టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
[[దస్త్రం:ATTtelephone-large.jpg|150px|right|thumb|టచ్ టోన్® సింగల్ లైన్ వాణిజ్య టెలీఫోను, వార్త నిరీక్షణ ల్యాంపు తో]]
 
టెలిఫోను (దూరవాణి) అనేది దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాల నుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా యితర మాధ్యమం ద్వారా చేరవేసే పరికరం. '''టెలీఫోను''' ([[గ్రీకు|గ్రీకు భాష]] నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు, శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం. దీనియొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 లో [[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] అనే శాస్త్రజ్ఞుడు పొందాడు. తర్వాత టెలిఫోన్ లలో యితర మార్పులు యితర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. ఇది క్రమేణా ప్రపంచంలో వ్యాపార వర్గాలకు, ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య మానవునికి కూడా అందుబాటులోకి వచ్చింది.
 
టెలిఫోన్ (దూరవాణి) లో ముఖ్యమైన భాగములు, మైక్రోఫోన్ (ట్రాన్స్ మీటరు) మాట్లాడుటకు, మరియు రిసీవర్ (వినుటకు) ఉంటాయి. ప్రతి టెలీఫోన్ కు ఒక సంఖ్య ఉంటుంది. దానికి వేరొక ఫోన్ తో చేసినపుడు అవి అనుసంధానించబడి టెలిఫోన్ నుండి శబ్దం వినబడుతుంది. దీని ఆధారంగా ఫోన్ వచ్చే సమాచారం తెలుసుకోవచ్చు. సుమారు 1970 ప్రాంతం వరకు అనేక టెలిఫోన్ లు రోటరీ డయల్ (నంబర్లు త్రిప్పుట) తో పనిచేయసాగాయి. కానీ 1963 లో AT&T అనే సంస్థ పుష్ బటన్ డయల్ తెలీఫోన్లను మొదట ప్రవేశపెట్టింది<ref>Dodd, Annabel Z., ''The Essential Guide to Telecommunications''. Prentice Hall PTR, 2002, p. 183.</ref>. రిసీవర్ మరియు, ట్రాన్స్ మీటర్ లు ఒకే హాండ్ సెట్ కు అమర్చి ఒకేసారు మాట్లాడుటకు, వినుటకు సౌలభ్యం చేకూర్చారు. ఈ హాండ్ సెట్ కొన్ని తీగలతో టెలిఫోన్ సెట్ కు అనుసంధానించబడుతుంది.
 
లాండ్ లైన్ టెలీఫోన్ టెలిఫోన్ నెట్ వర్క్ కు తీగల ద్వారా, మొబైల్ ఫోన్, సెల్యులర్ ఫోన్ లు టెలిఫోన్ నెట్ వర్క్ కు రేడియో ప్రసారాల ద్వారా, కార్డ్ లెస్ ఫోన్ లో హాండ్ సెట్ నుండి ఫోన్ కు రేడియో ప్రసారాలద్వారా టెలిఫోన్ ఎక్సేంజికి అనుసంధానబది ఉంటుంది. ప్రసారిణి (Transmitter) టెలిఫోన్ నెట్ వర్క్ నుండి టెలిఫోన్ గ్రాహకం వరకు శబ్ద తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి పంపుతుంది. టెలిఫోన్ లోని గ్రాహకం వచ్చిన విద్యుత్ సంకేతాలను మరల శబ్ద తరంగాలుగా మార్చుతుంది.
పంక్తి 54:
డయల్ పద్ధతిలో మనకు కావల్సిన వినియోగదారుతో నేరుగా మాట్లాడే సిద్ధాంతాన్ని రూపొందించినవాడు స్ట్రోగర్. టెలిఫోన్ వాడకంలో యితర పద్ధతులు కూడా ఉన్నాయి. అమెరికాలో వాడుతున్న పానల్ పద్ధతి, వెల్ కంపెనీ తయారుచేసిన కాల్ బార్ పద్ధతి, రోటరీ పద్ధతి, ఆధునిక ఎలక్ట్రానిక్ పద్ధతి వగైరా. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అయితే మనకు కావలసిన కనెక్షన్ 0.002 సెకనులో లభ్యమవుతుంది. తరచుగా మనం ఉపయోగించే టెలిఫోన్ వినియోగాదార్లతో కనెక్షన్ కావాలంటే 6 లేదా 7 అంకెలను చేయనవసరం లేకుండా కేవలం రెండు అంకెలతోనే సాధ్యమవుతుంది. వలయంలో ఎక్కడైనా దోషం ఏర్పడితే మరోవలయం తానంతట తానుగా పనిచేయడం ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్ ఛేంజ్ లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
== ప్రాథమిక సూత్రాలు ==
సాధారణంగా మనం ఉపయోగించే లాండ్ లైన్ టెలిఫోన్ వ్యవస్థను "[[plain old telephone service]]" (POTS) అని పిలుస్తారు. యివి సాధారణంగా కంట్రోల్, ఆడియో సంకేతాలను ఒకే విద్యుద్బందక తీగల జత (C) గుండా పంపించబడుతుంది.: సంకెతాల వ్యవస్థ, లేదా రింగర్ (పటం 1 లోచూపబడింది) అనునది బెల్, బీపర్, వినియోగదారునికి వచ్చే కాల్ ని తెలియజేయుటకు కాంతి లెదా ఇతర పరికరం (A7) మరియు, టెలిఫోన్ నంబర్ లను డయల్ చేయుటకు అంకెల బటన్స్ కలిగిన వ్యవస్థ లెదా డయల్ (A4) ఉంటుంది. చాలా టెలిఫోన్ సాధనాల్లో వచ్చే, వెళ్ళె సంకేతాలకు ఒకె జత తీగలు ఉంటాయి.తీగల ట్విస్టెడ్ జత విద్యుదయస్కాంత వ్యతికరణాన్ని మరియు, క్రాస్ మాటలను అరికడుతుంది.మైక్రోఫోన్ నుండి బలంగా బయటకు వెళ్ళే శబ్ద సంకేతాలు మనకి వచ్చే బలహీనమైన శబ్ద సంకేతాలు అద్యారోపణం చెందవు ఎందువలనంటే హైబ్రిద్ కాయిల్ (ఎ3) అనునది వెళ్ళే సంకేతాలనుండి మక్రోఫోన్ సంకేతాలను తీసివేస్తుంది. జంక్షన్ బాక్స్ (B) అనునది లైట్నింగ్ (B2) మరియు, తంతిలో నిరోధాన్ని సవరించే నిరోధకం (B1) సంకేత శక్తిని పెంచుతుంది.
 
==వివిధ రకాల టెలిఫోన్లు==
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు