"డాన్" కూర్పుల మధ్య తేడాలు

15 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
→‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కి → కి (2), గా → గా (2), తో → తో , ఉద్దేశ్యం → ఉద్ using AWB)
చి (→‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు)
పోలీసులు తీవ్రంగా గాలించే చట్టవ్యతిరేక వ్యాపారాలు నిర్వహించే '''డాన్''' ([[అమితాభ్ బచ్చన్]]) వారికి చిక్కకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. '''డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై''' (డాన్ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అన్నది డాన్ ఊతపదం. తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించటానికి డాన్ అనుసరించే నిర్దయా విధానాలు, నిక్కచ్చి వ్యవహార శైలితో డాన్ పోలీసులనే కాకుండా తన ప్రత్యర్థులను కూడా శత్రువులుగా మార్చుకొంటుంటాడు. రమేష్ అనబడు వ్యక్తి పెళ్ళి చేసుకొని స్థిరపడాలనే ఉద్దేశంతో డాన్ వ్యాపారం నుండి వైదొలగాలని స్వయంగా నిర్ణయించుకొన్నాడని తెలపటంతో అతడిని హత మారుస్తాడు డాన్. రమేష్ తో నిశ్చితార్థం జరిగిన అతని ప్రియురాలు కామిని ([[హెలెన్]]) అతని చెల్లెలు రోమా ([[జీనత్ అమన్]]) డాన్ పైన పగ పెంచుకొంటారు. డాన్ ని ఆకర్షించి అతనిని పోలీసులకి పట్టించాలనుకొన్న కామిని కుయుక్తిని డాన్ చివరి నిముషంలో పసిగట్టి ఆమెని హతమార్చి తాను తప్పించుకు పోతాడు.
 
డాన్ ని మట్టుబెట్టాలనుకొన్న రోమా తన వేషభాషలని మార్చి జూడో మరియు, కరాటే నేర్చుకొని తాను కూడా చట్టవ్యతిరేక పనులు చేస్తున్నట్టు డాన్ అనుచరులను నమ్మిస్తుంది. ఆమె పోరాట పటిమకు ముచ్చట పడిన డాన్ రోమా నిజ స్వరూపం తెలియక తన వ్యాపారంలో చోటిస్తాడు డాన్. డాన్ ని ప్రాణాలతో పట్టుకోవాలన్న పోలీసుల యత్నాలు విఫలమౌతాయి. ఆ పోరాటంలో ఆఫీసర్ డిసిల్వా చేతిలో డాన్ మరణిస్తాడు. అయితే డిసిల్వా ఈ నిజాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వడు. దీనికి కారణం, డాన్ ని పోలి ఉన్న విజయ్ గురించి డిసిల్వాకి అది వరకే తెలిసి ఉండటం. సైనికుడిగా డాన్ విస్తరిస్తున్న చీకటి సామ్రాజ్యానికి అధిపతి ఎవరో తెలుసుకోవటానికి విజయ్ ని ఉపయోగించుకోవాలనుకొంటాడు డిసిల్వా.
 
బనారసీ పాన్ ని ముంబయిలో అమ్ముకొంటున్న విజయ్ కి ఇద్దరు అనాథ పిల్లలు తారసపడటంతో వారిని తనతో బాటే పెంచుకొంటుంటాడు. వారి చదువు సంధ్యల బాధ్యతలను డిసిల్వా స్వీకరించి విజయ్ ని డాన్ గా మారుస్తాడు. చీకటి వ్యాపారం నుండి తొలగిపోవాలనుకొన్న జస్జీత్ పోలీసుల చేతిలో చిక్కి తన ఇద్దరు పిల్లలకు దూరమైన జస్జీత్ డిసిల్వా పైన పగబడతాడు. డాన్ తన జ్ఞాపక శక్తిని కోల్పోయినట్టు నటిస్తుంటాడు విజయ్. డాన్ ని మట్టుబెట్టాలనుకొంటున్న రోమాకి హఠాత్తుగా ఈ నిజం తెలుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2880944" నుండి వెలికితీశారు