అగ్ని ప్రమాదాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి →పాటించాల్సిన నిబంధనలు: clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 1:
[[అగ్ని]] వలన జరిగే ప్రమాదాలను '''అగ్ని ప్రమాదాలు''' (Fire accidents) అంటారు. ఇవి [[వేడి]] ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం
==అగ్నిమాపక శాఖ==
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ పేరు '''విపత్తుల స్పందన, అగ్నిమాపక సర్వీసుల శాఖ''' 'గా మార్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అత్యధికులకు గుర్తుకు వచ్చే అగ్నిమాపక శాఖను ప్రజలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం దాని పేరును మార్చింది. ఎలాంటి అత్యవసర సమయాల్లోనైనా ఆ శాఖ నుంచి సేవలు విధంగా ఆదేశాలు జారీ చేశారు. కేవలం అగ్నిప్రమాదాలకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, వానలు, వరదలు, భూకంపాలు... ఇతర ప్రాణాపాయ పరిస్థితులు ప్రజలకు ఏర్పడినప్పుడు విపత్తుల శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి. బాధితులు, ఆర్తులకు అవసరమైన సేవలు అందించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నించాలి. అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడే అగ్ని నిరోధక దుస్తులు, కళ్లజోళ్లు, ఎత్త్తెన క్రేన్లు ఇంకా కావాలి. వరదలొస్తే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి 'విపత్తుల స్పందన, అగ్నిమాపకశాఖ' అధికారుల వద్ద కొన్ని పరికరాలున్నాయి. వాటి సాయంతో రంగంలోకి దిగి బాధితులను ఆదుకోవాలి. ఆపదలో ఉన్నవారు నీటమునగకుండా 'లైఫ్బోయ్లు కాపాడాలి. 'లైఫ్ సేవింగ్ జాకెట్ల ప్రజలకివ్వాలి. గజ ఈతగాళ్లను నియమించాలి. 101 నెంబరుకు ఫోన్ చేస్తే శాఖాపరంగా బాధితులకు అవసరమైన సేవలు అందిస్తారు
|