కండర సంకోచము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (9), typos fixed: , → , (9)
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
'''కండర సంకోచము'''పరిణతి చెందిన జీవులలో శరీర భాగములు లేక శరీరము మొత్తము కదలుట అనునది ప్రత్యేకమైన [[కండర కణజాలము]] ద్వారా జరుగును.[[పీడనము]], [[కాంతి]], [[వేడి]] మొదలగు ప్రచోదనములకనుగుణముగా కండరములు ప్రతి చర్యలు జరుపుచుండును. ఈ కండర కణజాలము మధ్యత్వచము నుండి ఏర్పడును. కండరములు అత్యధిక సంకోచ వ్యాకోచ శక్తిని కలిగియుండును. ఈ కండరములు జీర్ణక్రియ, ప్రసరణ, శ్వాసక్రియ, విసర్జన మరియు, ప్రత్యుత్పత్తి మొదలగు క్రియలను నిర్వర్తించును.
 
==కండరములలో రకములు==
[[దస్త్రం:414 Skeletal Smooth Cardiac.jpg|thumbnail|బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములు. a) అస్థి కండరములు; b) నునుపు కండరములు; c) హృదయ కండరములు]]
===కండరముల అమరికను బట్టి===
ఇవి రెండు రకాలు. మొదటిది, [[ఫేసిక్ కండరములు]] ( Phasic muscles). ఈ కండరముల మూలములు బాహ్య మరియు, అంతర [[అస్థి పంజర]] నిర్మాణముల వద్ద ఏర్పడి వాటిపైన చొచ్చుకొని ఉండును. ఇవి ఉపాంగాల కదలికలకు బాధ్యత వహించును.<br>
రెండవది, [[టోనిక్ కండరములు]] (Tonic muscles). ఇవి సున్నిత అవయవములైన గుండె [[మూత్రాశయము]], [[జీర్ణవ్యవస్థ]] మరియు, శరీరకుడ్యముల వంటి భాగములలో ఉండును. ఇవి నెమ్మదిగా శంకోచించును.
 
===బాహ్య లక్షణములపై ఆధారపడి సకశేరుకముల కండరములు===
పంక్తి 16:
 
===అస్థికండర తంతువు సామాన్య నిర్మాణము (General Structure of A Skeletal Muscle Fibre )===
కండరానికి కండర తంతువులు నిర్మాణాత్మక ప్రమాణాలు.అనేక కండర తంతువుల కలయిక వలన కండరము ఏర్పడుతుంది.కండర తంతువుల పరిమాణము కండరము ఏర్పడటానికి ఎటువంటి ప్రత్యక్షసంబంధమును కలిగి ఉండదు.సాధారణంగా కండర తంతువులను కప్పుతూ కొల్లాజిన్ పోగులు మరియు, బంధన కణజాలము ఉంటుంది. కండరతంతువుల కొనలు స్నాయు బంధనాలుగా ఏర్పడి వాటి సహాయముతో ఎముకలకు అతికి ఉంటాయి.
*భౌమన్ ( BOWMAN 1940 ) ఆభిప్రాయం ప్రకరము ప్రతికడర తంతువు పొడవుగా డండి, బహుకేంద్రక సహితమై, సార్కోలెమ్మా త్వచముతో కప్పబది ఉంటుంది. కండర తంతువులోపల అర్ధద్రవ జీవ పదార్ధమైన సార్కోప్లాసమ్ ను (ROLLET,1891) కల్గి, అనేక ఆయుత సంకోచ నిర్మాణాలైన [[కండరసూక్ష్మ తంతువులు]] ( Myofibrils) లేక [[కండర సూక్ష్మ పోగులు]] (Myofilaments) ఉంటాయి.
* చరల కండర తంతువులు ఒక దాని నుండి మరొకటి పల్చని త్వచమైన ఎండోమైసియమ్ (Endomysium) తో వేరుచేయబది ఉంటాయి.చారల కండర తంతువుల కట్టను ఫాసిక్యులై అంటారు.ప్రతి ఫాసిక్యులస్ ను చుట్టి పెరిమైసియమ్ (Perimysium) అనుబంధన కణజాలపు తొడుగు ఉంటుంది.అన్ని ఫాసిక్యులైను చుట్టి ఎపిమైసియమ్ (Epiomysium) అను స్థితిస్థాపక తొడుగు ఉంటుంది.
పంక్తి 22:
*అస్థి కండర తంతువును సాధారణ సూక్షదర్శినిలో పరిశీలించినపుడు దీని మీద ముదురు పట్టీలు కాంతి రహితంగా కనబడతాయి. ఈ చీకటి భాగాలను అసమప్రసారక (Anisotropic-A పట్టి) అని, కాంతి వంతమైన భాగాలను సమప్రసారక పట్టీలు (Isotropic I పట్టి) అంటారు.
* ఎలక్ర్టాన్ సూక్ష్మదర్శినిలో గమనించినపుడు ప్రతికండర సూక్ష్మతంతువుమీదా నిర్ణీతప్రాంతాలలో అడ్డంగా విభజింపబడిన అనేక త్వచాలంటాయి. వీటిని Z త్వచాలంటారు. రెండు Z త్వచాల మధ్యనున్న కండర సూక్ష్మ తంతువు భాగమును [[సార్కోమియర్]] అంటారు.
'''సార్కోమియర్ ( Sarcomere) ''' : ప్రతి సార్కోమియర్ లో రెండు రకాల సున్నితమైన తంతువులు క్రమబద్ద్ంగా అమరి ఉంటాయి. అవి దళసరి మయోసిన్ తంతువులు మరియు, సున్నితమైన ఏక్టిన్ తంతువులు. ఏక్టిన్ తంతువు ఒక కొన Z త్వచముతో అతికి, రెండవ కొన స్వేచ్ఛగ ఉంటుంది. రెండు ప్రక్క ప్రక్కనే ఉన్న Z త్వచాలను అంటి పెట్టుకొని ఉన్న ఏక్టిన్ పోగులు కండరము వ్యాకోచ స్థితిలో ఉన్నప్పుడు మధ్యలో కలిసి ఉండవు. సార్కోమియర్ మధ్యలో ఉన్న మందమైన మయోసిన్ పోగులు, Z త్వచాల వరకు చేరక వాటి కొనలు స్వేచ్ఛగా ఉంటాయి.కాబట్టి ఏక్టిన్ పోగులు సార్కోమియర్ మధ్యలో కలసి ఉండవు.కనుక సార్కోమియర్ మధ్య భాగము మయోసిన్ పోగులతో ఆక్రమించబడి ఉంటుంది. ఈ ప్రాంతమును H పట్టీ.Z త్వచాలకు దగ్గరగా ఉన్న ప్రంతము ఏక్టిన్ పోగులనుమాత్రమే కల్గి ఉంటుంది. దీనిని I పట్టీ (సమప్రసారక) అంటారు.మయేసిన్ పోగులను కల్గి ఉన్నమొత్తము ప్రాంతాన్ని A పట్టీ (అసమప్రసారక) అంటారు.H పట్టీలలో మయోసిన్ పోగులు, ఏక్టిన్ పోగులు I పట్టీలలో ఉంటాయి.A పట్టీముదురు వర్ణములోను, I పట్టీ లేతవర్ణములోను కనబడును.
 
===కండరసంకోచము యొక్క సంకోచ విధానము ( Physiology of Muscle Contraction )===
కండరమునకున్న అతి ముఖ్యమైన సామర్ధ్య్తత సంకోచ మరియు, వ్యాకోచ క్రియలను జరుపుట. ఈ ప్రక్రియ నాడీ మండలం యొక్క ఆధీనములో ఉండును. మోటారునాడి ద్వారా జరుగు ప్రక్రితి లేక్క కృత్రిమ ప్రేరణకు గురియైనపుడు దాని కనుగుణముగ సంకోచించును. నాడీకణము యొక్క అక్షీయ తంతువు (Axon) కండరము లోనికి పోయి అంతమగును. దీనిని మోటారు నాడీకణమని అంటారు.ఈ కణము యొక్క సైటాన్ మెదడునందు గాని, వెన్నుపామునందుగాని డండును.మోటారు అంత్యఫలకము మరియు, నాడీ అంత్య భాగముల క్రియాత్మక కలయిక ప్రదేశమును [[న్యూరోమస్కులార్ కూడలి]] (Neuromuscular junction) అంటారు.
 
కండరము విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కండరపు పోగుయొక్క వెలుపలి త్వచము విద్యుత్ ధ్రువితమవుతుం ది అనగా దానివెలుపలి త్వచము ధనావేసము (Positively charged) అవుతుంది .కండరపు పోగుయొక్క లోపలి త్వచము వ్యతిరేక విద్యుదావేశాలతో లేదా క్షమలతో ఉంటుంది. అందు వలన లోపలి వెలుపలి తలాల మధ్య [[శక్మాంతరము]] (Potential difference) అమరి ఉంటుంది. దీనిని [[విరామశక్మం]] (Resting potential) అంటారు. ధనావెశము అయిన పొర నాడిప్రచోదనాలను గ్రహిస్తూంది. ఈ నాడీ ప్రచోదనాలు నాడీ అంత్యఫలకము దగ్గరకు చేరగానే ఎసిటైల్ కోలిన్ కండర ఉపరితలము మీద విడుదల అవుతుంది. ఈ పదార్ధము కండర త్వచమును అధ్రువితము చెయటము వలన సోడియం అయాన్ లు ఉధృతంగా త్వచం వెలుపలి నుంచి లోపలికి ఎక్కువ పరిమాణంలో ప్రవేశిస్తాయి. ఇందువలన [[క్రియాశక్మ]] (Action Potential ) ప్రేరేపించబది కండర తంతువు పొడవునా ప్రసరిస్తుంది. క్రియాశక్మంవలన కందరతంతువులో విద్యుత్ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అవి బలహిన ఆయుత తరంగాలు మరియు, దృఢమైన అడ్దు తరంగాలు.
 
===సిద్దాంతాలు (Theories)===
పంక్తి 37:
 
===సంకోచములో జరుగు చర్యలు===
కండరము సంకోచం జరిగే సమయములో శక్తి ఉష్ణము రూపములో విడుదల అగుతుంది. శక్తి విడుదల అయ్యే రసాయనిక చర్యలు, కండరము చైతన్యస్ధితిలో ఉన్నప్పుడు కండరము పొడవుకు మరియు, తన్యత మర్పులు క్రమపరుస్తాయి.
 
===కండర సంకోచము యొక్క రకాలు (Types of muscle Contraction)===
"https://te.wikipedia.org/wiki/కండర_సంకోచము" నుండి వెలికితీశారు