తన్నీరు హరీశ్ రావు: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 17:
 
==ప్రారంభ జీవితం==
ఈయన మెదక్ జిల్లా, [[సిద్దిపేట]]లో సత్యన్నారాయణ మరియు, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు. ఈయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] వ్యవస్థాపకులు మరియు, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] గారి మేనల్లుడు. ఈయన సిద్దిపేటలో పట్టభద్రుడైనాడు.
 
==రాజకీయ జీవితం==
హరీశ్ రావు 2004 లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి]] కేబినెట్‌లో యువజన సర్వీసులు, ప్రింటింగ్‌ స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశాడు. [[కల్వకుంట్ల చంద్రశేఖర రావు]] గారు సిద్దిపేట శాసనసభ మరియు, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాలలోనికి అడుగిడినారు. ఆతర్వాత మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అవిశ్రాంతంగా విశేషమైన ఉద్యమాలు నడిపారు.
 
తెలంగాణ కోసం రాజీనామా చేసి [[సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం|సిద్దిపేట శాసన సభ]] స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై 58935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64014 ఓట్లలతో గెలిచాడు. 2010 మొదట్లో యు.పి.ఎ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది 2009 లో [[వై.యస్.రాజశేఖరరెడ్డి]] పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాశాడు.
పంక్తి 27:
 
==వ్యక్తిగత జీవితం==
హరీశ్ రావు శ్రీనితను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు మరియు, ఒక కుమార్తె. ఆయన మాసబ్ ట్యాంక్ లో గల జె.ఎన్.టి.యు లో పాలిటెక్నిక్ చదివాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తన్నీరు_హరీశ్_రావు" నుండి వెలికితీశారు