కాక్టేసి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), , → ,
పంక్తి 25:
కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి. వీని [[కాండాలు]] రసభరితంగా మారి, [[పత్రహరితం]] కలిగివుంటాయి. [[ఆకులు]] ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.
 
కాక్టై వివిధ పరిమాణాలలో ఆకారాలలో ఉంటాయి. అన్నింటికన్నా పొడుగైన ''[[Pachycereus pringlei]]'' అత్యధికంగా 19.2 మీటర్లుంటే, <ref>Salak, M. (2000). In search of the tallest cactus. ''Cactus and Succulent Journal'' 72 (3).</ref> అతి చిన్నవి ''[[Blossfeldia liliputiana]]'' సుమారు 1 సెం.మీ. మాత్రమే పెరుగుతుంది.<ref>[http://www.sbs.utexas.edu/mauseth/ResearchOnCacti/large%20photo%20Blossfeld%20liliput%20plants.htm Mauseth Cactus research: ''Blossfeldia liliputiana'']</ref> కొన్ని కాక్టై చిన్నగా గుండ్రంగా ఉంటే మరికొన్ని పొడవుగా స్తంభాకారంగా ఉంటాయి. వీని [[పువ్వులు]] పెద్దవిగా ఉండి రాత్రి సమయంలో వికసిస్తాయి. [[పరాగసంపర్కం]] నిశాచరులైన కీటకాలు మరియు, చిన్న జంతువుల ద్వారా జరుగుతుంది.
 
== ఉపయోగాలు ==
* ప్రపంచ వ్యాప్తంగా కాక్టై పూలకుండీలలో పెంచబడి, ఇంట్లో [[అలంకరణ]] కోసం ఉంచుతారు. ఇవి ఎక్కువగా [[ఎడారి మొక్కలు]]గా బీడు భూములు మరియు, కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి. నీటి కొరత ఎక్కువగా ఉండే దేశాలు మరియు, ప్రాంతాలలో ఇవి జీవించగలవు.
* కాక్టై సాధారణంగా పంటపొలాల చుట్టు [[కంచె]]గా పెంచుతారు. ప్రకృతి వనరులు లేని ప్రాంతాలలో ఎక్కువ ఖర్చుతో కూడిన కంచెలు కట్టించుకోలేనివారు పొలాల చుట్టూ వీటిని పెంచుతారు. ఈ విధమైన [[కాక్టస్ కంచె]]ను కొన్ని పల్లెలలో ఇండ్ల చుట్టూ కూడా పెంచుతారు. వీటికుండే మొనదేలిన ముల్లు దొంగలు, మరియు, పశువుల నుండి రక్షణ కల్పిస్తాయి.
* కొన్ని కాక్టస్ మొక్కలు ఆర్థిక ప్రాముఖ్యత కలిగివున్నాయి. కొన్ని ముఖ్యంగా [[నాగజెముడు]] కండ కలిగిన [[పండ్లు]] కాస్తాయి. [[పిటాయ]] జాతి మొక్కలు డ్రాగన్ కాయలను ఇస్తాయి. వీటిని తినవచ్చును.
* కొన్ని కాక్టస్ మొక్కలు [[Peyote]] లేదా ''Lophophora williamsii'', ''[[Echinopsis]]'' మొదలైన వాటిని అమెరికా ఖండాలలో కొన్ని మానసిక రుగ్మతలకు మందుగా ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కాక్టేసి" నుండి వెలికితీశారు