2,04,044
దిద్దుబాట్లు
PhaniYesh99 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→top: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
'''[[కర్బన వలయం|కార్బన్]]''' (carbon) తెలుగు పేరు '''కర్బనం'''. లాటిన్ భాషలో ''కార్బో'' అంటే బొగ్గు, రాక్షసి బొగ్గు అనే అర్ధాలు ఉన్నాయి. మనం కుంపట్లో వాడే బొగ్గులోనూ, రాక్షసి బొగ్గులోనూ విస్తారంగా ఉండే మూలకం కర్బనం.
ఈ రసాయన మూలకాన్ని ఇంగ్లీషు అక్షరం c తో సూచిస్తారు. దీని [[అణుసంఖ్య]] 6. ఇది [[ఆవర్తన పట్టిక]] లోని 14వ గుంపు (group) లో ఉన్న [[అలోహం]]. దీని [[బాహుబలం]] (వేలన్సీ) 4. ఈ మూలకానికి ఉన్న అనేక రూపాంతరాల్లో (allotropic forms) ముఖ్యమైనవి గ్రాఫైట్, [[వజ్రం]], అమూర్త కర్బనం (amorphous carbon)
ఈ విశ్వంలో విస్తారంగా లభ్యమయే మూలకాలలో (ఉదజని, రవిజని (హీలియం), ఆమ్లజని (ఆక్సీజన్) తరువాత) కర్బనం నాలుగవ స్థానంలో ఉంది. “ప్రాణానికి కార్బన్ కన్నా అవసరమైన మూలక౦ [element] ఏదీలేదు,” అని Nature’s Building Blocks అనే పుస్తక౦ చెప్తు౦ది.<ref>[https://www.jw.org/te/ప్రచురణలు/పత్రికలు/తేజరిల్లు-no5-2016-అక్టోబరు/కార్బన్%E2%80%8C-అద్భుతమైన-మూలక౦/ అద్భుతమైన మూలక౦]</ref> మనకి తెలుసున్న జీవులన్నీటిలోనూ కర్బనం తప్పనిసరిగా ఉంటూ ఉంది. మానవ శరీరంలో, గురుత్వంలో, కర్బనానిది - ఆమ్లజని తరువాత - రెండవ స్థానం. మన శరీరాలలోని పదార్ధంలో 18.5 శాతం కర్బనమే.
|