జెట్టి ఈశ్వరీబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 9:
 
==వృత్తి జీవితం==
ఈశ్వరీబాయి సోదరుడు రామకృష్ణ వామపక్షవాది. ఈయనే ఈశ్వరీబాయికి సామాజిక ధృక్పథం మరియు, రాజకీయ చైతన్యం కల్పించాడు.<ref name=geethareddy_nt /> భర్త చనిపోయి పుట్టింట్లో ఉన్నా ఈశ్వరీబాయి ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించింది. మెట్రిక్ పాసై పరోపకారిణి పాఠశాల అనే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా వృత్తి జీవితం ప్రారంభించింది.. ఆ పాఠశాలలో పనిచేస్తూనే కొందరు సంపన్న కుటుంబాల పిల్లలకు బోధనా తరగతులను నిర్వహించేవారు. ఈశ్వరీబాయికి [[తెలుగు]], [[హిందీ భాష|హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] భాషలలో మంచి పరిజ్ఞానం ఉండేది. పూణేలో ఉన్న రోజుల్లో మరాఠీ చేర్చుకున్నది.<ref name=geethareddy_nt /> హైదరాబాదు ప్రజలతో కలిసి పనిచేయడానికి బహుభాషా పరిజ్ఞానం ఆ రోజుల్లో ప్రత్యేక అర్హత. దానిని ఈశ్వరీబాయి సద్వినియోగపరుచుకున్నారు. ఎవరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే సమాధానమిచ్చేవారు. అలా అందరికీ ఆత్మీయులయ్యారు. ఓ వైపు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు సాంఘిక సేవలో పాల్గొనేది. ఈశ్వరీబాయి రెడ్‌క్రాస్ సొసైటీ యొక్క జీవితకాలపు సభ్యురాలు మరియు, చాలా కార్యక్రమాల్లో ఆమె భాగస్వామిగా పనిచేసింది. తన దగ్గరున్న డబ్బుతోనే గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు అనే విద్యాసంస్థలను మొదలుపెట్టింది.<ref name=geethareddy_nt />
 
==మున్సిపల్ కౌన్సిలర్‌గా==
పంక్తి 21:
 
===మహిళా సంక్షేమం===
ఈశ్వరీబాయి కొంతకాలం మహిళా, శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా ఉన్నారు. మహిళాభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు జరిపారు. 1952 నుండి 1990 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాసేవా రంగంలో పనిచేస్తూ దళిత ప్రజలు, వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి ఈశ్వరీబాయి కృషి చేశారు. ఈశ్వరీబాయి జ్ఞాపకార్ధం ట్రస్టు మరియు, నర్సింగ్ కాలేజి నిర్వహించబడుతున్నాయి.
 
===కుమార్తె===
"https://te.wikipedia.org/wiki/జెట్టి_ఈశ్వరీబాయి" నుండి వెలికితీశారు