చి
→top: AWB తో "మరియు" ల తొలగింపు
(విస్తరణ) ట్యాగు: 2017 source edit |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→top: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
'''జస్టిస్ పార్టీ''' (అధికారిక నామం '''సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్''') ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో ఏర్పడ్డ ఒక రాజకీయ పార్టీ. దీనిని [[నవంబరు 20]], [[1916]]న [[టి. ఎం. నాయర్]], [[పి. త్యాగరాయ చెట్టి]] [[చెన్నై|మద్రాసు]]లోని [[విక్టోరియా మెమోరియల్ హాలు]]లో ప్రారంభించారు. ప్రెసిడెన్సీ లో వరుసగా చోటు చేసుకున్న బ్రాహ్మణేతర సమావేశాల ఫలితంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. 19వ శతాబ్దం చివర్లోనూ, 20 వ శతాబ్దం మొదట్లో బ్రాహ్మణులు,
ప్రారంభంలో ఈ పార్టీ ఆంగ్ల పరిపాలనా విభాగాల్లో బ్రాహ్మణేతరులకు ఎక్కువగా ప్రాతినిథ్యం కల్పించేలా బ్రిటిష్ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. 1919లో [[మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము|మాంటేగ్ షెమ్స్ ఫర్డ్ సంస్కరణల]] ఫలితంగా మద్రాసు ప్రెసిడెన్సీ లో ద్వంద్వ పరిపాలనా విధానం (Diarchy) అమల్లోకి వచ్చింది. అలా మొదటి సారిగా జస్టిస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనింది. 1920 లో జరిగిన ప్రెసిడెన్సీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 17 ఏళ్ళలో ఐదుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు అయితే అందులో నాలుగు సార్లు ఈ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసి 13 ఏళ్ళు అధికారంలో ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీ ఇదొక్కటే. 1937లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోలేకపోయింది. తర్వాత ఇది ఆత్మగౌరవ నినాదంతో [[ఇ.వి. రామస్వామి నాయకర్|పెరియార్ రామస్వామి]] నాయకత్వం కిందకు వచ్చింది. 1944లో పెరియార్ ఈ పార్టీని ''ద్రవిడర్ కళగం'' అనే పేరుతో సామాజిక సంస్థగా మార్పు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం విరమింపజేశాడు. 1952లో ఈ సంస్థలోని కొంతమంది తిరుగుబాటు దారులు ఎన్నికల్లో పోటీ చేశారు.
|