ధనియాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ధనియాలు: భాషాదోషాల సవరణ, typos fixed: ఆనవాయితి → ఆనవాయితీ using AWB
చి →‎ఉపయోగాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 36:
* శరీరంలో స్థానికంగా వాపు తయారవటం ధనియాల కషాయం తీసుకుంటే మూత్రం జారీ అవటం మూలాన వాపు తగ్గుతుంది. దీంతోపాటు 2 భాగాల పసుపును, 1 భాగం సైంధవ లవణాన్ని కలిపి మెత్తగా నూరి నీళ్లుకలిపి జారుడుగా చేసి స్థానికంగా- వాపుమీద పట్టువేసుకోవాలి. తల తిరగటం ధనియాలు, చందనం, ఉసిరి పెచ్చులు వీటిని సమాన భాగాలు తీసుకొని చన్నీళ్లలో నానబెట్టి హిమం తయారుచేసుకొని వాడితే తల తిరగటం, కళ్లు బైర్లుకమ్మటం వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి సమస్యలు, కళ్ల మంటలు 20గ్రాముల ధనియాలను ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించి, పరిశుభ్రమైన నూలుగుడ్డతో వడపోసి, ఒక్కో కంట్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి. కళ్ల కలక, కళ్లమంటలు, కళ్ల దురదలు, కళ్లనుంచి నీళ్లుకారటం వంటి కంటికి సంబంధించిన సమస్యల్లో ఇది చాలా లాభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజూ ధనియాలతో తయారుచేసిన తాజా కషాయంతో కళ్లను శుభ్రపరచుకుంటుంటే కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు. కంటి వాపు ధనియాలు, బార్లీ గింజలను సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి కళ్లపైన పట్టుగా వేసుకుంటే కంటివాపు తగ్గుతుంది. గొంతు నొప్పి ప్రతిరోజూ ఉదయం సాయంకాలాలు 5-10 ధనియాల గింజలను నమిలి రసం మింగుతుంటే గొంతు నొప్పి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. వేడివల్ల తలనొప్పి రావటం ధనియాలు, ఉసిరికాయలను సమాన భాగాలు తీసుకొని రాత్రంతా చల్లని నీళ్లలో నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బి, రసం పిండి పంచదార కలుపుకొని తాగితే వేడివల్ల వచ్చిన తల నొప్పి తగ్గుతుంది. అధిక బహిష్టుస్రావం ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మిశ్రీని (పటిక బెల్లం) చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే బహిష్టు సమయాల్లో జరిగే రక్తస్రావాధిక్యత తగ్గుతుంది. దద్దుర్లు ధనియాల కషాయాన్ని తాజాగా తయారుచేసి తీసుకుంటూ బాహ్యంగా కొత్తిమీర రసాన్ని ప్రయోగిస్తే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలు పక్క తడపటం ధనియాలు, దానిమ్మ పూవులు (ఎండినవి), నువ్వులు, తుమ్మబంక (ఎండినది), కలకండ.. వీటిని సమాన భాగాలు తీసుకొని చూర్ణంచేసి చెంచాడు మోతాదుగా రాత్రిపూట ఇస్తే చిన్నారుల్లో పక్కతడిపే అలవాటు తగ్గుతుంది. కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది కిడ్నీలను ఉత్తేజపరిచి మూత్రాన్ని జారిఅయ్యేలా చేస్తుంది కూడా.
==ఉపయోగాలు==
# వీటి తాజా ఆకులు చైనీస్ వంటలలో, పలు దక్షిణ ఆసియా ఆహారాలలో ( ముఖ్యంగా చట్నీలు ), మరియు మెక్సికన్ వంటలలో ఒక దినుసుగా ఉంటాయి.
# మాంసం వంటలలో మరియు, సలాడ్లులలో ఈ ఆకులను ఉపయోగిస్తారు
# తరిగిన కొత్తిమీర ఆకులు పప్పు కూరలు వంటి వండిన వంటకాల్లో ఒక అలంకరింపుగా ఉపయోగపడతాయి.
# భారతీయ మరియు, మధ్య ఆసియా వంటకాల్లో, కొత్తిమీర ఆకులను పులుసులలో మరియు, ఆకుపచ్చ కూర పేస్ట్ వంటి పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు.
# కొత్తిమీర జీర్ణ వ్యవస్థకు ఒక చికిత్సగా పరిగణించబడుతుంది. ఇది గాస్ట్రిక్ స్రావాలకు ఆకలి ఉద్దీపన ఉపయోగపడుతుంది.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ధనియాలు" నుండి వెలికితీశారు