పెమ్మసాని రామలింగ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
విజయనగర సామ్రాజ్యకాలములో బహు పేరుప్రఖ్యాతులు పొందిన సేనాధిపతులు, సామంతరాజులు [[పెమ్మసాని నాయకులు]]. వీరు [[ఓరుగల్లు]] పతనము పిమ్మట [[విజయనగరము]]<nowiki/>నకొచ్చి రెండవ హరిహరరాయల కడ సేనాధిపతులుగా చేరారు. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని [[బెల్లంకొండ]] కు చెందిన వల్లుట్ల మరియు, ముసునూర్ల గోత్రీకులు. కాకతీయ కాలమునండి వీరికి ముసునూరివారికి సంబంధబాంధవ్యములున్నాయి.
 
గండికోట పాలకునిగా కీర్తిప్రతిష్టలు బడసిన తిమ్మా నాయుని మునిమనుమడు రామలింగ నాయుడు. తిమ్మానాయుని కొడుకు వీరతిమ్మానాయునికి చెన్నప్పయను కుమారుడున్నాడు. చెన్నప్పకు రామలింగ మరియు, పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులున్నారు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధునిగా [[బహుళ]] పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. రామలింగ గండికోటను 1509 నుండి 1530 వరకు పాలించాడు. ఈతనివద్ద మహాయోధులగు 80000 సైనికులున్నారు. విజయనగరములో బస చేయడానికి 1430 కుంటల స్థలముంది. శ్రీక్రిష్ణదేవరాయలకు సామంతునిగా యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, గొల్లకొండ మరియు, అహమ్మదునగరు సేనలపై ఒకేమారి [[విజయము]] సాధించి ముగ్గురు తురుష్క వజీరులను సంహరించి క్రిష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యాడు. [[రాయచూరి యుద్ధము]]లో అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలాడు. రామలింగని సాహసములను కవి రాయవచకము అను గ్రంథములో పలువిధాల కొనియాడాడు. రామలింగ [[అనంతపూరు]] మండలములో పలు దేవాలయములు కట్టించాడు. పోర్చుగీసు చరిత్రకారుడు న్యూనెజ్ రామలింగనాయుని కామనాయక్ అని ఉదహరించాడు.
 
రామలింగనాయుని [[తమ్ముడు]] పెద్దతిమ్మానాయుడు కూడ మహా యోధుడు. ఈతడు దస్తూరు ఖాను అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యాడు.