'''చంద్ర సిద్దార్థ ''' ప్రముఖ [[తెలుగు]] సినీ [[దర్శకుడు]] మరియు, నిర్మాత.
==నేపధ్యము==
చంద్ర సిద్దార్థ, పూర్ణచంద్రరావు మరియు, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. బడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు.<ref name=sakshi>{{cite web|last1=కె.|first1=క్రాంతి కుమార్ రెడ్డి|title=తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!|url=http://www.sakshi.com/news/funday/i-feel-guilty-in-that-manner-chandra-siddhartha-69115|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=10 November 2016}}</ref> [[హైదరాబాదు]] [[నిజాం కళాశాల]]లో విద్యనభ్యసించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి [[తెలుగు]] సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు [[ఉప్పలపాటి నారాయణరావు]] దగ్గర [[జైత్రయాత్ర]] చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం [[మలేషియా]]లో నిర్వహించిన భారతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.