వీటిని అనుపిచ్ఛము అని అంటారు.
* విన్యాసాక్షము (Rachis) : మధ్య అక్షము యొక్క దూరాగ్రభాగమును విన్యాసాక్షము లేదా షాఫ్ట్ అని అంటారు. ఇది ఘనముగా ఉండి, అడ్డుకోతలో కోణీయంగా కనిపిస్తుంది. దీని ఉదరతలపు మధ్య భాగములో ఉన్న గాడిని అంబిలికల్ గాడి అని అంటారు.
పంక్తి 24:

=== నూగుటీకలు ===
బాల్యదశలో దేహాన్ని కపి ఉండే సున్నితమైన ఊలు వంటి చిన్న రోమాలను నూలుటీకలు (Down feathers or Plumules) అంటారు. ప్రౌఢదశలో వీటి స్థానములో దేహ పిచ్ఛాలు ఉంటాయి. ప్రతి నూగుటీక యొక్క కెలామస్ భాగము చర్మము లోనికి చొచ్చుకొని ఉండి, పలుచని క్షీణించిన విన్యాసాక్షమును కలిగి పొడవైన కంటకాలు మరియు, చిన్న కంటక కీలితాలను కలిగి ఉంటుంది.

== ఉపయోగాలు ==
పంక్తి 30:
* ఉష్ణ నిరోధకము : పక్షులు ఉష్ణరక్తజీవులు. వీటి శరీర ఉష్ణోగ్రత 104 F - 112 F మధ్య ఉంటుంది. శరీరము మీదగల ఈకల తొడుగు వలన శీతాకాలములోను, వేసవికాలములోను ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడుతుంది.
* ఉడ్డయిక నిర్మాణము : ఈకలు చాలా తేలికగా ఉండటము వలన, అవి ఎక్కువ సంఖ్యలో శరీరము మీద ఉన్నప్పటికి వీటి శరీరము చాలా తేలికగా ఉంటుంది. రెక్కల మీద కప్పి ఉన్న క్విల్ ఈకలు రెక్కకు విస్తారతలాన్ని చేకూర్చి, ఎగరటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. తోక మీద గల ఈకలు [[చుక్కాని]] వలె పనిచేస్తూ పక్షులు ఎగిరేటప్పుడు [[దిశ]]లను మార్చటానికి సహాయపడతాయి.
* ఆత్మరక్షణ : లైపోక్రోమ్ మరియు, మెలనిన్ అను వర్ణక పదార్ధాల వలన ఈకలు వివిధ రంగులలో కనిపిస్తాయి. ఈకలు పక్షులు నివసించు ప్రదేశాల రంగులో ఉండి వాటి ఉనికిని శత్రువులు తెలుసుకోకుండా చేస్తాయి. అందువలన పరభక్షకాల నుండి రక్షణ కల్పిస్తాయి.
* లింగ నిర్ణయము : ఆడజీవుల కంటే మగజీవులు ఎక్కువ ఈకలను కలిగి, వివిధ వర్ణాలలో ఉండటము వలన వాటి లైంగిక ద్విరూపకత (Sexual dimorphism) తెలుగుకోవడానికి ఈకలు ఉపయోగపడతాయి. అంతేకాక ఆడజీవులను ఆకర్షించడానికి ఈకల రంగు మగజీవులలో ఉపయోగపడుతుంది.
* గూళ్ళు నిర్మించుట : సంతానోత్పత్తి కాలములో గూళ్ళను నిర్మించుటకు ఈకలు ఉపయోగపడతాయి. వదులుగా ఉన్న ఈకలను తమ శరీరములో నుంచి తీసి గూళ్ళను నిర్మిస్తాయి.
{{wiktionary}}

[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఈక" నుండి వెలికితీశారు