కోవెలమూడి సూర్యప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎సినీరంగ ప్రవేశం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 42:
 
==సినీరంగ ప్రవేశం==
ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941లో [[గూడవల్లి రామబ్రహ్మం]] తీసిన [[అపవాదు]] సినిమాతోనూ, 1940లో నిర్మించినా 1942లో విడుదలైన [[పత్ని]] సినిమాతోనూ ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన [[కోవలన్]] పాత్ర పోషించాడు. ఈయన 1942లో [[ఆర్.ఎస్.ప్రకాశ్]] తీసిన [[బభ్రువాహన]] సినిమాలో కూడా నటించాడు. 1948లో [[ద్రోహి (1948 సినిమా)|ద్రోహి]] సినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టాడు. ఇందులో నాయకుని పాత్రకూడా ప్రకాశరావే పోషించాడు. స్వతంత్ర పిక్చర్స్ పతాకముపై విడుదలైన ఈ సినిమాకు [[ఎల్వీ ప్రసాద్]] దర్శకత్వం వహించాడు. ఆ తరువాత 1949లో పతాకము పేరు [[ప్రకాశ్ ప్రొడక్షన్స్‌]]గా మార్చి [[మొదటి రాత్రి (1950 సినిమా)|మొదటిరాత్రి]] మరియు, [[దీక్ష (1974 సినిమా)|దీక్ష]] వంటి సినిమాలకు నిర్మించి దర్శకత్వం తానే వహించాడు. దాని తర్వాత ప్రకాశ్ ప్రొడక్షన్స్‌ను ఒక స్టూడియోగా అభివృద్ధి పరచి ప్రకాశ్ స్టూడియోస్‌గా నామకరణం చేశాడు.
 
1950లో ఈయన తీసిన సినిమాలు చాలామటుకు మెలోడ్రామాలు. ఆ తరువాత కాలములో [[ప్రేమనగర్]] వంటి సైకలాజికల్ ఫాంటసీలను తీశాడు. <!--E.g. Prem Nagar, a story of unrequited love drowned in liquor written by Kousalya Devi.--> ఈయన [[పుట్టన కణగళ్]] తీసిన ''నగర హావు'' (1972) అనే [[కన్నడ]] ప్రేమకథా చిత్రాన్ని తెలుగులో [[కోడెనాగు]]గా పునర్నిర్మించాడు. 1970వ దశకంలో [[కన్నడ]] సినిమాలు కూడా తీశాడు. ఈయన కొడుకు [[కె.రాఘవేంద్రరావు]] అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకో [[కుమారుడు]], కె.ఎస్.ప్రకాశ్ తెలుగు చిత్రరంగములో పేరొందిన [[ఛాయాగ్రాహకుడు]]. 1994 సంవత్సరంలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ఈయనకు [[రఘుపతి వెంకయ్య]] అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈయన [[1996]] సంవత్సరంలో మరణించాడు.