గుంటకలగర: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎పెరిగే ప్రదేశాలు: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 18:
'''గుంటకలగర''' లేదా '''గుంటగలగర''' ఒక విధమైన ఔషధ మొక్క. ఇది [[ఆస్టరేసి]] (Asteraceae) కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా (Eclipta alba). నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది. సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు. మార్కెట్లో చాలా తల నూనెలు గుంటగలగర ఆకులతో తయారు చేస్తున్నారు. వెండ్రుకలు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉండటమే అందుకు కారణం. గుంటగలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రపరచి నీడలో ఎండబెట్టాలి. దీనికి మార్కెట్లో మంచి అమ్మకపు విలువ వుంటుంది. ఆధునిక పరిశోధనలలో ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధతత్వానికి లివర్ ను బాగుచేయగల శక్తి ఉందని కనుగొన్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో గుంటగలిజేరును ప్రధానంగా తల వెండ్రుకలు నల్లగా, వత్తుగా పెరగటానికి, లివరు, చర్మ వ్యాధులలో వాడుతారు.
==పెరిగే ప్రదేశాలు==
ఈ జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో, తేమ ప్రదేశాల్లో సాధారణంగా పెరుగుతాయి. ఇది విస్తృతంగా భారతదేశం , చైనా , థాయిలాండ్, మరియు బ్రెజిల్ అంతటా పెరుగుతాయి. ఈ మొక్కలు సాధారణంగా వ్యర్థభూమిలలో పెరుగుతాయి.ఈ మొక్కలకు స్థూపాకార, బూడిదరంగు మూలాలు కలిగి ఉంటాయి. తరచుగా నోడ్స్ వద్ద కాండం నిటారుగా లేదా ప్రోస్టేట్ గా ఉంటాయి.ఆకులు ప్రతిపక్షంగా ఏర్పడి దీర్ఘచతురస్రం , లాన్స్ ఆకారంలో, లేదా దీర్ఘవృత్తాకారం లో ఉంటాయి.ఆకులు 2.5-7.5 cm పొడవు ఉంటాయి . ఇది ఒక పొడవాటి కాండము గుండ్రంగా ,గోధుమ రంగులో మరియు, తెల్లని డైసీ వంటి పువ్వులు కలిగి ఉంటాయి.
== లక్షణాలు ==
* నేలపై పాకుతూ నిటారుగా పెరిగే [[గుల్మం]].
"https://te.wikipedia.org/wiki/గుంటకలగర" నుండి వెలికితీశారు