పాలగుమ్మి సాయినాథ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 11:
 
== పుట్టు పూర్వోత్తరాలు ==
సాయినాథ్ [[ఆంధ్రప్రదేశ్‌]]లోని పేరొందిన కుటుంబం నుండి వచ్చిన వాడు. మాజీ [[రాష్ట్రపతి]] [[వి.వి. గిరి]] మనవడు. సాయినాథ్ [[1957]]లో [[మద్రాసు]]లో జన్మించాడు. మద్రాసులోని [[లయోలా కాలేజ్]]లో విద్యాభ్యాసం చేసాడు. సామాజిక రుగ్మతలు, రాజకీయ కోణాలకు సంబంధించిన ఆసక్తి అతనికి కాలేజీ విద్యార్థిగా ఉండగానే మొదలయ్యింది. [[ఢిల్లీ]]లోని [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం]]లో చదువుతున్నప్పుడు అతను విద్యార్థి రాజకీయాలలో పాల్గొన్నాడు. అక్కడి నుండి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి [[1980]]లొ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి ఆ వార్తాసంస్థ యొక్క అత్యుత్తమ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత రూసీ కరాంజియా యొక్క బ్లిజ్ట్ వారపత్రికలో పనిచేశాడు. [[ముంబాయి]] నుండి ప్రచురితమయ్యే ఈ ప్రముఖ భారతీయ టాబ్లాయిడ్ వారపత్రికకు ఆరు లక్షల సర్క్యులేషన్ ఉంది. బ్లిట్జ్లో విదేశీవ్యవహారాల సంపాదకుడిగా చేరిన సాయినాథ్, అదే పత్రికలో పదేళ్ల పాటు ప్రధాన ఉప సంపాదకుడిగా పనిచేశాడు. గత పాతిక సంవత్సరాలుగా [[ముంబాయి]]లోని సోఫియా కళాశాలకు చెందిన సోఫియా పాలిటెక్నిక్లో సామాజిక సమాచారప్రసార మాధ్యమాల కోర్సును భోధిస్తూ వచ్చాడు.<ref>{{cite web |url=http://www.scmsophia.com/index.htm |title=Social Communications Media |publisher=Scmsophia.com |date=22 November 2011 |accessdate=29 November 2011 |website= |archive-url=https://web.archive.org/web/20111106143849/http://www.scmsophia.com/index.htm |archive-date=6 నవంబర్ 2011 |url-status=dead }}</ref> మరియు, చెన్నైలోని ఆసియా జర్నలిజం కళాశాలలో బోధిస్తూ నవతరం పాత్రికేయ విద్యార్థులను ఉత్తేజితుల్ని చేస్తున్నాడు.
 
== విమర్శలు ==
సాయినాథ్ గారి ఘాటు [[జర్నలిజం]] ఎంతో మంది విమర్శకులను తయారుచేసి ఉండవలసింది, కానీ ఎందుకో అతనిపై విమర్శలు చెప్పుకోదగివంత లేవు. ఎన్ని తప్పులను ఎత్తి చూపినా అతని వృత్తి గౌరవానికి ఎవరూ అడ్డుచెప్పడం చూడలేదు. ఔట్‌లుక్ పత్రికలో సుర్జిత్ ఎస్. భల్లా అనే ఆయన విమర్శ ఒక్కటి కొంత చెప్పుకోవచ్చును.
 
== గౌరవాలు మరియు, పురస్కారాలు ==
[[జర్నలిజం]], [[సాహిత్యం]] మరియు, [[కమ్యూనికేషన్]] రంగాలలో నోబెల్ పురస్కారానికి దీటుగా పరిగణించబడే [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసె]] పురస్కారాన్ని [[2007]]లో గెలుచుకున్న ఒకే ఒక్క భారతీయుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పాలగుమ్మి_సాయినాథ్" నుండి వెలికితీశారు